బాలీవుడ్ హాట్ బ్యూటీ దిశా పటానికి భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న విషయం తెలిసిందే. తాజాగా దిశా షేర్ చేసిన ఓ పిక్ ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారింది. దిశా తన ఇన్స్టాగ్రామ్ లో బ్లాక్ లేస్ బాడీసూట్ ధరించి, నేచురల్ మేకప్ లుక్ తో, హెయిర్ లీవ్ చేసి, ఎడమ చేతిలో సన్నని బ్లాక్ బ్యాండ్ ధరించిన పిక్ ను పోస్ట్ చేశారు. ఆమె ఈ పిక్ ను పోస్ట్ చేసిన కొన్ని గంటల్లోనే 16 లక్షల లైక్స్ రావడం విశేషం. ఇక ఆమె అభిమానులు ఆ పిక్ కు ఫైర్ అండ్ హార్ట్ ఎమోజీలతో కామెంట్స్ చేస్తున్నారు. మరికొంతమంది మాత్రం దిశను నేచురల్ బ్యూటీ అంటూ పొగుడుతున్నారు. ఇక దిశా పటాని సినిమాల విషయానికొస్తే… మోహిత్ సూరి దర్శకత్వంలో ‘ఏక్ విలన్ రిటర్న్స్’లో దిశా పటాని నటించనుంది. ప్రభుదేవా ‘రాధే: యువర్ మోస్ట్ వాంటెడ్ భాయ్’లో కూడా కనిపించనుంది. ఈ చిత్రంలో సల్మాన్ ఖాన్ ప్రధాన పాత్రలో నటించారు. రాధీప్ రూడీప్ హుడా, జాకీ ష్రాఫ్, మేఘా ఆకాష్, జరీనా వహాబ్ కూడా ముఖ్యమైన పాత్రల్లో నటించారు. ఏక్తా కపూర్ ‘కెటినా’లో కూడా దిశా నటించనుంది. ఈ చిత్రంలో అక్షయ్ ఒబెరాయ్, సన్నీ సింగ్ కూడా ఉన్నారు.