ఆత్మకూర్(ఎస్) మండలం ఎస్ఐ లింగయ్య అరాచకాలతో బాధితులు బెంబేలెత్తుతున్నారు. గతంలో ఉప్పల్ లో ఎస్ఐ గా పనిచేసిన లింగయ్యపై అనేక ఆరోపణలున్నాయి. ఓ కేసులో సస్పెన్షన్ కు గురై సూర్యాపేట కు బదిలీ అయ్యారు లింగయ్య. అక్కడికి వెళ్ళాక కూడా లింగయ్య తన స్వభావం మార్చుకోలేదంటున్నారు. సూర్యాపేట లోనూ లింగయ్య అరాచకాలు ఆగలేదు. ఓ వ్యక్తిని ఇష్టానుసారంగా లాఠీతో కొట్టడంతో ఎస్పీకి ఫిర్యాదు చేశాడు బాధితుడు.
లాక్ డౌన్ లోను ఇష్టారాజ్యంగా లాఠీకి పని చెప్పిన ఎస్ఐ లింగయ్య అనేక ఆరోపణలు ఎదుర్కొన్నారు. ఒక నర్స్ భర్త పై చేయి చేసుకున్న లింగయ్య.. ఈ వ్యవహారం అప్పట్లో సంచలనం గా మారింది. సూర్యాపేట నుండి వి ఆర్ కు లింగయ్య బదిలీ అయ్యారు. ఆత్మకూర్ పి ఎస్ కు బదిలీ అయిన ఎస్ఐ లింగయ్య..అక్కడ ఇసుక కాంట్రాక్టర్లతో వంతు పాడుతున్నారని ఆరోపణలు వెల్లువెత్తాయి. ఒక నేత ప్రమాణ స్వీకారానికి వెళ్లాడని కక్షతో సింహాద్రి అనే యువకుడిపై అక్రమ కేసు బనాయించాడు. ఈ ఎస్ఐ పై సస్పెన్షన్ వేటు. దొంగతనం కేసు విచారణలో గిరిజన యువకుడు వీరశేఖర్ ను చితకబాదాడు. ఎస్ఐ లింగయ్యపై పోలీసు ఉన్నతాధికారుల చర్యలు తీసుకున్నారు.