ధర్నా చేసే హక్కు అందరికీ ఉందని తెలంగాణ జన సమితి అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరాం అన్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. టీఆర్‌ఎస్‌పై పలు ఆసక్తి కర వ్యాఖ్యలు చేశారు. టీఆర్ఎస్ ఇందిరా పార్క్ వద్ద ధర్నా చేస్తే పోలీసులు అనుమతి ఎలా ఇచ్చారని ఆయన ప్రశ్నించారు. కానీ మేము అడిగితే మాత్రం ఏవేవో కారణాలు చెప్పి ధర్నాలకు అనుమతి నిరాకరిస్తున్నారన్నారు.
రాష్ట్రంలో ఎక్కడ ధర్నా చేద్దాం అన్నా, అనుమతి ఇవ్వని పోలీసులు టీఆర్‌ఎస్‌కు ఎలా అనుమతి ఇచ్చారో చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. టీఆర్‌ఎస్‌కి ధర్నా చేసే అవకాశం ఇచ్చినందకు సంతోషం ఆ అవకాశాన్ని ఒక్క టీఆర్‌ఎస్‌కే కాదు మాకు కూడా ఇవ్వాలని ఆయన అన్నారు.కేంద్ర, రాష్ర్ట ప్రభుత్వాలు రైతులతో చెలగాటమాడుతు న్నాయని ఆయన ఆరోపించారు. రైతుల ధాన్యం ఎందుకు కొనరని దీనిపై కేంద్ర, రాష్ర్ట ప్రభుత్వాలు స్పష్టత ఇవ్వాలని కోదండరాం అన్నారు.