‘గూగుల్’ ఇటీవలే పిక్సెల్ 10 సిరీస్‌ను లాంచ్ చేసింది. కొత్త సిరీస్ లాంచ్ నేపథ్యంలో మునుపటి ఫ్లాగ్‌షిప్ అయిన గూగుల్ పిక్సెల్ 9 సిరీస్ ధరలను తగ్గించింది. ముఖ్యంగా పిక్సెల్ 9 ప్రోపై గణనీయమైన తగ్గింపును అందించింది. ఈ ఫోన్ ప్రముఖ ఇ-కామర్స్ సంస్థ అమెజాన్‌లో 25 వేల కంటే ఎక్కువ ధర తగ్గింపుతో అందుబాటులో ఉంది. డిస్కౌంట్ తర్వాత రూ.89,000 కంటే తక్కువకు ధర మీ సొంతమవుతుంది. మీరు తక్కువ ధరలో ప్రీమియం స్మార్ట్‌ఫోన్ కోసం చూస్తున్నట్లయితే.. ఈ ఆఫర్ బెస్ట్ అని చెప్పొచ్చు. పిక్సెల్ 9 ప్రోపై ఉన్న ఆఫర్ ఫుల్ డీటెయిల్స్ ఓసారి చూద్దాం.
భారతదేశంలో గూగుల్ పిక్సెల్ 9 ప్రో ఫోన్ రూ.1,09,999కే లాంచ్ అయింది. ప్రస్తుతం అమెజాన్‌లో రూ.21,009 ఫ్లాట్ డిస్కౌంట్‌ను అందిస్తోంది. దాంతో ఈ ఫోన్ ధర రూ.88,990కి తగ్గింది. అంటే మీకు 19 శాతం తగ్గింపును అమెజాన్ అందిస్తోంది. హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ ఈఎంఐపై అదనంగా రూ.3,750 తగ్గింపు ఉంది. దాంతో ఫోన్ ధర 85 వేలకు తగ్గుతుంది. ఇక ఎక్స్‌ఛేంజ్ ఆఫర్ కూడా అందుబాటులో ఉంది. మీ పాత స్మార్ట్‌ఫోన్‌ను ఎక్స్‌ఛేంజ్ చేసుకోవడం ద్వారా పిక్సెల్ 9 ప్రోపై మరింత డబ్బు ఆదా చేసుకోవచ్చు. ఈ ఆఫర్ పరిమిత కాలం మాత్రమే ఉంటుంది.
Also Read: Arshad Khan History: ఐపీఎల్ 2026 వేలానికి ముందే అర్షద్ ఖాన్ చరిత్ర!
గూగుల్ పిక్సెల్ 9 ప్రో ఫీచర్స్:
# 6.3-అంగుళాల ఎల్‌టీపీఓ ఓఎల్‌ఈడీ డిస్‌ప్లే
# 495 పీపీఐతో కూడిన పిక్సెల్ డెన్సిటీ
# 3,000 నిట్స్ వరకు బ్రైట్‌నెస్
# గూగుల్ కొత్త టెన్సర్ G4 చిప్‌సెట్
# 120 హెచ్‌జడ్ రిప్రెష్ రేట్
# గొరిల్లా గ్లాస్ విక్టస్ 2
# 50 ఎంపీ ఆక్టా పీడీ వైడ్, 49ఎంపీ క్వాడ్ పీడీ అల్ట్రావైడ్, 48 ఎంపీ క్వాడ్ పీడీ టెలిఫొటో కెమెరా
# సెల్ఫీల కోసం 42 ఎంపీ కెమెరా
# 4,700 ఎంఏహెచ్ బ్యాటరీ, 45W ఫాస్ట్ ఛార్జింగ్‌కు మద్దతు