రాజకీయాలంటే వేడిగానే వుంటాయి. అందునా తెలుగు రాష్ట్రాల్లో మంత్రులు, విపక్షాల మధ్య అయితే ఇది మరీ వేడిగా వుంటుంది. ఏపీ తెలంగాణ మధ్య తాజాగా మాటల దాడి వేడిని పుట్టిస్తోంది. తెలంగాణ మంత్రి ప్రశాంత్ రెడ్డి ఏపీ సీఎం జగన్, రాష్ట్ర ఆర్థిక పరిస్థితి మీద హాట్ కామెంట్లు చేశారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఇస్తే తెలంగాణ ప్రజలు బిచ్చమెత్తుకుని బ్రతకాల్సి వస్తుందని ఆంధ్రోళ్లు ఎద్దేవా చేశారని… కానీ నేడు ఏపీ సీఎం జగన్ కేంద్రం వద్ద […]
కేంద్ర పోర్టులు, ఓడరేవులు, జలమార్గాలు మంత్రి సబరనాథ్ సోనోవల్ ని కలిశారు ఏపీ మంత్రి మేకపాటి గౌతం రెడ్డి. గతంలో ఈ శాఖలకు కేంద్ర మంత్రిగా మనుసుఖ్ మాండవీయ నిర్వహించిన నేపథ్యంలో, ప్రస్తుత మంత్రి సోనోవల్ కి ఏపీ రాష్ట్ర పారిశ్రామికాభివృద్ధి ప్రణాళికను మరోసారి వివరించిన రాష్ట్ర మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి. రాష్ట్రంలోని 3 పోర్టులు, 11 ఫిషింగ్ హార్బర్ లకు అందించాల్సిన కేంద్ర నిధులకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం సానుకూలంగా స్పందించింది. రాష్ట్ర పునర్వ్యస్థీకరణ […]
రైతుల ముసుగులో రియల్ ఎస్టేట్ వ్యాపారులు యాత్ర చేస్తున్నారని, రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులు కూడా రైతులను వాడుతున్నారని మం త్రి పేర్ని నాని అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ .. అమరావతి రైతుల పాదయాత్ర, చంద్రబాబు పై కీలక వ్యాఖ్యలు చేశారు. ఈయాత్రకు చేసిన పాపాలకు పాప పరిహార యాత్ర అని పేరు పెట్టుకుని ఉంటే బాగుండేదని మంత్రి అన్నారు. చంద్రబాబు తాబే దార్లు న్యాయమూర్తులకు కళ్లకు గంతలు కట్టి యాత్ర చేస్తున్నారన్నా రు. పాదయాత్రకు […]
కృష్ణా జలాలపై మంత్రి హరీష్‌రావు మీడియా సమావేశంలో మాట్లాడు తూ.. కేంద్రంపై నిప్పులు చెరిగారు. ఏడేళ్లుగా కేంద్ర ప్రభు త్వం తెలంగాణకు అన్యాయం చేస్తుందన్నారు. నీటి కేటాయిం పులపై తెలంగాణ ఏర్పడిన 42రోజుల్లోనే కేసీఆర్ కేంద్రానికి ఫిర్యాదు చేసిన పట్టించుకోలేదన్నారు. కృష్ణా జలాలపై మాకు న్యాయపరమైన హక్కు కావాలి. ఇదేమి గజేంద్ర షెకావత్ తో వ్యక్తిగత పంచాయతీ కాదన్నారు. కేంద్రం స్పందించకపోవడం వల్లనే మేము ఆగస్ట్ 2015లో సుప్రీం కోర్టు గడప తొక్కాం. చట్ట ప్రకారంగా మీదగ్గరికి […]
ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతినే కొనసాగించాలంటూ అమరావతి రైతులు చేపట్టిన న్యాయస్థానం టు దేవస్థానం పాదయాత్ర కొనసాగుతోంది. ఇవాళ్టికి పన్నెండవ రోజు ప్రకాశం జిల్లా ఒంగోలుకు చేరింది. రైతులు తలపెట్టిన పాదయాత్రకు ఒంగోలు నగరంలో ప్రజలు బ్రహ్మరథం పట్టారు. అమరావతి రైతులకు ఒంగోలు మాజీ ఎమ్మెల్యే దామచర్ల జనార్థన్, జనసేన,సీపీఐ, సీపీఎం పార్టీ నాయకులు ఘన స్వాగతం పలికారు. ఆనాడు అమరావతిని శాశ్వత రాజధానిగా ఉంచుతామనే హామీవల్లే తమ విలువైన భూములు ఇచ్చామని అన్నారు. ఆంధ్రప్రదేశ్ కు మూడు […]
