గోపీచంద్ మరోసారి ద్విపాత్రాభినయం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తన కెరీర్ లో ఒకే ఒక సారి ద్విపాత్రాభినయం చేశాడు యాక్షన్ హీరో గోపీచంద్. ‘గౌతమ్ నందా’ పేరుతో రూపొందిన ఆ సినిమా డిజాస్టర్ అయింది. ఇప్పుడు మరోసారి గోపీచంద్ ద్విపాత్రాభినయం చేయబోతున్నాడట. ఆ సినిమాయే తేజ దర్శకత్వంలో రూపొందనున్న ‘అలిమేలుమంగ వేంకటరమణ’. ఈ సినిమాలో గోపీచంద్ డబుల్ రోల్ లో కనిపిస్తాడట. ట్విన్స్ గా పుట్టిన ఇద్దరు అనుకోకుండా విడిపోయి ముప్పై ఏళ్ల తరువాత శత్రువులుగా కలిస్తే ఎలా ఉంటుందనే పాయింట్ తో ఈ సినిమా ఉంటుందట. ఈ సినిమాకు దర్శకుడు తేజ. గోపీచంద్ కి నటుడిగా లైఫ్ ఇచ్చిన దర్శకుడు తేజనే. ‘జయం’ సినిమాతో గోపీకి హిట్ ఇచ్చిన తేజ ఆ తర్వాత తనతో ‘నిజం’లో కూడా ప్రతినాయకుడు పాత్ర పోషింప చేశాడు. అయితే ఆ తర్వాత వీరిద్దరి కలయికలో సినిమా రాలేదు. దాదాపు 18 ఏళ్ళ తర్వాత వీరిద్దరి కలయిలో సినిమా రానుంది. ఇప్పుడు తేజ, గోపీచంద్ కోసం ఓ యాక్షన్ స్క్రిప్ట్ సిద్ధం చేశాడట. ‘అలిమేలుమంగ వేంకటరమణ’ పేరుతో వస్తున్న ఈ సినిమాలో అలిమేలు మంగగా కీర్తి సురేష్ ను ఎంపిక చేసినట్లు వినిపిస్తోంది. మరి రెండో సారి ద్విపాత్రాభినయం చేయబోతున్న గోపీచంద్ ఈ సారైనా హిట్ కొడతాడేమో చూడాలి.
Also Read
- Ram Charan: మెగాస్టార్ ఇంట్లో వినాయక చవితి వేడుకలు.. ఫ్యామిలీతో కలిసి రామ్ చరణ్ ప్రత్యేక పూజలు! వైరల్ వీడియో..
- Kabir Duhan Singh: 'హనుమాన్ అంశ్' బాటలోనే మరో డివైన్ మూవీ? అయోధ్య బాల రాముడి కథతో సినిమా!
- Director Shouryuv: నెట్ఫ్లిక్స్ సమర్పణలో 'హాయ్ నాన్న' డైరెక్టర్ లార్జర్-దేన్-లైఫ్ ప్రాజెక్ట్! అసలు కథ ఇదే..
- Tharun - Eesha: జంటగా గణపయ్య పూజలో తరుణ్ భాస్కర్ - ఈషా రెబ్బ ! ఇక పెళ్లికి అఫీషియల్ ప్రకటన వచ్చినట్లేనా ?
తాజావార్తలు
-
West Bengal: బీజేపీలోకి 17 మంది తృణమూల్ రెబల్ ఎంపీలు.!
-
Ram Charan: మెగాస్టార్ ఇంట్లో వినాయక చవితి వేడుకలు.. ఫ్యామిలీతో కలిసి రామ్ చరణ్ ప్రత్యేక పూజలు! వైరల్ వీడియో..
-
Saudi Arabia: ఒక్క నదీ బారదు.. అయినా పైసలే పైసలు! ఎడారిల 1000 కోట్ల మొక్కలతో మాయ చేసిన దేశం ఇదే..
-
Disha Salian Case: దిశ సాలియన్ కేస్.. సీబీఐ ఎఫ్ఐఆర్లో ఆదిత్య ఠాక్రే, రియా పేర్లు..
-
Kabir Duhan Singh: ‘హనుమాన్ అంశ్’ బాటలోనే మరో డివైన్ మూవీ? అయోధ్య బాల రాముడి కథతో సినిమా!
ట్రెండింగ్
-
Ganga Aarti in London: లండన్లో తొలిసారి గంగా హారతి.. థేమ్స్ నది తీరంలో ఆధ్యాత్మిక సందడి.!
-
Ragi Drumstick Leaves Roti: డయాబెటిస్, బీపీ ఉన్నవారికి సంపూర్ణ ఆహారం.. సంపూర్ణ పోషణనిచ్చే ‘రాగి మునగాకు రొట్టె’ చేసేయండి ఇలా.!
-
Beetroot Pachadi: బీట్రూట్ అంటే నచ్చదా? ఇలా పచ్చడి చేసి పెట్టండి.. ప్లేట్ మొత్తం ఖాళీ చేసేస్తారు.!
-
India Women: నాలుగింటిలో నాలుగు.. ఆరింటిలో నాలుగు.. ఆసియా కప్లో భారత్ హవా!
-
Rajyogam: 200 ఏళ్ల తర్వాత అరుదైన యోగం.. ఈ 5 రాశుల వారికి పట్టిందల్లా బంగారమే..!