Agent Anand Santosh Web Series: యూ ట్యూబర్, బిగ్ బాస్ ఫేమ్ షణ్ముఖ్ జశ్వంత్ హీరోగా నటించి వెబ్ సీరిస్ ‘ఏజెంట్ ఆనంద్ సంతోష్’ (ఎ.ఎ.ఎ.). అలంకృత, వైశాలీ హీరోయిన్లుగా నటిస్తున్న దీనిని ఇన్ఫినిటం అధినేత వందన నిర్మించారు. ఈ నెల 22 నుండి ఈ వెబ్ సీరీస్ ఆహాలో స్ట్రీమింగ్ కాబోతోంది. దీనిని అరుణ్ పవర్ డైరెక్ట్ చేశారు. ఇప్పటికే ఈ మూవీకి సంబంధించిన పోస్టర్లు, టీజర్ విడుదల కాగా తాజాగా ట్రైలర్ […]
కరోనా కల్లోలం కారణంగా ప్యాండమిక్ లో జనం ఓటీటీ ఫ్లాట్ ఫామ్స్ కు అడిక్ట్ అయ్యారు. థియేటర్లు తెరచిన తరువాత కూడా పోలోమని సినిమాలకు వెళ్ళడం లేదు. రెండు, మూడు వారాలు ఆగితే ఎటూ బిగ్ స్క్రీన్ పై రిలీజ్ అయిన సినిమా ఓటీటీల్లోనూ వస్తుంది కదా అని ఉదాసీనత జనంలో ఏర్పడింది. అయితే పాపులర్ స్టార్స్ సినిమాలను థియేటర్లలోనే చూడటానికి ప్రేక్షకులు ఇష్టపడుతున్నారు. మౌత్ టాక్ తో ఆకట్టుకున్న చిన్న సినిమాలనూ ఆదరిస్తున్నారు. కానీ, వస్తోన్న […]
హీరోయిన్ మెహ్రీన్ పిర్జాదా అమెరికా చుట్టేస్తోంది. చికాగో, న్యూయార్క్ పర్యటన ముగించుకుని ఫోరిడాలో సేదతీరుతోంది. ఫ్లోరిడాలోని మియామి బీచ్ లో సోదరుడు గుర్ఫతేతో కలిసి విహరిస్తున్న పిక్స్ ను సోషల్ మీడియాలో షేర్ చేసింది. సింగిల్-పీస్ స్విమ్‌సూట్‌లో యాచ్‌లో డ్యాన్స్ చేయడమే కాదు అట్లాంటిక్ సముద్రంలో అలలపై తేలుతూ ఈత కొట్టేస్తోంది. మెహ్రీన్ నటించిన ‘ఎఫ్ 3’ బాక్సాఫీస్ వద్ద విజయాన్ని సాధించినా అది అమ్మడికి ఎంత మాత్రం ప్లస్ కాలేదు. ఆ తర్వాత అమ్మడి ఖాతాలో […]
రాధేశ్యామ్ రిలీజ్ అయి నెలలు గడుస్తున్నా.. ప్రభాస్ కొత్త చిత్రాల నుంచి ఏవో చిన్న చిన్న షూటింగ్ అప్టేట్స్ తప్పితే.. టీజర్, ఫస్ట్ లుక్ లాంటివి రావడం లేదు. దాంతో ప్రభాస్ అభిమానులు సలార్, ఆదిపురుష్ నుంచి ఏదైనా బిగ్ అప్టేట్ ఇవ్వాలంటూ సోషల్ మీడియాలో పట్టుబడుతున్నారు. అంతేకాదు ఒకానొక సందర్భంలో మేకర్స్ పై ఫైర్ అవుతున్నారు. అయితే ప్రస్తుతం సలార్ షూటింగ్ జరుగుతోంది కాబట్టి.. అప్టేట్స్ లేట్ అయ్యే ఛాన్స్ ఉంది.. కానీ ఆదిపురుష్ […]
డి.వి.నరసరాజును చూడగానే చాలా గంభీరమైన వ్యక్తి అనిపిస్తారు. కొందరికి ముక్కోపిలా కనిపిస్తారు. ఆయన మాటకారి కాదు కానీ, ఆయన రచనలో జాలువారిన మాటలు తెలుగువారిని విశేషంగా మురిపించాయి. ‘గుండమ్మ’ను “గుండక్కా…” అని పిలిపించినదీ, ‘యమగోల’లో “తాళము వేసితిని గొల్లెము మరచితిని…” అని పలికించినదీ, “పిచ్చోడిలాగా ఏమిటి… ఖచ్చితమైన పిచ్చోడినైతే…” అంటూ శంకరం నోట ‘పెద్దమనుషులు’పై వ్యంగ్యం చిలికించినదీ నరసరాజే! దాట్ల వెంకట నరసరాజు 1920 జూలై 15న జన్మించారు. గుంటూరు జిల్లా సత్తెనపల్లి మండలం తాల్లూరు నరసరాజు […]
