గత కొన్ని రోజులుగా ఏవోబీ బార్డర్ జరుతున్న ఘటనల నేపథ్యంలో పోలీసులు అప్రమత్తం అయ్యారు. అంతే కాకుండా హిద్మా కోసం పోలీసులు ముమ్మరంగా గాలిస్తున్నారు. దీంతో ఏజెన్సీ ప్రాంతంలో ఎప్పుడు ఏం జరుగుతుందోనని ప్రజలు భయం భయంగా గడుపు తున్నారు. ఓవైపు పోలీసులు మరో వైపు మావోయిస్టులతో గిరిజన ప్రజలకు దినదిన గండంగా మారుతుంది. తాజాగా పట్ట పగలే మావో యిస్టుల వాల్ పోస్టర్లు కలకలం రేపాయి ఈ ఘటన ములుగు జిల్లాలో చోటు చేసుకుంది. భీమదేవరకొండ […]
మంత్రి గంగుల కమలాకర్ కి ప్రుఆప్రతినిధుల కోర్టులో ఊరట లభించింది. ఆయనపై ఎన్నికల సమయంలో నమోదైన కేసు కొట్టివేసింది కోర్టు. 2018 లో జరిగిన తెలంగాణ ముందస్తు ఎన్నికల్లో ఎన్నికల నియమావళి ఉల్లంఘించారని అప్పటి ఎమ్మెల్యే అభ్యర్థి గంగుల కమలాకర్ పై కేసు నమోదైంది. కరీంనగర్ 3వ పట్టణ పోలీసు స్టేషన్ లో నమోదైన ఈ కేసును శుక్రవారం నాంపల్లి ప్రజాప్రతినిధుల కోర్టు కొట్టివేసింది. పోలీస్ స్టేషన్ పరిధిలోని హుస్సేని పుర పోలింగ్ కేంద్రం వద్ద పెద్ద […]
తెలంగాణలో పూర్వ వైభవం తెచ్చుకునేందుకు తెలంగాణ కాంగ్రెస్ ప్రయత్నాలు చేస్తోంది. 2014 తర్వాత పార్టీ పరిస్థితి రోజురోజుకీ దిగజారిపోతోంది. ఈమధ్యే జరిగిన హుజురాబాద్ ఉప ఎన్నికలో డిపాజిట్ కోల్పోయింది భారత జాతీయ కాంగ్రెస్. పార్టీ క్యాడర్ లో ఉత్తేజం నింపేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఈ నెల 14 నుండి 21 వరకు ఎన్నికల కోడ్ లోబడే.. కాంగ్రెస్ జన జాగరణ ప్రజా చైతన్య పాదయాత్ర లు నిర్వహించాలని పార్టీ నిర్ణయించింది. జిల్లా కలెక్టర్ ల పర్మిషన్ లు […]
అల్ప పీడన ప్రభావంతో ఆంధ్రప్రదేశ్‌లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరించారు. దీంతో ప్రకాశం జిల్లా అధికారులను ప్రభుత్వం అప్రమత్తం చేసింది. ప్రకాశం జిల్లా కొత్త పట్నంలో సముద్ర తీరం 15 మీటర్లు ముందు కొచ్చింది. దీంతో అధికారులు తగిన జాగ్రత్తలు తీసుకుం టున్నారు. ప్రకాశం జిల్లాలో సముద్ర తీర ప్రాంతంలో ఉన్న 11 మండలాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. దీంతో చినగంజాం, సింగరా యకొండ, వేటపాలెం, కందూకూరు […]
కల్యాణం కమనీయం అంటారు. కానీ మనదేశంలో పెళ్ళిళ్ళు చాలా కాస్ట్లీ అయిపోయాయి. మూడు ముళ్ళు, ఏడడుగులు వేయాలంటే భారీగా ఖర్చుపెట్టాల్సిందేనా? లక్షల కోట్లు ఆవిరి కావాల్సిందేనా? అంటే అవునంటున్నారు వ్యాపారులు. మనదేశంలో కరోనా వైరస్ మహమ్మారి వల్ల వివాహాలు వాయిదా పడ్డాయి కానీ లేకుంటే అంగరంగ వైభవంగా పెళ్ళితంతు జరగాల్సిందే. ఖర్చు విషయంలో ఏమాత్రం వెనక్కి తగ్గడం లేదు. కరోనా కారణంగా వాయిదా పడ్డ వివాహాలు ఇప్పుడు ఊపందుకుంటున్నాయి. ఈ ఏడాది 14 నవంబర్ నుంచి 13 […]
