పాములు కనిపించగానే హడలిపోతాం. వీలైతే అక్కడినించి పారిపోతాం. పాము కరుస్తుందేమోనని దాన్ని చంపేస్తాం. కానీ ఓ నాగుపాము హాయిగా పూజగదికి వచ్చేసింది. అయ్యప్పస్వాముల పూజ ఆసాంతం చూసింది. భజన వింది. ఇంతకీ ఈ ఘటన ఎక్కడ జరిగిందో తెలుసా. ఏపీలోని శ్రీకాకుళం జిల్లా వజ్రపుకొత్తూరు మండలం లింగాలపాడు గ్రామంలో ఉన్న అయ్యప్పస్వామి సన్నిధానంలో అయ్యప్ప స్వాములు భజనలు చేస్తున్నారు. ఒక్కసారిగా అక్కడికి చేరుకుంది ఓ నాగుపాము. అయ్యప్ప స్వాములు చేస్తున్న భజన కీర్తనలు వింటూ పైన ఏర్పాటు […]
దక్షిణ భారతదేశ ముఖ్యమంత్రుల సమావేశానికి తిరుపతి నగరం సిద్ధమయింది. ఈ నెల 14వ తేదీ దక్షిణాది రాష్ట్రాల ముఖ్యమంత్రుల సమావేశంలో పాల్గొనేందుకు కేంద్ర హోంశాఖ మంత్రి అమి త్ షా ఈనెల 13వ తేదీ రాత్రి 7.40 నిమిషాలకు తిరుపతి ఎయిర్ పోర్ట్ కు చేరుకుంటారు. అక్కడినుండి 7:45 నిమిషాలకు బయలుదేరి రాత్రి 8.05 గంటలకు తాజ్ హోటల్ కు చేరుకొని రాత్రికి అక్కడే బస చేస్తారు. మరుసటి రోజు ఉదయం ఈనెల 14వ తేదీ ఉదయం […]
తెలంగాణలో టీఆర్ఎస్ నేతల తీరుపై మండిపడ్డారు బీజేపీ ఎంపీ సోయం బాపురావ్. ఆదిలాబాద్ లో ఆయన మీడియాతో మాట్లాడారు. హుజురాబాద్ ఓటమి తట్టుకోలేక వరి ధాన్యం పై రాద్దాంతం చేస్తున్నారని, కేంద్రం వరి ధాన్యం కొనము అని ఎక్కడా చెప్పలేదన్నారు. టీఆర్ఎస్ నేతలు బజార్ రౌడీల్లా మాట్లాడుతున్నారు. టీఆర్ఎస్ నాయకులు పరిధి దాటి మాట్లాడుతున్నారని మండిపడ్డారు. బీజేపీని బదనాం చేయడం కోసం తప్ప రైతులకు మేలు చేసే ఆలోచన టీఆర్ఎస్ కు లేదు. రైతుల మీద ప్రేమ […]
మహారాష్ట్రలో ఎన్ కౌంటర్ జరిగింది. గడ్చిరోలి గ్యార పట్టి అటవీ ప్రాంతంలో మావోయిస్టులకు పోలీసులకు మధ్య ఎన్ కౌంటర్ జరిగిందని సమాచారం. ఈ ఘటనలో ఏడుగురు మావోయిస్టులు మృతి చెందగా మరికొందరికి గాయాలయ్యాయి.
దేశంలో ఎక్కడ చూసినా డ్రగ్స్, గంజాయి మత్తే ఆవహిస్తోంది. ఏపీ, తెలంగాణ అని తేడా లేదు. ఎక్కడ అవకాశం దొరికితే అక్కడ డ్రగ్స్ దొరుకుతున్నాయి. దొరికితే దొంగ, దొరక్కపోతే దొర అన్నట్టుగా వుంది. విదేశాల నుంచి వచ్చే ప్రయాణికులు అవకాశాన్ని బట్టి డ్రగ్స్ దాచి పెట్టేస్తున్నారు. తాజాగా దేశరాజధాని ఢిల్లీ అంతర్జాతీయ విమానాశ్రయంలో భారీగా హెరాయిన్ డ్రగ్ దొరికిపోయింది. రూ 66 కోట్ల విలువ చేసే హెరాయిన్ ను సీజ్ చేసింది కస్టమ్స్ బృందం. కెన్యా ప్రయాణీకుడి […]
దళిత బహుజన ప్రజాజీవితాల్లో గుణాత్మక అభివృద్ధికోసం తన జీవితాంతం కృషిచేసిన ఐఏఎస్ మాజీ అధికారి బి.దానం మృతి పట్ల ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు సంతాపం వ్యక్తం చేశారు. ఉమ్మడి రాష్ట్రంలో పలు శాఖలకు ప్రభుత్వ ముఖ్య కార్యదర్శిగా పనిచేశారు. అంతేకాకుండా డాక్టర్ అంబేడ్కర్ పీపుల్స్ ఎడ్యుకేషనల్ ట్రస్ట్ అధ్యక్షుడుగా పనిచేశారు దానం. దళిత బహుజన మైనారిటీ వర్గాలకు దానం విశేష సేవలందించారని సీఎం స్మరించుకున్నారు. వారి కుటుంబ సభ్యులకు సీఎం కేసీఆర్ తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు.
