పవన్ కళ్యాణ్ కేవలం పవర్ స్టార్ కాదు… జనసేనాని కూడా… అందువల్ల ఆచితూచి అడుగేస్తూ సమాజానికి ఉపయోగపడే కథలనే ఎంచుకుంటున్నారు… క్రిష్ డైరెక్షన్ లో పవన్ నటించే సినిమాలోనూ జనానికి మేలు చేసే పాత్రలోనే జనసేనాని కనిపించనున్నాడట… పవన్ కళ్యాణ్ హీరోగా నటిస్తున్న ఫస్ట్ పీరియడ్ మూవీ ‘హరి హర వీరమల్లు’… పీరియడ్ మూవీస్ అంటే డైరెక్టర్ క్రిష్ కు ప్రాణం… ఇప్పటికే ‘గౌతమీపుత్ర శాతకర్ణి’ వంటి పీరియడ్ మూవీతో బిగ్ హిట్ సాధించాడు క్రిష్… ఇప్పుడు పవన్ ను ‘హరి హర వీరమల్లు’గా చూపించి, అదే మ్యాజిక్ చేయబోతున్నాడు. ఇందులో ఉన్నవారిని దోచి, పేదవారికి పంచే పాత్రలో పవన్ కళ్యాణ్ కనిపిస్తాడట… ఇలాంటి కథలు వినగానే మనకు ఇంగ్లిష్ ఫోక్లోర్ హీరో రాబిన్ హుడ్ గుర్తుకు రాకమానడు… ధనవంతులను దోచుకొని, పేదలకు పంచే పాత్రగా రాబిన్ హుడ్ జనం మదిలో నిలచి పోయాడు… రాబిన్ హుడ్ 14వ శతాబ్దానికి చెందినవాడిగా రచయితలు చిత్రీకరించారు… క్రిష్ తన కథలో వీరమల్లును 17వ శతాబ్దానికి చెందినవాడిగా చూపిస్తున్నట్టు సమాచారం… ఇందులోనూ మన దేశం వచ్చిన విదేశీయులను వీరమల్లు ముప్పుతిప్పలు పెట్టే సన్నివేశాలు ఉన్నాయట!
రాబిన్ హుడ్ ఆ నాటి ఇంగ్లిష్ షరీఫ్స్ కు కంటిమీద కునుకు లేకుండా చేశాడు… అలాగే ‘హరి హర వీరమల్లు’లో హీరో పాత్ర మొఘల్ చక్రవర్తి ఔరంగజేబు కాలంలో నాటి అన్యాయాలను ఎదిరిస్తూ సాగుతుందట… ఔరంగజేబు 49 ఏళ్ళు పాలన సాగించాడు… అతని పరిపాలన సమయంలోనే విదేశీయులు పాశ్చాత్యులు మన దేశంలో తొలి అడుగులు వేశారు… ఆ రోజుల్లో ఎంతోమది పేదలకు అన్యాయం జరిగింది… దానిని ఎదిరించి, వీరమల్లు ఎలా జనం మదిని గెలుచుకున్నాడన్నదే ‘హరి హర వీరమల్లు’ కథ గా తెలుస్తోంది… జనసేనాని పవన్ ఇలాంటి కథల్లో నటిస్తే జనానికి మరింత చేరువ అవుతాడనీ అభిమానుల విశ్వాసం… అభిమానులు కోరుకొనే అన్ని అంశాలు ఇందులో పుష్కలంగా ఉంటాయని సమాచారం.. ఏ.ఎమ్.రత్నం నిర్మిస్తున్న ఈ ‘హరి హర వీరమల్లు’ చిత్రం రాబోయే సంవత్సరం సంక్రాంతి కానుకగా జనం ముందు నిలవనుంది… మరి రాబిన్ హుడ్ ను తలపించే వీరమల్లు ఏ రీతిన ఆకట్టుకుంటాడో చూడాలి.