రామ్ పోతినేని హీరోగా నటించిన ‘ది వారియర్’ మూవీ గురువారం జనం ముందుకు రాబోతోంది. దీని తర్వాత ఈ చిత్ర నిర్మాత శ్రీనివాస చిట్టూరి బ్యానర్ లోనే బోయపాటి శ్రీను దర్శకత్వంలో ఓ పాన్ ఇండియా మూవీ చేస్తున్నాడు రామ్. దీని గురించి రామ్ మాట్లాడుతూ, ”నా సినిమాలు హిందీ ఆడియన్స్ బాగా రిసీవ్ చేసుకుంటున్నారు. అలానే బోయపాటి గారి సినిమాలు కూడా బాగా రిసీవ్ చేసుకుంటున్నారు. ఒక హీరోను బాగా రీసెర్చ్ చేసిన తర్వాత బోయపాటి సినిమా చేస్తారు. అందుకని భారం అంతా ఆయన మీద వేశాను. అయితే ఇక్కడ ఒక విషయం గమనించాలి. హిందీ మార్కెట్ కోసం మనం కొత్తగా ఏమీ చేయకూడదని నేను నమ్ముతాను. వాళ్ళు హిందీ సినిమాలు రెగ్యులర్ గా చూస్తున్నారు. తెలుగు, సౌత్ సినిమాలు చూసేది మన ఫ్లేవర్ కోసమే! మనం కన్‌ఫ్యూజ్ అయిపోయి బాలీవుడ్ వాళ్ళు ఏం చేస్తున్నారో అది చేస్తామంటే హిందీ ప్రేక్షకులు చూడరు” అని అన్నారు. బోయపాటి మూవీ తర్వాత ఎవరితో సినిమా చేస్తాననేది ఇప్పుడు చెప్పడం తొందరపాటే అవుతుందని రామ్ అన్నారు. హరీశ్ శంకర్ తోనూ, అనిల్ రావిపూడితోనూ కూడా రామ్ స్టోరీ డిస్కషన్స్ చేస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి.