ప్రిన్స్ మహేశ్ బాబు – త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబోలో మూడో చిత్రానికి లైన్ క్లియర్ అయ్యింది. అన్ని అనుకున్నట్టు జరిగితే… అతి తర్వలో ఈ మూవీ అధికారిక ప్రకటన వస్తుందట. ‘అతడు, ఖలేజా’ సినిమాల చేదు అనుభవాన్ని మరిపిస్తూ… వీరి సరికొత్త చిత్రం ఉండాలని అభిమానులంతా ఆశపడుతున్నారు. ‘అల వైకుంఠపురములో’ సినిమా తర్వాత ఎన్టీయార్ తో త్రివిక్రమ్ సినిమా చేయబోతున్నాడంటూ ఆ మధ్య అధికారిక ప్రకటన వచ్చింది. ‘ట్రిపుల్ ఆర్’ తర్వాత పట్టాలెక్కే ఎన్టీయార్ సినిమా ఇదే అని అన్నారు. కానీ చిత్రంగా ఇప్పుడు ఆ సినిమా నిర్మాతలే కాదు… దర్శకుడూ మారిపోయాడు. కొరటాల శివ దర్శకత్వంలో ఎన్టీయార్ మూవీ ఉంటుందన్న ప్రకటన రావడంతో మరి త్రివిక్రమ్ నెక్ట్స్ మూవీ ఏంటనే ప్రశ్న సహజంగానే ఉదయించింది. దీనికి సమాధానంగా ప్రిన్స్ మహేశ్ బాబు పేరు వినిపిస్తోంది. మహేశ్ తో ‘అతడు, ఖలేజా’ చిత్రాలు తీసిన తివిక్రమ్ ఎప్పటి నుండో మరో సినిమా చేయాలని చూస్తున్నారు. ఇప్పటికే మహేశ్ కు త్రివిక్రమ్ ఓ కథ కూడా చెప్పాడని, దానికి అతడు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని అంటున్నారు. విశేషం ఏమంటే… సూపర్ స్టార్ కృష్ణ పుట్టిన రోజైన మే 31న ఈ సినిమా పూజా కార్యక్రమాలు జరగొచ్చని వినిపిస్తోంది. సర్కారు వారి పాట’లో నటిస్తున్న మహేశ్ ఆ తర్వత ఈ మూవీనే చేస్తాడట.
మహేశ్ తో త్రివిక్రమ్ తీసిన రెండు సినిమాల్లో ‘అతడు’ కాస్ట్ ఫెయిల్యూర్. ఆ సినిమా ఇప్పటికీ టీవీలో వేస్తే సూపర్ హిట్టే. అలానే ‘ఖలేజా’ను థియేటర్లలో చూసినప్పుడు ప్రేక్షకులు పెదవి విరిచారు కానీ ఆ తర్వాత టీవీలో వస్తుంటే మాత్రం బాగానే ఎంజాయ్ చేస్తున్నారు. ఆ రకంగా తనని ఫ్యామిలీ ఆడియెన్స్ కు చేరువ చేసిన త్రివిక్రమ్ మీద సహజంగానే మహేశ్ కు అభిమానం ఏర్పడింది. అందుకే ఆయన ఎప్పుడంటే అప్పుడు మూడో సినిమా చేయడానికి మహేశ్ మెంటల్ గా ఫిక్స్ అయిపోయాడని సన్నిహితులు చెబుతుంటారు. ఇప్పుడు ఎన్టీయార్ తో ఉన్న కమిట్ మెంట్ కూడా పక్కకెళ్ళిపోయింది కాబట్టి… మహేశ్, త్రివిక్రమ్ కాంబో మూవీ అధికారిక ప్రకటన అతి త్వరలో వెలువడుతుందంటున్నారు. ఈ చిత్రాన్ని హారిక అండ్ హాసిని బ్యానర్ లో తీసే ఛాన్స్ కనిపిస్తోంది. ఎందుకంటే… గత కొన్నేళ్ళుగా త్రివిక్రమ్ వేరే బ్యానర్లో మూవీస్ చేయడం లేదు. తన కథ నచ్చిన హీరోని అదే బ్యానర్ లో చేసేలా ఒప్పిస్తున్నాడు కూడా! ఆ రకంగా చూస్తే… హారిక అండ్ హాసిని సంస్థకు ఓ క్రేజీ సూపర్ స్టార్ దొరికినట్టే.