కంగనా రనౌత్ చేసిన వ్యాఖ్యలపై తీవ్ర స్థాయిలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఆమె ఒక టీవీ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. దేశానికి 2014లోనే నిజమైన స్వాతంత్ర్యం వచ్చిందని, 1947లో వచ్చింది భిక్ష అని అన్నారు. దీంతో దేశానికి స్వాతంత్ర్యం తీసు కొచ్చిన ఎందరినో అవమానించిందంటూ దేశ వ్యాప్తంగా నిరసనలు వెల్లు వెత్తుతున్నాయి. హేట్ స్పీచ్‌లకు ఆమె ప్రతినిధిలా తయా రైం దంటూ కంగనారనౌత్ పై ఎన్సీపీ నేతలు ఫైర్ అయ్యారు. కంగనా పై దేశద్రోహం కేసు పెట్టాలని ఆప్ నేతలు […]
ఆత్మకూర్(ఎస్) మండలం ఎస్ఐ లింగయ్య అరాచకాలతో బాధితులు బెంబేలెత్తుతున్నారు. గతంలో ఉప్పల్ లో ఎస్ఐ గా పనిచేసిన లింగయ్యపై అనేక ఆరోపణలున్నాయి. ఓ కేసులో సస్పెన్షన్ కు గురై సూర్యాపేట కు బదిలీ అయ్యారు లింగయ్య. అక్కడికి వెళ్ళాక కూడా లింగయ్య తన స్వభావం మార్చుకోలేదంటున్నారు. సూర్యాపేట లోనూ లింగయ్య అరాచకాలు ఆగలేదు. ఓ వ్యక్తిని ఇష్టానుసారంగా లాఠీతో కొట్టడంతో ఎస్పీకి ఫిర్యాదు చేశాడు బాధితుడు. లాక్ డౌన్ లోను ఇష్టారాజ్యంగా లాఠీకి పని చెప్పిన ఎస్ఐ […]
ధర్నా చేసే హక్కు అందరికీ ఉందని తెలంగాణ జన సమితి అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరాం అన్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. టీఆర్ఎస్పై పలు ఆసక్తి కర వ్యాఖ్యలు చేశారు. టీఆర్ఎస్ ఇందిరా పార్క్ వద్ద ధర్నా చేస్తే పోలీసులు అనుమతి ఎలా ఇచ్చారని ఆయన ప్రశ్నించారు. కానీ మేము అడిగితే మాత్రం ఏవేవో కారణాలు చెప్పి ధర్నాలకు అనుమతి నిరాకరిస్తున్నారన్నారు. రాష్ట్రంలో ఎక్కడ ధర్నా చేద్దాం అన్నా, అనుమతి ఇవ్వని […]
కరోనా కారణంగా విద్యాసంస్థలు మూతబడి ఈమధ్యే తెరుచుకున్నాయి. విద్యార్ధులు పరీక్షలు కూడా రాస్తున్నారు. అయితే విద్యార్ధులు ఆన్ లైన్ పరీక్షలకే రెడీ అవుతున్నారు. విశాఖలోని గీతం విద్యాసంస్థల్లో ఇంజనీరింగ్ విద్యార్థులు ఆందోళనకు దిగారు. ప్రస్తుతం ఉన్న కరోనా కేసులు ఎక్కువగా ఉన్న నేపథ్యంలో ఆఫ్ లైన్ కాకుండా ఆన్లైన్లో ఎగ్జామ్ నిర్వహించాలని ఆందోళన చేపట్టారు వందలాదిమంది విద్యార్ధులు. 300 మంది ఇంజనీరింగ్ విద్యార్థులు ఆందోళనలో పాల్గొనడంతో గీతం ప్రాంగణంలో గందరగోళం నెలకొంది.భోరున వర్షం పడుతున్నా విద్యార్దులు ఆందోళన […]
సుప్రీం కోర్టు హెచ్చరిక తర్వాత ఆర్మీ మహిళలకు శాశ్వత కమిషన్‌ను నియమించేదందుకు అంగీకరించింది. అన్ని అర్హత ప్రమాణాలను పూర్తి చేసినప్పటికీ శాశ్వత కమీషన్ కోసం తమ దరఖాస్తులను తిరస్క రించారని ఆరోపిస్తూ కోర్టును ఆశ్రయించిన 11 మంది మహిళలకు శాశ్వత కమిషన్‌ను మంజూరు చేస్తామని నవంబర్ 12, శుక్రవారం ఆర్మీ అధికారులు సుప్రీంకోర్టుకు తెలిపారు. ఆర్మీ అధికారులకు ఈ విషయంపై గతంలో ఒక కేసులో తీర్పు ఇచ్చినప్పటికీ అమలు చేయడంలో విఫలమైనందుకు కోర్టు ధిక్కారానికి పాల్పడతారని సుప్రీంకోర్టు […]