కంగనా రనౌత్ చేసిన వ్యాఖ్యలపై తీవ్ర స్థాయిలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఆమె ఒక టీవీ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. దేశానికి 2014లోనే నిజమైన స్వాతంత్ర్యం వచ్చిందని, 1947లో వచ్చింది భిక్ష అని అన్నారు. దీంతో దేశానికి స్వాతంత్ర్యం తీసు కొచ్చిన ఎందరినో అవమానించిందంటూ దేశ వ్యాప్తంగా నిరసనలు వెల్లు వెత్తుతున్నాయి. హేట్ స్పీచ్‌లకు ఆమె ప్రతినిధిలా తయా రైం దంటూ కంగనారనౌత్ పై ఎన్సీపీ నేతలు ఫైర్ అయ్యారు. కంగనా పై దేశద్రోహం కేసు పెట్టాలని ఆప్ నేతలు డిమాండ్ చేస్తున్నారు. దీనిపై మోడీ దేశ ప్రజలకు సమాధానం చెప్పాలని మౌనంగా ఉండటం ఏం టని వారు ప్రశ్నిస్తున్నారు. అంతేకాకుండా, బీజేపీ ఎంపీ వరుణ్ గాంధీ సైతం కంగనా తీరు పై మండిపడ్డాడు. ఆమెకు ఇచ్చిన పద్మశ్రీని కూడా వెనక్కి తీసుకోవాలనే డిమాండ్ పెరుగుతుంది.
అయితే ఇప్పుడు తాజాగా మహాత్మాగాంధీ మునిమనువడు తుషార్ గాంధీ ట్విట్టర్ వేదికగా ఆమెపై విరుచుకుపడ్డారు. కంగనాను “ద్వేష పూరిత ఏజెంట్” గా అభివర్ణించారు. దీనిపై ప్రధానమంత్రి కార్యాల యం సమాధానం చెప్పాలన్నారు. పద్మశ్రీ కంగనా రనౌత్ ద్వేషం, అసహనం, క్రూరత్వానికి ఏజెంట్ అన్నారు. 2014లో భారతదేశానికి స్వాతంత్ర్యం లభించిందని ఆమె భావించడంలో ఆశ్చర్యం లేదు. ద్వేషం, అసహనం, బూటకపు దేశభక్తి, అణచివేతలకు 2014లో విముక్తి లభించిందని తుషార్ గాంధీ ట్వీట్ చేశారు.
‘Padmashri Kangana Ranaut is a agent of hate, intolerance and rabidity. It is not surprising that she feels that India got its freedom in 2014. Hate, Intolerance, Sham Patriotism, intolerance and oppression were liberated in India in 2014
— Tushar (@TusharG) November 12, 2021