‘సోగ్గాడే చిన్ని నాయనా’ మూవీతో వెండితెర పైకి వచ్చిన అనసూయ కేవలం గ్లామర్ పాత్రలే కాకుండా డిఫరెండ్ క్యారెక్టర్స్ చేస్తూ ముందుకు సాగుతోంది. లేడీ ఓరియంటెడ్ మూవీస్ తో పాటు అవకాశం ఇవ్వాలే కానీ ఐటమ్ సాంగ్స్ కూ సై అనేస్తోంది అనసూయ. ఇదే సమయంలో ‘రంగస్థలం’ లాంటి చిత్రంలో రంగమ్మత్త పాత్రతో నటిగా తనను తాను ప్రూవ్ చేసుకుంది. పాత్ర ఎంపికలో ఆచితూచి అడుగేస్తున్న అనసూయ ఈ మధ్య కాలంలో మాత్రం తగ్గేదే లే అన్నట్టుగా దూసుకుపోతోంది.
కృష్ణవంశీ దర్శకత్వంలో రూపుదిద్దుకుంటున్న మరాఠా చిత్రం ‘నటసమ్రాట్’ తెలుగు రీమేక్ ‘రంగమార్తాండ’లో అనసూయ ఓ కీలక పాత్రను పోషించింది. సోమవారం నుండి ఆ పాత్రకు సంబంధించిన డబ్బింగ్ ను అనసూయ ప్రారంభించింది. ఇదిలా ఉంటే… ఆమె ప్రధాన పాత్రలు పోషించిన రెండు సినిమాలు ఇప్పుడు బ్యాక్ టూ బ్యాక్ రాబోతున్నాయి. అందులో ఒకటి ‘దర్జా’. ఈ సినిమా ఇదే నెల 22న విడుదల అవుతోంది. అలానే కె. రాఘవేంద్రరావు సమర్పణలో శ్రీధర్ సీపాన తెరకెక్కించిన ‘వాంటెడ్ పండుగాడ్’లోనూ అనసూయ కీ-రోల్ ప్లే చేసింది. ఈ సినిమా ఆగస్ట్ 19న రిలీజ్ కాబోతోంది. అలానే కృష్ణవంశీ ‘రంగమార్తాండ’ సైతం ఆగస్ట్ లోనే విడుదల అవుతుందని అంటున్నారు. ఇది ఇలా ఉంటే వచ్చే యేడాది సమ్మర్ కు రాబోతున్న ‘పుష్ప-2’లో అనసూయ పాత్ర పూర్తిగా మరో స్థాయిలో ఉండబోతోందన్నది ఫిల్మ్ నగర్ టాక్!