రాధేశ్యామ్ రిలీజ్ అయి నెలలు గడుస్తున్నా.. ప్రభాస్ కొత్త చిత్రాల నుంచి ఏవో చిన్న చిన్న షూటింగ్ అప్టేట్స్ తప్పితే.. టీజర్, ఫస్ట్ లుక్ లాంటివి రావడం లేదు. దాంతో ప్రభాస్ అభిమానులు సలార్, ఆదిపురుష్ నుంచి ఏదైనా బిగ్ అప్టేట్ ఇవ్వాలంటూ సోషల్ మీడియాలో పట్టుబడుతున్నారు. అంతేకాదు ఒకానొక సందర్భంలో మేకర్స్ పై ఫైర్ అవుతున్నారు. అయితే ప్రస్తుతం సలార్ షూటింగ్ జరుగుతోంది కాబట్టి.. అప్టేట్స్ లేట్ అయ్యే ఛాన్స్ ఉంది.. కానీ ఆదిపురుష్ షూటింగ్ పూర్తయి నెలలు గడుస్తున్నా.. ఇప్పటివరకు టైటిల్ పోస్టర్ మినహా.. టీజర్, ఫస్ట్ లుక్ లాంటివి ఏది రిలీజ్ చేయలేదు. రామాయణ గాథ ఆధారంగా.. దాదాపు ఐదు వందల కోట్ల బడ్జెట్‌తో రూపొందుతున్న ఈ సినిమాను.. బాలీవుడ్ దర్శకుడు ఓంరౌత్ ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్నాడు. దాంతో ఆదిపురుష్ పై భారీ అంచనాలు నెలకొన్నాయి. పైగా రాధే శ్యామ్ వంటి ఫ్లాప్ తర్వాత ప్రభాస్ నుంచి వస్తున్న చిత్రం ఇదే కావడంతో.. ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు డార్లింగ్ ఫ్యాన్స్.
ఈ నేపథ్యంలో ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ వర్క్‌కు సంబంధించి కీలకమైన అప్డేట్ ఇచ్చాడు ఓంరౌత్. ఆదిపురుష్ ఐమాక్స్ త్రీడీ వెర్షన్ పనులు లాస్ ఎంజెల్స్‌లో జరుగుతున్నట్లు తెలిపాడు. అందులోభాగంగా.. పోస్ట్ ప్రొడక్షన్ స్టూడియో ముందు దిగిన ఓ ఫొటోను సోషల్ మీడియాలో షేర్ చేశాడు. ‘అది పురుష్ ఫ్యాన్స్ కోసం ఎప్పటి నుండో ఓ పని చేయాలని అనుకున్నా.. ఇప్పటికీ టైమ్ కుదిరింది.. 2023 జనవరి 12న ఈ సినిమాను మీ అందరికి చూపించేందుకు.. ఆసక్తిగా ఎదురు చూస్తున్నానని తెలిపాడు. దాంతో గత కొన్ని రోజులుగా ఎలాంటి అప్టేట్ లేదని.. ఆదిపురుష్ మరోసారి వాయిదా పడనుందనే.. పుకార్లకు చెక్ పెట్టినట్టైంది.. ఎట్టి పరిస్థితుల్లోను ఈసారి సంక్రాంతి బరిలో ఆదిపురుష్ ఉంటుందని మరోసారి ఫిక్స్ అయిపోయిందని చెప్పొచ్చు. మరి పాన్ ఇండియాను మించి పాన్ వరల్డ్ స్థాయిలో రాబోతున్న ఈ సినిమాతో.. ప్రభాస్ ఎలాంటి వండర్స్ క్రియేట్ చేస్తాడో చూడాలి.