బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 చివరి ఘట్టానికి చేరుకోవడంతో టైటిల్ పోరు మరింత రసవత్తరంగా మారింది. ఇప్పుడు అందరి దృష్టి పవన్ కళ్యాణ్, తనూజ మధ్యే పోటీ ఉంటుందని ఉన్నా, టాప్ 5 లో ఎవరు ఉంటారనేది పెద్ద సస్పెన్స్. ‘అగ్నిపరీక్ష’ షో నుంచి వచ్చి, తనదైన ఆటతో ప్రేక్షకులను ఆకట్టుకున్న డెమోన్ పవన్ టాప్ 5కి అర్హుడే. రీతూ చౌదరితో లవ్ ట్రాక్ వలన కాస్త వెనకబడ్డా, ఫిజికల్ టాస్క్ లో మాత్రం ‘నాతో పోటీ పడలేరు’ అన్నంత పట్టుదలతో ఆడాడు. రీతూ ఎలిమినేట్ అయిన తర్వాత అతనిలో కొత్త కామెడీ యాంగిల్ బయటపడింది. ఇమ్మాన్యుయేల్‌ని మించిన ఎంటర్‌టైన్‌మెంట్ ఇస్తున్న పవన్, మొదటి నుంచీ ఇదే ఫన్ చూపించి ఉంటే నేరుగా టైటిల్ రేసులో ఉండేవాడని ప్రేక్షకులు అభిప్రాయపడుతున్నారు. అయితే,
Also Read : Krithi Shetty: కృతి శెట్టి కెరీర్‌కు.. దెబ్బ మీద దెబ్బ
ఇంత పాజిటివ్ ఇమేజ్ ఉన్నా డిమోన్ పవన్‌కు ఈ వారం షాక్ తగలబోతుంది. విశ్లేషకుల లెక్కల ప్రకారం, అందరూ ఊహించినంత భారీగా ఓటింగ్ పవన్‌కు పడట్లేదట! ప్రస్తుతం అతను డేంజర్ జోన్‌లో ఉన్నాడని, అతని కంటే భరణి, సంజన ఓటింగ్‌లో ముందున్నారని చెబుతున్నారు. సరైన పీఆర్ టీం సపోర్ట్ లేకపోవడం వల్లే పవన్‌కు అనుకున్న స్థాయిలో ఓట్లు రావట్లేదనే చర్చ నడుస్తోంది. ఒకవేళ ఈ వారం డబల్ ఎలిమినేషన్ జరిగితే, సుమన్ శెట్టితో పాటు డిమోన్ పవన్ కూడా ఎలిమినేట్ అయ్యే ఛాన్స్ ఉందని అంచనా వేస్తున్నారు. చివరి దశలో ఈ ఊహించని ట్విస్ట్ నిజమవుతుందా, లేక పవన్ సేఫ్ అవుతాడా అనేది చూడాలి.