ఇవాళ టాలీవుడ్ లో నెంబర్ వన్ మ్యూజిక్ డైరెక్టర్ ఎవరు? అని ప్రశ్నిస్తే, మెజారిటీ జనం తమన్ పేరే చెబుతారు. పిన్న వయసులోనే తండ్రి దగ్గర సంగీత సాధన మొదలు పెట్టడమే కాదు… చిన్నప్పుడే చిత్రసీమలోకి వాద్య కళాకారుడిగా అడుగు పెట్టడం కూడా తమన్ కు కలిసి వచ్చింది. నిన్నటి తరం సంగీత దర్శకులు ఎంతోమంది దగ్గర తమన్ వర్క్ చేశాడు. విశేషం ఏమంటే… ఇప్పటికీ తన చిన్నప్పటి రోజులను, సంగీత గురువులను తమన్ తలుచుకుంటూనే […]
రామ్ పోతినేని హీరోగా నటించిన ‘ది వారియర్’ మూవీ గురువారం జనం ముందుకు రాబోతోంది. దీని తర్వాత ఈ చిత్ర నిర్మాత శ్రీనివాస చిట్టూరి బ్యానర్ లోనే బోయపాటి శ్రీను దర్శకత్వంలో ఓ పాన్ ఇండియా మూవీ చేస్తున్నాడు రామ్. దీని గురించి రామ్ మాట్లాడుతూ, ”నా సినిమాలు హిందీ ఆడియన్స్ బాగా రిసీవ్ చేసుకుంటున్నారు. అలానే బోయపాటి గారి సినిమాలు కూడా బాగా రిసీవ్ చేసుకుంటున్నారు. ఒక హీరోను బాగా రీసెర్చ్ చేసిన తర్వాత […]
ప్రముఖ దర్శకుడు డేవిడ్ ధావన్ కొడుకు వరుణ్; ప్రముఖ నటి, నిర్మాత శ్రీదేవి, బోనీకపూర్‌ల కుమార్తె జాన్వీ కపూర్ తొలిసారి జంటగా నటిస్తున్న సినిమా ‘బవాల్’. ఈ క్యూట్ లవ్ స్టోరీని ‘దంగల్’, ‘చిచ్చోరే’ ఫేమ్ నితేశ్ తివారీ తెరకెక్కిస్తున్నారు. సాజిద్ నడియాద్ వాలా నిర్మిస్తున్న ఈ సినిమా షూటింగ్ ఆ మధ్య లక్నోలో మొదలైంది. ఓ పట్టణానికి చెందిన కుర్రాడు, తమ ఊరికే చెందిన ఓ అందమైన అమ్మాయిని ఎలాగైనా పెళ్ళి చేసుకోవాలని కలలుకంటూ […]
పూరి జగన్నాథ్ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ హీరోగా తెరకెక్కిన ‘లైగర్’ ఆగస్టు 25న విడుదల కానుంది. ఈ చిత్రంలోని “అక్డి పక్డి…” అంటూ సాగే పాట అఫిసియల్ వీడియో సోమవారం (జూలై 11) మధ్యాహ్నం విడుదల చేశారు. ‘లైగర్’ అంటేనే “లయన్ కి, టైగర్ కి క్రాస్ బ్రీడ్…” అని అర్థం! ‘లైగర్’ ట్యాగ్ లైన్ కూడా “సాలా క్రాస్ బ్రీడ్…” అనే ఉంది. ఇక “అక్డి పక్డి..” పాటను సైతం సందడి సందడిగానే చిత్రీకరించారు. పాట […]
‘సోగ్గాడే చిన్ని నాయనా’ మూవీతో వెండితెర పైకి వచ్చిన అనసూయ కేవలం గ్లామర్ పాత్రలే కాకుండా డిఫరెండ్ క్యారెక్టర్స్ చేస్తూ ముందుకు సాగుతోంది. లేడీ ఓరియంటెడ్ మూవీస్ తో పాటు అవకాశం ఇవ్వాలే కానీ ఐటమ్ సాంగ్స్ కూ సై అనేస్తోంది అనసూయ. ఇదే సమయంలో ‘రంగస్థలం’ లాంటి చిత్రంలో రంగమ్మత్త పాత్రతో నటిగా తనను తాను ప్రూవ్ చేసుకుంది. పాత్ర ఎంపికలో ఆచితూచి అడుగేస్తున్న అనసూయ ఈ మధ్య కాలంలో మాత్రం తగ్గేదే లే […]