Mani Sharma – Koti: అవును నిజం… మీరంటే నాకిష్టం అంటున్న తమన్!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఇవాళ టాలీవుడ్ లో నెంబర్ వన్ మ్యూజిక్ డైరెక్టర్ ఎవరు? అని ప్రశ్నిస్తే, మెజారిటీ జనం తమన్ పేరే చెబుతారు. పిన్న వయసులోనే తండ్రి దగ్గర సంగీత సాధన మొదలు పెట్టడమే కాదు… చిన్నప్పుడే చిత్రసీమలోకి వాద్య కళాకారుడిగా అడుగు పెట్టడం కూడా తమన్ కు కలిసి వచ్చింది. నిన్నటి తరం సంగీత దర్శకులు ఎంతోమంది దగ్గర తమన్ వర్క్ చేశాడు. విశేషం ఏమంటే… ఇప్పటికీ తన చిన్నప్పటి రోజులను, సంగీత గురువులను తమన్ తలుచుకుంటూనే ఉంటాడు. ఇటీవల ఆహాలో ‘తెలుగు ఇండియన్ ఐడల్’ కార్యక్రమంలోనూ తన సంగీత ప్రయాణాన్ని జ్ఞప్తికి తెచ్చుకున్నాడు. ముఖ్యంగా మణిశర్మ దగ్గర తాను పనిచేసిన రోజుల్ని, ఆయన చిత్రాలకు వాద్యకారుడిగా సహకారం అందించిన సంఘటనలను ఎక్కువ గుర్తు చేసుకున్నాడు. నిన్న తమన్ ఓ వీడియోను తన ఇన్ స్టాగ్రామ్ లో పోస్ట్ చేశాడు. అందులో తమన్ డ్రమ్స్ వాయిస్తుంటే, మణిశర్మ, కోటి కూడా అతనితో పాటే వాద్య పరికరాలను ప్లే చేస్తూ కనిపించారు. గిటార్ వాయించడంతో ఫేమస్ అయిన కోటి దానినే ప్లే చేశాడు. వీరంత కలిసి మణిశర్మ సంగీతం సమకూర్చిన ‘అతడు’ మూవీలోని ‘అవును నిజం… నువ్వంటే నాకిష్టం’ పాటను ప్లే చేశారు. బహుశా… జూలై 13 గురుపూజోత్సవం కాబట్టి… ఆ సందర్భంగా తన గురువులను స్మరించుకుంటూ తమన్ ఈ వీడియోను పోస్ట్ చేసి ఉండొచ్చు. బట్… తెలుగు సంగీతప్రియులకు మాత్రం ఈ ముగ్గురు టాప్ మ్యూజిక్ డైరెక్టర్స్ ఒకే వీడియో కనిపించడం, అదీ ఓ పాటకు వాద్య సహకారం అందించడం అనేది గొప్ప అనుభూతిని కలిగించింది.
Also Read
తాజావార్తలు
-
Harmanpreet Kaur: హర్మన్‌ప్రీత్ కౌర్ సంచలన నిర్ణయం!
-
Mandipalli Rama Prasad Reddy: వైసీపీకి ప్రజల్లోకి వెళ్లే సత్తా లేదు.. స్థానిక ఎన్నికల్లో కూటమి జెండా ఎగురవేస్తాం
-
IndiGo Flight Fare Hike: ఇండిగో విమాన ప్రయాణికులకు షాక్.. నేటి నుంచి రూ.350 వరకు అదనపు భారం, కొత్త ఛార్జీలు ఇవే!
-
Allu Arjun-Boyapati: అల్లు అర్జున్-బోయపాటి కాంబోకు బ్రేక్.. అసలు కారణం ఇదేనా?
-
Gold Rate Today: స్వల్పంగా తగ్గిన పసిడి ధరలు.. నేటి 18, 22, 24 క్యారెట్ల రేట్లు ఇవే..
ట్రెండింగ్
-
Suryakumar Yadav: సూర్యకుమార్ యాదవ్‌కు బిగ్ షాక్.. టీమ్‌లో నో ప్లేస్.. టీనేజర్‌కు వైస్ కెప్టెన్సీ!
-
Big Billion Days Offers: రూ.20,000 లోపు లభించే టాప్ స్మార్ట్‌ఫోన్ డీల్స్ ఇదిగో.. అస్సలు మిస్ కావద్దు.!
-
IND vs WI: ఇషాన్ కిషన్ జోరు.. అర్ష్‌దీప్ పేస్.. నేడే తొలి టీ20 మ్యాచ్..!
-
పెద్ద బటన్లు.. వాయిస్ గైడెన్స్.. ఎమర్జెన్సీ ఎస్ఓఎస్.. రూ.1,499కే itel Care..!
-
How to Make Murmura at Home: ప్రెజర్ కుక్కర్ ఉంటే చాలు.. ఇంట్లోనే కరకరలాడే బొరుగులు తయారు చేసుకోండి!