మెగాఫోన్ పట్టి తండ్రి ఇ.వి.వి. సత్యనారాయణ బాటలో దర్శకుడు కావాలనుకున్నాడు. కానీ, అనుకోకుండా అభినయంవైపు అడుగులు వేయవలసి వచ్చింది. ఆరంభ చిత్రం ‘అల్లరి’తోనే ‘అల్లరోడు’గా జనం మదిలో నిలచిపోయాడు నరేశ్. నవతరం నటుల్లో అతి తక్కువ సమయంలో యాభై చిత్రాలు పూర్తి చేసి రికార్డ్ సృష్టించాడు ఈ అల్లరోడు. కేవలం కామెడీతో కదం తొక్కడంలోనే కాదు వీలు దొరికితే అభినయంతోనూ అలరిస్తానని పలుమార్లు నిరూపించుకున్నాడు నరేశ్. దర్శకనిర్మాత ఇ.వి.వి. సత్యనారాయణ చిన్నకొడుకుగా నరేశ్ 1982 జూన్ 30న […]
ఈ యేడాది అత్యధికంగా ఫిబ్రవరిలో 30 సినిమాలు విడుదల కాగా… ఆ తర్వాత 29 సినిమాలు విడుదలైన నెల జూన్ కావడం విశేషం. అయితే ఇందులో పది డబ్బింగ్ సినిమాలు ఉన్నాయి. గడిచిన ఆరు నెలల్లో అనువాద చిత్రాలు టాలీవుడ్ లో ఎలాంటి ప్రతిభ చూపలేదు. ఆ కొరతను జూన్ నెల తీర్చేసింది. కమల్ హాసన్ నటించిన ‘విక్రమ్’ రెండు తెలుగు రాష్ట్రాలలో దాదాపు 30 కోట్ల గ్రాస్ ను రాబట్టిందని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. ఆ […]
ఆలియా భట్, రణబీర్ కపూర్ జంటకు ప్రముఖ కండోమ్ కంపెనీ శుభాకాంక్షలు తెలియచేసింది. సోమవారం ఆలియా భట్ తను గర్భం దాల్చినట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో కండోమ్ కంపెనీ డ్యూరెక్స్ సోషల్ మీడియాలో కంగ్రాట్స్ చెబుతూ ‘మెహ్ ఫిల్ మే తేరీ.. హమ్ తో క్లియర్లీ నహీ థీ… (మీ మోహం మధ్యలో మేము అడ్డుగా లేము) ద జోమో ఈజ్ రియల్.. కంగ్రాట్స్ ఆలియా, రణ్ బీర్’ అని పోస్ట్ చేసింది. Read […]
ప్రభాస్ హీరోగా పలు సినిమాలు వివిధ నిర్మాణ దశల్లో ఉన్నాయి. ఇక నాగ్ అశ్విన్ దర్శకత్వంలో నటిస్తున్న ‘ప్రాజెక్ట్ కె’ సినిమా అందులో ఒకటి. ఈ సినిమా తాజా షెడ్యూల్ హైదరాబాద్‌లో పూర్తి చేసుకుంది. అమితాబ్ తో పాటు దీపిక పడుకొనె కూడా షూటింగ్ లో పాల్గొన్నారు. ఇటీవల ఈ సినిమాకు సంబంధించి కొత్త కార్యాలయాన్ని గచ్చిబౌలిలో ఆరంభించారు. ఈ వేడుకలో ప్రభాస్ తో పాటు అమితాబ్ బచ్చన్, రాఘవేంద్రరావు, నాగ్ అశ్విన్, ప్రశాంత్ నీల్, నాని, […]
