హీరోయిన్ మెహ్రీన్ పిర్జాదా అమెరికా చుట్టేస్తోంది. చికాగో, న్యూయార్క్ పర్యటన ముగించుకుని ఫోరిడాలో సేదతీరుతోంది. ఫ్లోరిడాలోని మియామి బీచ్ లో సోదరుడు గుర్ఫతేతో కలిసి విహరిస్తున్న పిక్స్ ను సోషల్ మీడియాలో షేర్ చేసింది. సింగిల్-పీస్ స్విమ్‌సూట్‌లో యాచ్‌లో డ్యాన్స్ చేయడమే కాదు అట్లాంటిక్ సముద్రంలో అలలపై తేలుతూ ఈత కొట్టేస్తోంది. మెహ్రీన్ నటించిన ‘ఎఫ్ 3’ బాక్సాఫీస్ వద్ద విజయాన్ని సాధించినా అది అమ్మడికి ఎంత మాత్రం ప్లస్ కాలేదు. ఆ తర్వాత అమ్మడి ఖాతాలో మరే చిత్రం పడలేదు. మరి యుఎస్ పర్యటన ముగించుకుని వచ్చిన తర్వాత అయినా మెహ్రీన్ ని అవకాశాలు పలకరిస్తాయేమో చూద్దాం.