Realme 16 Pro+ 5G: రియల్ మీ (Realme) సంస్థ నుండి కొత్త ప్రీమియం మిడ్‌రేంజ్ స్మార్ట్‌ఫోన్‌ను మార్కెట్‌కు తీసుకురావడానికి సిద్ధమవుతున్నట్లు లీక్స్ ప్రకారం తెలుస్తోంది. Realme 16 Pro+ 5G కి సంబంధించిన కీలక స్పెసిఫికేషన్లు లీక్ కావడంతో.. ఈసారి కంపెనీ మరింత మంచి అప్‌గ్రేడ్లను సిద్ధం చేస్తోందనే అంచనాలు పెరిగాయి. లీక్‌ల ప్రకారం Realme 16 Pro+ 5G భారత మార్కెట్లో 8GB+128GB, 8GB+256GB, 12GB+256GB, 12GB+512GB వంటి నాలుగు ర్యామ్, స్టోరేజ్ వేరియంట్లలో రానుంది. ఈ మొబైల్స్ కామోల్లియా పింక్, మాస్టర్ గోల్డ్, మాస్టర్ గ్రే అనే మూడు కొత్త కలర్ ఆప్షన్లు అందుబాటులో ఉండే అవకాశముంది. RMX5131 అనే మోడల్ నంబర్‌తో ఈ డివైస్‌ను రియల్‌మీ మార్కెట్లోకి తీసుకురావచ్చని కూడా సమాచారం.
Varanasi : రాజమౌళి గ్లోబల్ ప్లాన్ లీక్.. థియేటర్లలో ‘వారణాసి’ టీజర్ ప్లాన్ ?
ఈ స్మార్ట్‌ఫోన్‌లో ప్రధాన ఆకర్షణ కెమెరా అని చెప్పవచ్చు. లీక్ వివరాల ప్రకారం 16 Pro+ 5G లో 200MP ప్రధాన వెనుక కెమెరా ఉండబోతోంది. ఇది రియల్‌మీ సిరీస్‌లో ఇప్పటివరకు వచ్చిన అతిపెద్ద అప్‌గ్రేడ్. ఇక ముందర భాగంలో 50MP సెల్ఫీ కెమెరా ఉండే అవకాశం ఉందని లీక్ చెబుతోంది. డిస్‌ప్లే విషయానికి వస్తే.. ఫోన్ 6.78 అంగుళాల OLED స్క్రీన్, 1.5K రెసల్యూషన్, 144Hz రిఫ్రెష్ రేట్‌తో రావొచ్చని సమాచారం.
Gautam Gambhir: మీ హద్దుల్లో మీరు ఉంటే మంచిది.. టీమిండియా కోచ్ కీలక వ్యాఖ్యలు..!
ఇక రాబోయే Realme 16 Pro+ 5G లో 7,000mAh భారీ బ్యాటరీ ఉండే అవకాశముంది. ఇది గత Realme 14 Pro+ 5G లోని 6,000mAh బ్యాటరీతో పోలిస్తే మంచి అప్‌గ్రేడ్. ఫాస్ట్ చార్జింగ్ గురించిన వివరాలు వెల్లడి కాలేదు. అయితే Pro+ సిరీస్‌లోని చరిత్ర ఆధారంగా చార్జింగ్ స్పీడ్ కూడా మెరుగుపడే అవకాశం ఉంది. Realme 14 Pro+ 5G తో పోలిస్తే ఈ కొత్త మోడల్ డిస్‌ప్లే రిఫ్రెష్ రేట్, కెమెరా రిజల్యూషన్, బ్యాటరీ సామర్థ్యం వంటి అంశాలలో భారీ మార్పులను చూపిస్తోంది. ఇప్పటివరకు అధికారికంగా ఏ వివరాలు ప్రకటించకపోయినా.. వరుసలీక్‌లు బయట పడటం, బ్రాండ్ నుండి వచ్చిన కొత్త సిరీస్ టీజర్లు చూస్తే Realme 16 సిరీస్ కూడా త్వరలోనే లాంచ్ అయ్యే అవకాశం ఉంది.