బాలీవుడ్ బ్యూటీ అలియా భట్ కరోనా నుంచి కోలుకున్నారు. ఈ విషయాన్ని అలియా తన ఇన్స్టాగ్రామ్ ద్వారా వెల్లడించారు. నీలిరంగు డెనిమ్ చొక్కా, పింక్ ప్యాంటు ధరించిన బ్యూటిఫుల్ పిక్ ను షేర్ చేస్తూ తనకు కరోనా నెగెటివ్ వచ్చిందని తెలిపింది అలియా. గత కొన్ని రోజుల క్రితం అలియా భట్ కు కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయ్యింది. తాజాగా తన ఇన్స్టాగ్రామ్ స్టోరీస్ లో “నాకు కోవిడ్ -19 నెగెటివ్ గా నిర్ధారణ అయ్యింది. ఐసొలేటింగ్ లో ఉండి డాక్టర్లతో మాట్లాడిన తరువాత… ఈరోజు నుంచి మళ్ళీ షూటింగ్ లో పాల్గొనబోతున్నాను. దయచేసి జాగ్రత్తగా ఉండండి” అంటూ పోస్ట్ చేసింది. మార్చి నెలలో అలియా, రణబీర్ కపూర్ కోవిడ్-19 బారిన పడ్డారు. ప్రస్తుతం ఇద్దరూ కరోనా నుంచి కోలుకున్నారు. ఇక వర్క్ విషయానికొస్తే… రణబీర్ కపూర్, అమితాబ్ బచ్చన్‌లతో పాటు అలియా ‘బ్రహ్మాస్త్రా’లో నటిస్తోంది. ఎస్.ఎస్.రాజమౌళి తెరకెక్కిస్తున్న ‘ఆర్‌ఆర్‌ఆర్’లో సీతగా నటిస్తోంది. అలియా ప్రధాన పాత్రలో సంజయ్ లీలా భన్సాలీ రూపొందించిన ‘గంగూబాయి కతియావాడి’ చిత్రం విడుదలకు సిద్ధంగా ఉంది.