Smriti Mandhana and Palash Muchhal’s Full Breakup Story: భారత మహిళా క్రికెట్ జట్టు వైస్ కెప్టెన్, స్టార్ క్రికెటర్ స్మృతి మంధాన తన పెళ్లిపై స్వయంగా స్పందించిన విషయం తెలిసిందే. మ్యూజిక్ డైరెక్టర్ పలాష్ ముచ్చల్‌తో తన వివాహం రద్దు చేసుకున్నట్లు ఆదివారం ఇన్‌స్టాగ్రామ్ ద్వారా స్మృతి వెల్లడించారు. పెళ్లి విషయాన్ని ఇక్కడితో ముగించాలని తాను భావిస్తున్నా అని, అందరూ కూడా తన వ్యక్తిగత జీవితాన్ని గౌరవించాలని కోరారు. దాంతో గత కొన్ని వారాలుగా స్మృతి-పలాష్ పెళ్లిపై వచ్చిన ఊహాగానాలకు తెరపడింది. గత ఏడాది కాలంగా వార్తల్లో నిలిచిన ఈ ఇద్దరి లవ్, ప్రపోజ్, బ్రేకప్ స్టోరీని ఓసారి తెలుసుకుందాం.
జూలై 2024:
జూలై 2024లో స్మృతి మంధాన, పలాష్ ముచ్చల్ తమ సంబంధాన్ని ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్ ద్వారా బహిరంగంగా ప్రకటించారు. ఐదు సంవత్సరాల వార్షికోత్సవ సందర్భంగా 5వ సంఖ్యతో ఉన్న కేక్‌ను కట్ చేసి.. తాము లవ్‌లో ఉన్నామని చెప్పారు.
అక్టోబర్ 2025:
ఒక ప్రెస్ ఈవెంట్‌లో పలాష్ ముచ్చల్ సరదాగా మాట్లాడుతూ.. తాను త్వరలో ఇండోర్‌కు అల్లుడిని అవుతానని చెప్పాడు. దీంతో అభిమానులు స్మృతి-పలాష్ పెళ్లికి గడియలు దగ్గర పడ్డారని కామెంట్స్ చేశారు.
2 నవంబర్ 2025:
భారత మహిళా క్రికెట్ జట్టు ఫైనల్లో దక్షిణాఫ్రికాను ఓడించి తొలిసారి వన్డే ప్రపంచకప్ గెలుచుకుంది. పలాష్ ముచ్చల్ కూడా భారత జట్టు వేడుకల్లో పాల్గొన్నారు. ఇద్దరు కలిసి దిగిన ఫోటోలు నెట్టింట వైరల్ అయ్యాయి.
నవంబర్ 2025:
ముంబైలోని డివై పాటిల్ స్టేడియంలో స్మృతికి సినిమా తరహాలో పలాష్ ప్రపోజ్ చేశాడు. స్మృతి కళ్లకు గంతలు కట్టి మైదానంలోకి తీసుకువచ్చి.. మోకాలిపై కూర్చుకొని పలాష్ ప్రపోజ్ చేశాడు. ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది.
Also Read: ఓరి దేవుడా, మరీ ఇంత తక్కువా.. Google Pixel 9 Proపై దిమ్మతిరిగే ఆఫర్ భయ్యో!
21 నవంబర్:
నవంబర్ మధ్యలో వివాహానికి సంబంధించి పనులు ప్రారంభమయ్యాయి. హల్ది వేడుక నవంబర్ 21న, మెహంది వేడుక నవంబర్ 22న జరిగాయి. ఈ వేడుకల్లో భారత జట్టు ప్లేయర్స్ కూడా పాల్గొన్నారు. ఆ ఫోటోలు, వీడియోస్ కూడా వైరల్ అయ్యాయి.
23 నవంబర్:
పెళ్లి రోజు సాంగ్లిలో అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఉన్నపళంగా స్మృతి తండ్రి ఆస్పత్రి పాలవ్వడంతో వివాహం వాయిదా పడింది. ఈ సమయంలో పలాష్ కూడా అనారోగ్యానికి గురై ఆసుపత్రి పాలయ్యాడు.
నవంబర్ చివరలో:
వివాహం వాయిదా అనంతరం సోషల్ మీడియాలో వివిధ ఊహాగానాలు మొదలయ్యాయి. పలాష్, స్మృతి మధ్య తీవ్ర వాగ్వాదం జరిగిందని ప్రచారం జరిగింది. ఆపై స్మృతి తన సోషల్ మీడియా ఖాతా నుంచి వివాహ ఫోటోలను తొలగించింది. టీమిండియా ప్లేయర్స్ కూడా స్మృతి-పలాష్ హల్ది ఫోటోలను తొలగించారు. ఇది ఊహాగానాలకు మరింత ఆజ్యం పోసింది.
7 డిసెంబర్ 2025:
డిసెంబర్ 7న స్మృతి మంధాన తన పెళ్లి వాయిదాపై అధికారిక ప్రకటన విడుదల చేసింది. స్మృతి తన వివాహ రద్దును ధృవీకరించింది. ప్రతి ఒక్కరూ తన వ్యక్తిగత గోప్యతను కాపాడుకోవాలని విజ్ఞప్తి చేసింది.