Agent Anand Santosh Web Series : సపోర్ట్ ప్లీజ్ అంటున్న షణ్ముఖ్ జస్వంత్!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Agent Anand Santosh Web Series: యూ ట్యూబర్, బిగ్ బాస్ ఫేమ్ షణ్ముఖ్ జశ్వంత్ హీరోగా నటించి వెబ్ సీరిస్ ‘ఏజెంట్ ఆనంద్ సంతోష్’ (ఎ.ఎ.ఎ.). అలంకృత, వైశాలీ హీరోయిన్లుగా నటిస్తున్న దీనిని ఇన్‌ఫినిటం అధినేత వందన నిర్మించారు. ఈ నెల 22 నుండి ఈ వెబ్ సీరీస్ ఆహాలో స్ట్రీమింగ్ కాబోతోంది. దీనిని అరుణ్ పవర్ డైరెక్ట్ చేశారు. ఇప్పటికే ఈ మూవీకి సంబంధించిన పోస్టర్లు, టీజర్ విడుదల కాగా తాజాగా ట్రైలర్ ను లాంచ్ చేశారు. ఈ సందర్భంగా నిర్మాత వందన మాట్లాడుతూ, ”మా దగ్గరికి ఈ కథ ఎప్పుడో వచ్చింది. కానీ సరైన పర్సన్ కోసం ఎదురుచూశాం. షణ్ముఖ్ మాకు ఎప్పటి నుంచో తెలుసు. అతను ఎదిగిన తీరు చూసి ఆశ్చర్యమేస్తుంది. సోషల్ మీడియా, డిజిటల్ స్టార్‌గా ఎదిగారు. మిస్టర్ షన్ను, సూర్య మీకు ఎలా నచ్చాడో మా ఏజెంట్ కూడా అంతే బాగా నచ్చుతాడు. సుబ్బు ఈ కథను మాకు చెప్పాడు. ఆయన ఒక్కసారి ఏదైనా స్క్రిప్ట్ చెబితే.. మళ్లీ మళ్లీ వినాల్సిన అవసరం లేదు. దర్శకుడు అరుణ్ పవార్ గురించి అందరూ చెప్పారు. కానీ అందరికీ తెలియని విషయం ఏంటంటే ఆయన అందరితో ఈజీగా కలిసిపోతారు. ఎంత కష్టమైన పనైనా కూడా సులభంగా చేసేస్తారు. హీరోయిన్లను కేవలం గ్లామర్ కోసమే తీసుకోలేదు. వారి పాత్రలు బాగుంటాయి. ఈ ప్రాజెక్ట్‌కి బ్యాక్ బోన్ అయిన మేనేజింగ్ డైరెక్టర్ ఎస్.డి. గారికి థ్యాంక్స్” అని అన్నారు. ఆహా సీఈవో అజిత్ ఠాకూర్ మాట్లాడుతూ, ”షన్నుతో ఓ వెబ్ సిరీస్ చేయాలని ఎప్పటి నుంచో అనుకున్నాం. ఇప్పుడు కుదిరింది. 18 నెలల క్రితం ఈ ప్రాజెక్ట్ గురించి చర్చించుకున్నాం. ఇలాంటి జానర్‌కు పది ఎపిసోడ్‌లు సరిపోవు. ఇంకా మున్ముందు మరింత కొత్త కంటెంట్‌తో ఎంటర్ టైన్ చేస్తాం. షన్నుకి, ఆయన టీంకు మీ ప్రేమను చూపించండి” అని అన్నారు.
