మగువలకు బంగారం ధరలు షాకిస్తున్నాయి. క్రిస్మస్ సమయానికైనా తగ్గుతాయేమోనని భావిస్తున్న పసిడి ప్రియులకు నిరాశే ఎదురవుతోంది. రోజుకోలాగా ధరలు ఉంటున్నాయి. ఒక రోజు స్వల్పంగా తగ్గితే.. ఇంకో రోజు భారీగా పెరిగిపోతుంది. ఇలా పుత్తడి ధరలు హెచ్చుతగ్గులు అవుతూనే ఉన్నాయి. సోమవారం కూడా ధరలు ఝలక్ ఇచ్చాయి. తులం గోల్డ్‌పై రూ.270 పెరిగింది. ఇక వెండి ధర మాత్రం ఉపశమనం కలిగించింది. కిలో వెండిపై రూ.1,000 తగ్గింది.
ఇది కూడా చదవండి: Indigo Flights: కొనసాగుతున్న ఇండిగో సంక్షోభం.. అన్ని ఎయిర్‌పోర్టుల్లో అవే బాధలు
బులియన్ మార్కెట్‌లో ఈరోజు 24 క్యారెట్ల 10 గ్రాముల ధరపై రూ.270 పెరిగి రూ.1,30,420 దగ్గర ట్రేడ్ అవుతోంది. ఇక 22 క్యారెట్ల 10 గ్రాముల ధరపై రూ. 250 పెరిగి రూ.1,19,550 దగ్గర అమ్ముడవుతోంది. ఇక 18 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధరపై రూ.210 పెరిగి రూ.97,820 దగ్గర ట్రేడ్ అవుతోంది.
ఇది కూడా చదవండి: JK Forest: జమ్ముకాశ్మీర్‌లో ఉగ్ర స్థావరంపై స్పెషల్ పోలీసుల దాడులు.. ఆయుధాలు స్వాధీనం
ఇక వెండి ధర మాత్రం ఉశమనం కలిగించింది. కిలో వెండిపై రూ.1,000 తగ్గింది. దీంతో ఈరోజు బులియన్ మార్కెట్‌లో కిలో వెండి ధర రూ.1,89, 000 దగ్గర అమ్ముడవుతోంది. ఇక చెన్నై, హైదరాబాద్‌లో మాత్రం రూ.1,98,000 దగ్గర ట్రేడ్ అవుతుంది. ఇక ఢిల్లీ, ముంబై, కోల్‌కతాలో మాత్రం కిలో వెండి ధర రూ.1,89, 000 దగ్గర అమ్ముడవుతోంది.
ఇది కూడా చదవండి: PM Modi: పార్లమెంట్‌లో నేడు ‘వందేమాతరం’పై చర్చ ప్రారంభించనున్న మోడీ