హుజురాబాద్ ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ ఓటమి నుంచి ప్రజల దృష్టిని మరల్చేందుకే సీఎం కేసీఆర్ కొత్త డ్రామాలకు తెర తీశారని, టీపీసీసీ సీనియర్ ఉపాధ్యక్షులు మాజీ పార్లమెంట్ సభ్యుడు డాక్టర్ మల్లు రవి ఆరోపించారు. రైతులు పండించిన పంటను ప్రతీసారి రాష్ర్ట ప్రభు త్వమే ఐకేపీ సెంటర్ల ద్వారా కొనుగోలు రైస్ మిల్లర్లకు సరఫరా చేసి ఎఫ్సీఐకి లేవీ పెట్టి కేంద్ర ప్రభుత్వం నుంచి రీఎంబర్స్మెంట్ ద్వారా డబ్బులు తీసుకునే ఆనవాయితీ ఉందని ఆయన తెలిపారు. రాష్ట్ర […]
నవ్య ప్రింటింగ్ ప్రెస్ లో పోలీసుల తనిఖీలపై మండిపడ్డారు పీవో డబ్ల్యు సంధ్య. సాయంత్రం 5 గంటల సమయంలో మా ఇంటికి పోలీసులు వచ్చి మా భర్తను ప్రింటింగ్ ప్రెస్ కు తీసుకెళ్లారు. మధ్యాహ్నం సమయంలో ప్రింటింగ్ ప్రెస్ లో 50 మంది పోలీసులు వచ్చి బీభత్సం సృష్టించారన్నారు సంధ్య. ప్రింటింగ్ ప్రెస్ లో ఉన్న కంప్యూటర్లను, హార్డ్ డిస్క్ లను, ప్రింట్ అయిన పుస్తకాలను పోలీసులు తీసుకెళ్లారు. మా భర్తను అరెస్టు చేస్తున్నట్టు పోలీసులు చెప్పారు. […]
మున్సిపల్ ఎన్నికల్లో అధికార పార్టీ వైసీపీ అధికార దుర్వినియోగానికి పాల్పడుతోందని ఎస్ఈసీకి టీడీపీ నేతలు ఫిర్యాదు చేశారు.ఈ సంద ర్భంగా వారు వైసీపీ పై ధ్వజమెత్తారు అధికారాన్ని అడ్డం పెట్టుకుని ఎన్నికల్లో గెలవాలని చూస్తోందన్నారు. ఇప్పటికే పలు ఎన్నికల్లో అధి కార దుర్వినియోగాని పాల్పడుతున్నారని వారు ఎస్ఈసీకి ఫిర్యాదు చేశారు. కొండపల్లి, కుప్పం, నెల్లూరుల్లో ఎన్నికల ప్రచారంలో వార్డు వలంటీర్లు పాల్గొంటున్నారని ఎస్ఈసీ దృష్టికి తెచ్చిన టీడీపీ నేతలు. వివిధ ప్రాంతాల్లో ఎన్నికల ప్రచారంలో వాలంటీర్లు పాల్గొన్నారంటూ […]
పిల్లలకు కోవిడ్-19 వ్యాక్సిన్లు వేయడంలో ప్రభుత్వం తొందరపడ కూడదని ఆరోగ్య మంత్రి మన్సుఖ్ మాండవీయ అన్నారు. కొన్ని దేశా లలో పరిమిత పద్ధతిలో ప్రారంభించబడినప్పటికీ, ప్రపంచంలో ఎక్క డా పెద్ద ఎత్తున COVID-19 పిల్లలకు టీకాలు వేయడం లేదని ఆయ న తెలిపారు. రేపటి తరాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మాపై ఉంద న్నారు. “మేము తొందరపడటం ఇష్టం లేదు…జాగ్రత్తగా నడ వాలి” అని మన్సూఖ్ మాండవీయ తెలిపారు. ఇప్పటికే పిల్లల కోసం పలు కంపెనీలు టీకాలు తయారు […]