ఉగాది రోజున నరేశ్, అలీ నటిస్తున్న ‘అందరూ బావుండాలి అందులో నేనుండాలి’ సినిమాకు శుభాశీస్సులు అందచేశారు సూపర్ స్టార్ కృష్ణ. మలయాళ హిట్ ‘వికృతి’కి రీమేక్‌గా వస్తోంది ఈ చిత్రం. సోషల్ మీడియాలో అత్యుత్సాహం ప్రదర్శించే వారి వల్ల అమాయకులు ఎటువంటి ఇబ్బందులు ఎదుర్కొంటారనే కథాంశంతో ఈ చిత్రం రూపొందుతోంది. అలీవుడ్ ఎంటర్‌టైన్‌మెంట్ పతాకంపై అలీ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. శ్రీపురం కిరణ్ దర్శకత్వం వహిస్తున్నారు. దాదాపు ఈ చిత్రం షూటింగ్ పూర్తియింది. ఉగాది రోజున ‘అందరూ బావుండాలి అందులో నేనుండాలి’కి నా బ్లెస్సింగ్స్ కావాలని అడిగారు. చక్కని టైటిల్‌తో వస్తున్న ఈ సినిమా ద్వారా అలీకి నిర్మాతగా మంచి పేరుతో పాటు డబ్బు రావాలని కోరుకుంటున్నా అన్నారు హీరో కృష్ణ. షూటింగ్‌తో పాటు డబ్బింగ్ కూడా పూర్తి చేసిన ఈ చిత్రంలో తన భార్య పాత్రలో పవిత్రా లోకేశ్ నటించినట్లు నరేశ్ చెప్పారు. ఉగాదితో పాటు, ముస్లిం సోదరుల రంజాన్ నెల ప్రారంభరోజున కృష్ణగారి ఆశీస్సులు దక్కటం ఆనందంగా ఉందని ప్రస్తుతం పోస్ట్‌ప్రొడక్షన్ జరుగుతోందని, మే నెల రెండో వారానికి మొత్తం పూర్తవుతుందన్నారు ఆలీ. ఏ.ఆర్ రెహమాన్ అసిస్టెంట్ రాకేశ్ పళిదం ఈ చిత్రంతో సంగీత దర్శకునిగా పరిచయం అవుతన్నారు. ఇన్‌స్టాగ్రామ్ స్టార్ ప్రణవి మానుకొండ నరేశ్ కూతురిగా కీలకపాత్రలో కనిపించనున్నారు.