వాయుగుండం ప్రభావంతో ఏపీలో భారీ వర్షాలు కురవనున్నాయి. వాతావరణ శాఖ కోస్తాంధ్ర, రాయలసీమకు భారీ వర్ష సూచన చేసింది. అధికారులు, మత్స్యకారులు అప్రమత్తంగా వుండాలని సూచించింది. అండమాన్ సముద్రంలో రేపు మరో అల్పపీడనం ఏర్పడనుంది. ఈ నెల 17న అల్పపీడనం తీరం దాటనుంది. చిత్తూరు, నెల్లూరు జిల్లాల్లో ఇవాళ భారీ వర్షాలు కురవనున్నాయి. ఇటు ఆధ్యాత్మిక నగరం తిరుపతిలో పలు కాలనీలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. అన్ని స్కూళ్లు, కాలేజీలకు అధికారులు ఇవాళ సెలవు ప్రకటించారు. మరో 24 […]
టీఆర్ఎస్ ధర్నాలు చేయాల్సింది రాష్ర్టంలో కాదని ఢీల్లీలోని జంతర్‌మంతర్ వద్ద చేయాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్ రెడ్డి అన్నారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్ర, రాష్ర్ట ప్రభుత్వాలపై నిప్పులు చెరిగారు. రైతు వ్యతిరేక చట్టాలు తెచ్చిన బీజే పీ కేంద్ర ప్రభుత్వం, రాష్ట్రంలో మాత్రం ధర్నాలు చేయడం సిగ్గు చేటన్నారు. ముందు వడ్లు కొనుగోలు చేయడానికి రాష్ట్ర బీజేపీ నాయ కులు కేంద్రం పై ఒత్తిడి పెంచాలని ఆయన కోరారు. రాష్ట్రంలో బీజే పీ, […]
నటభూషణ శోభన్ బాబు తెలుగు చిత్రసీమలో స్టార్ హీరోగా ఎదగడానికి దాదాపు పుష్కరకాలం పట్టింది. 1959లో ‘దైవబలం’ చిత్రంలో తొలిసారి తెరపై కనిపించిన శోభన్ బాబుకు సోలో హీరోగా బంపర్ హిట్ దక్కింది 1971లోనే. ఆయనకు ఆ విజయాన్ని అందించిన చిత్రం ‘తాసిల్దార్ గారి అమ్మాయి’. అప్పటి దాకా శోభన్ బాబు ఇతర స్టార్ హీరోస్ చిత్రాలలో సైడ్ కేరెక్టర్స్ పోషిస్తూనే వచ్చారు. ‘తాసిల్దార్ గారి అమ్మాయి’ మంచి విజయం సాధించింది. ఆ తరువాత వరుస విజయాలతో […]
బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వాయుగుండంగా మారింది. ప్రస్తుతం చైన్నైకి ఆగ్నేయంగా 30 కిలోమీటర్ల దూరంలో ఇది ఉంది. దీంతో రాగల 48 గంటల్లో భారీ వర్షాలు పడనున్నాయి. వాయుగుండం ప్రభావంతో ఉత్తర తమిళనాడు, దక్షిణకోస్తా జిల్లాలో భారీ వర్షాలు పడనున్నట్టు వాతావరణ శాఖ హెచ్చరించింది. భారీ వర్షాల నేపథ్యంలో ఈ జాగ్రత్తలు తప్పనిసరివర్షంపడి రోడ్లు జారే అవకాశం ఉంటుంది. వాహనాదారులు నెమ్మదిగా వెళ్లాలి. విద్యుత్ సమస్యలు ఉంటే అధికారులకు సమాచారం ఇవ్వా లి. కానీ స్వతహాగా రిపేర్లు […]
భారత భూభాగాన్ని చైనా అక్రమంగా ఆక్రమించడాన్ని చైనా అన్యాయ మైన వాదనలను భారత్ అంగీకరించడం లేదని విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి అరిందమ్ బాగ్చిగురువారం తెలిపారు. “దశాబ్దాలుగా చట్టవిరుద్ధంగా ఆక్రమించిన ప్రాంతాలతో సహా సరిహద్దు ప్రాంతాల్లో చైనా గత కొన్నేళ్లుగా నిర్మాణా కార్యకలాపాలను చేపట్టిందన్నారు. చైనాను దౌత్యపరమైన మార్గాల ద్వారా ఎదుర్కొంటున్నామని ఆయన అన్నారు. స్థానిక జనాభా కోసం రోడ్లు, వంతెనల నిర్మాణంతో సహా సరిహద్దు మౌలిక సదుపాయాలను కూడా భారత ప్రభుత్వం పెంచిందని విదేశీ మంత్రిత్వ […]