Pankaj Chaudhary: ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ అడ్డాలో రాష్ట్ర బీజేపీ అధ్యక్ష పదవికి కేంద్ర సహాయ మంత్రి పంకజ్ చౌదరి నామినేషన్ దాఖలు చేశారు. నామినేషన్ దాఖలు చేసే సమయంలో ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్, ఇద్దరు ఉప ముఖ్యమంత్రులు ఆయన వెంట ఉన్నారు. డిసెంబర్ 14 ఆదివారం రోజు ఓటింగ్ రేపు జరుగుతుంది. ఆ తర్వాత కొత్త రాష్ట్ర అధ్యక్షుడి పేరును ప్రకటిస్తారు. అయితే పంకజ్ చౌదరి తప్ప మరెవరూ రాష్ట్ర బీజేపీ అధ్యక్ష పదవికి నామినేషన్ దాఖలు చేయలేదు. దీంతో ఓటింగ్ జరిగే అవకాశం చాలా తక్కువ అని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.
READ ALSO: Lionel Messi Hyderabad Tour: కలకత్తా మెస్సీ టూర్‌లో గందరగోళంతో హైదరాబాద్ లో భద్రత పెంపు!
అధ్యక్ష పదవికి నామినేషన్ దాఖలు చేయడానికి ఆయన ఈరోజు ఢిల్లీ నుంచి లక్నోకు వచ్చినప్పుడు ఆయనకు సాదర స్వాగతం లభించింది. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఎంపీలందరినీ లక్నోకు పిలిపించామని, వాళ్లతో పాటు తాను కూడా వెళ్తున్నానని ఆయన చెప్పారు. యూపీ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఎన్నిక కావడం గురించి అడిగినప్పుడు, అలాంటిదేమీ లేదని, తాను కేవలం సమావేశానికి వెళ్తున్నానని అన్నారు. అలాగే పార్టీ హైకమాండ్ తనకు ఏ బాధ్యత ఇచ్చినా నెరవేరుస్తానని చెప్పారు. ఆ సమయంలో ఆయనతో పాటు పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, యూపీ ఎన్నికల పరిశీలకుడు వినోద్ తవ్డే కూడా ఉన్నారు.
సీఎం యోగి ఆదిత్యనాథ్, పంకజ్ చౌదరి ఇద్దరూ కూడా గోరఖ్‌పూర్ ప్రాంతానికి చెందినవారు. పంకజ్ చౌదరి తూర్పు ఉత్తరప్రదేశ్‌లోని మహారాజ్‌గంజ్ నుంచి ఏడుసార్లు ఎంపీగా ఎన్నికయ్యారు. ఆయన తన రాజకీయ జీవితాన్ని కౌన్సిలర్‌గా ప్రారంభించి, గోరఖ్‌పూర్ డిప్యూటీ మేయర్‌గా, ఆపై 1991లో తొలిసారి పార్లమెంటు సభ్యుడయ్యారు. యోగి ఆదిత్యనాథ్ రాజకీయాల్లోకి అడుగుపెట్టిన నాటి నుంచి కూడా ఈ ప్రాంత రాజకీయాల్లో పంకజ్ చౌదరి ఆయనకు ప్రత్యర్థిగా ఉన్నారు. పంకజ్ చౌదరి బీజేపీ రాష్ట్ర అధ్యక్ష పదవికి ఎదగడం ఉత్తరప్రదేశ్ రాజకీయాల్లో యోగి అధికారానికి కళ్లెం వేయడంగా భావిస్తున్నారు. పంకజ్ చౌదరిని బీజేపీ కేంద్ర నాయకత్వానికి ప్రతినిధిగా పలువురు రాజకీయ విశ్లేషకులు పరిగణిస్తున్నారు.
READ ALSO: Off The Record: పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ కు సీట్లు తగ్గాయా ? ఎమ్మెల్యేలు పట్టించుకోలేదా ?