శర్వానంద్… వైవిధ్యమైన పాత్రలతో స్టార్ డమ్ చేరుకున్న టాలీవుడ్ హీరో. ‘ప్రస్థానం’ మొదలు నిన్న మొన్నటి ‘శ్రీకారం’ వరరకూ శర్వానంద్ చేసిన సినిమాలు చూసిన వారికి తన రూటే సెపరేట్ అన్నది ఇట్టే అర్థం అవుతుంది. సినిమాల జయాపజయాలకు అతీతంగా ఏ సినిమాకు ఆ సినిమా భిన్నంగా ఉండేలా చూసుకుంటూ జర్నీ కొనసాగిస్తున్నాడు శర్వానంద్. ఇతగాడు మరోసారి ఖాకీ వేయబోతున్నాడట. గతంలో ‘రాధ’ సినిమాలో పోలీస్ పాత్ర పోషించి అలరించాడు. అయితే ఆ సినిమా బాక్సాఫీస్ వద్ద బాల్చీ తన్నేసింది. ఈ సారి పూర్తిగా సీరియస్ పోలీస్ ఆఫీసర్ పాత్ర పోషించబోతున్నాడట. ఓ న్యూ డైరెక్టర్ చెప్పిన స్టోరీలైన్ శర్వాకు నచ్చిందట. పోలీస్ కథల్లో ఇది కొత్తగా ఉంటుందని శర్వా కూడా ఓకె చెప్పాడట. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు త్వరలో వెల్లడి కానున్నాయి.