ప్రముఖ తమిళ దర్శకుడు సెల్వరాఘవన్ సైతం నటుడిగా మారిపోయాడు. దాదాపు రెండున్నర దశాబ్దాలుగా తమిళంలో పలు విజయవంతమైన చిత్రాలను రూపొందించాడు సెల్వరాఘవన్. తెలుగులోనూ వెంకటేశ్ హీరోగా ‘ఆడవారి మాటలకు అర్థాలే వేరులే’ వంటి హిట్ చిత్రాన్ని తెరకెక్కించాడు. సెల్వ రాఘవన్ తమ్ముడు ధనుష్ ఇప్పటికే జాతీయ స్థాయిలో ఉత్తమ నటుడుగా గుర్తింపు తెచ్చుకున్నాడు. నిజానికి సెల్వ రాఘవన్ తాను నటుడిగా మారుతున్నట్టు గత యేడాది డిసెంబర్ లోనే ప్రకటించాడు. ‘రాకీ’ ఫేమ్ అరుణ్ మాథేశ్వరన్ దర్శకత్వం వహిస్తున్న […]
ప్రముఖ దర్శకుడు సుకుమార్, తబితల కుమార్తె సుకృతి ఓణీల ఫంక్షన్ బుధవారం హైదరాబాద్ లోని ఎన్ కన్వెన్షన్ లో జరిగింది. ఈ వేడుకకు పలువురు తెలుగు సినిమా ప్రముఖులు హాజరై, సుకృతిని ఆశీర్వదించారు. చిరంజీవి, రామ్ చరణ్ ‘ఆచార్య’ షూటింగ్ లో ఉన్నకారణంగా హాజరు కాలేదు. అల్లు అరవింద్, అల్లు శిరీశ్ ఈ వేడుకకు హాజరయ్యారు. ఇక ఈ ఫ్యామిలీ ఫంక్షన్ కు స్టార్ హీరోలు మహేశ్ బాబు, ఎన్టీయార్, నాగ చైతన్య సతీసమేతంగా విచ్చేసి సుకృతిని […]
ప్రముఖ ఆర్ట్ డైరెక్టర్ ఆనంద సాయి, పవన్ కళ్యాణ్ ‘తొలిప్రేమ’ చిత్రం మొదలుకుని రామ్ చరణ్ ‘ఎవడు’ చిత్రం వరకు దగ్గర దగ్గరగా నూరు చిత్రాల వరకు తన కళాదర్శకత్వ నైపుణ్యంతో ఎన్నో ప్రశంసలు, మరెన్నో విజయాలు, రాష్ట్ర ప్రభుత్వాల పురస్కారాలు అందుకున్నారు. గత ఐదు సంవత్సరాలకు పైగా యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి ఆలయ చీఫ్ ఆర్కిటెక్ట్ గా విధులు నిర్వహిస్తున్న ఆయన, ఆలయ నిర్మాణ పనులు తుది దశకు చేరుకోవటంతో తిరిగి కళాదర్శకునిగా […]