అరుణ్ విజయ్, ప్రియా భవానీ శంకర్, సముతిర కని, ‘కేజీఎఫ్’ రామచంద్రరాజు, రాధిక శరత్‌కుమార్, యోగి బాబు కీలక పాత్రలు పోషించిన సినిమా ‘ఏనుగు’. యాక్షన్ చిత్రాల దర్శకుడిగా పేరు తెచ్చుకున్న హరి దీనిని రూపొందించారు. జీవీ ప్రకాశ్ కుమార్ సంగీతం అందించిన ‘ఏనుగు’ చిత్రాన్ని సిహెచ్. సతీశ్ కుమార్ నిర్మించారు. జూలై 1న తమిళ, తెలుగు భాషల్లో విడుదల కాబోతున్న ‘ఏనుగు’ సినిమా ఇటీవలే సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకుంది. ఈ చిత్రానికి ‘యు/ఎ’ […]
బాలీవుడ్ బాద్ షా షారుక్ ఖాన్ నటించిన తొలి హిందీ చిత్రం ‘దీవానా’ విడుదలై ఇవాళ్టితో 30 సంవత్సరాలు పూర్తయ్యింది. ఈ సందర్భంగా ప్రతిష్ఠాత్మక నిర్మాణ సంస్థ యశ్ రాజ్ ఫిలిమ్స్ షారుక్ ఖాన్ తో తాను నిర్మిస్తున్న ‘పఠాన్’ సినిమా రిలీజ్ డేట్ ను ప్రకటించింది. వెండితెర నటుడిగా మూడు దశాబ్దాలు పూర్తి చేసుకున్న షారుక్ ను అభినందిస్తూ, తమ ‘పఠాన్’ను హిందీ, తెలుగు, తమిళ భాషల్లో వచ్చే యేడాది జనవరి 25 ప్రపంచవ్యాప్తంగా […]
అక్కినేని నాగచైతన్య నటిస్తున్న తాజా సినిమా 'థ్యాంక్యూ'. దిల్ రాజు, శిరీష్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. 'మనం' లాంటి బ్లాక్ బస్టర్ హిట్ ను నాగ చైతన్యకు అందించిన దర్శకుడు విక్రమ్ కె కుమార్ ఈ సినిమాకు డైరెక్టర్.
సరిగా ముప్పై ఐదేళ్ళ క్రితం వెంకటేశ్, అర్జున్, రాజేంద్రప్రసాద్ – ముగ్గురూ వర్ధమాన కథానాయకులుగా అలరిస్తున్నారు. వెంకటేశ్ అప్పుడప్పుడే ఆకట్టుకుంటున్నారు; అర్జున్ తనదైన యాక్షన్ తో అలరిస్తున్నారు; ఇక రాజేంద్రప్రసాద్ నవ్వుల పువ్వులు పూయిస్తూ సాగుతున్నారు. మరి ఈ క్రేజీ కాంబోలో సినిమా అంటే అది తప్పకుండా జనాన్ని ఇట్టే కట్టిపడేసేలా ఉండాలి కదా! అందుకోసం హిందీలో ఘనవిజయం సాధించిన ‘నసీబ్’ను ఎంచుకున్నారు నిర్మాతలు టి.సుబ్బరామిరెడ్డి, పి.శశిభూషణ్. వారి ‘మహేశ్వరి పరమేశ్వరి ప్రొడక్షన్స్’ పతాకంపై తెరకెక్కిన తొలి […]
ఈ మధ్యకాలంలో అంటే ప్యాండమిక్ తరువాత ప్రేక్షకులు థియేటర్లకు రావడమే తగ్గించేశారు అని ఆ మధ్య భలేగా టముకు సాగింది. అయితే వారికి నచ్చిన, వారిని మెప్పించిన చిత్రాలకు మాత్రం జనం భలేగా పరుగులు తీశారు. ఈ తీరును గమనిస్తే లాక్ డౌన్స్ తరువాత కొన్ని చిత్రాలనే ప్రేక్షకులు ఆదరించారని తెలుస్తోంది. చిత్రమేమంటే, తెలుగు సినిమాలో అంతకు ముందు కొన్ని ‘లేడీ ఓరియెంటెడ్ మూవీస్’ భలేగా మురిపించాయి. కానీ, కరోనా కల్లోలం తరువాత ఏ ఒక్క స్త్రీ […]