Also Read
షణ్ముఖ్ జశ్వంత్ మాట్లాడుతూ, ”ఇదంతా నాకు కొత్తగా ఉంది. 2015లో హైద్రాబాద్‌కు వచ్చినప్పుడు ఇదంతా ఊహించలేదు. నాకంటూ ఓ టీజర్, ట్రైలర్ ఈవెంట్ ఉంటుందని అస్సలు ఊహించలేదు. ఇదంతా ఓ కలలా ఉంది. వైవా నుంచి నా సొంత ఛానెల్ మొదలుపెట్టి ఇన్‌ఫినిటంలో జాయిన్ అయి ‘ఆహా’ వరకు రావడం పెద్ద ప్రయాణం. ఇది నాకు ఎంతో నేర్పించింది. ఇంకా నేర్చుకుంటూనే ఉన్నాను. ఈ ప్రయాణంలో నాకు సుబ్బు బ్యాక్ బోన్‌లా ఉన్నాడు. మేం స్నేహితులం, రూమ్ మేట్స్ కూడా. ఆహాలో పని చేయాలని ఎప్పటి నుంచో అనుకుంటున్నాను. సుబ్బుతో నాకు అలవాటైంది. అరుణ్ పవార్ ఎలా ఉంటారో అనుకున్నారు. అరుణ్ పవార్ పేరు సింకేశ్. ఎవరితోనైనా సరే అలా సింక్ అయిపోతాడు. ఇక్కడకు వచ్చిన ఇంఫ్లూయెన్సర్స్ అందరికీ థ్యాంక్స్. అందరూ బాగుండాలి. అందులో మనం ఉండాలి. నేను ఎన్నో ఎత్తుపల్లాలు చూశాను. మీరు నాకు సపోర్ట్‌గా ఉంటూనే వస్తున్నారు. నాకు చేయాలని ఉంటుంది. మీరిచ్చే ప్రోత్సాహంతోనే ఇంకా ఇంకా బాగా నటించాలని అనుకుంటున్నాను. ‘ఏజెంట్ ఆనంద్ సంతోష్’ను అందరూ సపోర్ట్ చేయండి. మీ సపోర్ట్ లేకపోతే ఇక్కడ ఇలా ఉండను. ఇలా స్టేజ్ మీద నిల్చోలేను. మైక్ పట్టుకోలేను” అని అన్నారు.
ఈ కార్యక్రమంలో వెబ్ సీరిస్ లో నటించిన నటీనటులు, సాంకేతిక నిపుణులు పాల్గొన్నారు.
తాజావార్తలు
-
OTR : మేయర్ సీటు విషయంలో టీడీపీ ప్రయోగం చేస్తుందా?
-
Fahadh Faasil : ‘జై ఎన్టీఆర్’ అంటూ ఫాఫా.. తారక్‌తో ఆ రాత్రులు మరిచిపోలేనంటూ
-
Story Board : సైబర్ నేరాలు ఎందుకు పెరుగుతున్నాయి..?
-
Jr.NTR : కార్తికేయ నా తమ్ముడి లాంటోడు.. ఎన్టీఆర్ ఎమోషనల్ స్పీచ్
-
SS Rajamouli : ‘ఏడ్చి ఏడ్చి కళ్లు ఉబ్బిపోయాయి.. ఫాఫా నటన అద్భుతం’
ట్రెండింగ్
-
100HP టర్బో ఇంజిన్‌తో Renault Triber Turbo కొత్త వేరియంట్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
Rohit-Kohli: నేను కోహ్లీకి పెద్ద ఫ్యాన్.. కానీ ఇప్పుడు చాలా బాధగా ఉంది.. రోహిత్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
మారిన లుక్, సరికొత్త ఫీచర్లతో Suzuki Hayabusa Special Edition లాంచ్.. ధరనే కాస్త ఎక్కువే.!
-
Woman Auto Driver: ఐటీ To ఆటో డ్రైవర్.. హృదయాలను కదిలిస్తున్న యువతి కథ..!
-
Ai+ నుంచి మూడు కొత్త డివైజ్‌లు.. కొత్త స్మార్ట్ ఫోన్ తోపాటు, 5G ట్యాబ్లెట్ సెగ్మెంట్ లాంచ్.!