కెన్యా నుండి వచ్చిన 22 ఏళ్ల మహిళమూడు నెలలుగా కొనసాగుతున్న ఎడమ ప్రక్క నొప్పితో పేస్ హాస్పిటల్స్, హైటెక్ సిటీ బ్రాంచ్‌ను ఆశ్రయించారు. పేషెంట్‌కు చేసిన పరిశీలనల్లో, ముఖ్యంగా CT-KUB స్కాన్‌లో, ఎడమ మూత్రపిండంలో సుమారు1.5 సెం.మీ పరిమాణంలో రాయిఉన్నట్లు నిర్ధారణ అయ్యింది. దీని వల్ల పేషెంట్‌కు రోజువారీ జీవనంలో తీవ్రమైన అసౌకర్యం ఏర్పడిందని వైద్యులు తెలిపారు.పేషెంట్ పరిస్థితిని విశ్లేషించిన పేస్ హాస్పిటల్స్ యూరాలజీ విభాగం,సీనియర్ కన్సల్టెంట్ యూరాలజిస్టు&రీనల్ ట్రాన్స్‌ప్లాంట్ సర్జన్ డాక్టర్ విశ్వంభర్ నాథ్ గారి […]
హైదరాబాద్‌లో గణేష్ నిమజ్జనం కోసం అధికారులు అన్ని ఏర్పాట్లను పూర్తి చేశారు. ఈసారి శోభాయాత్రలు సుమారు 303 కిలోమీటర్ల మేర కొనసాగనుండటంతో, పోలీసులు కట్టుదిట్టమైన బందోబస్తు ఏర్పాటు చేశారు. మొత్తం 30 వేల మంది పోలీసు సిబ్బందిని మోహరించారు. అదనంగా 160 యాక్షన్ టీంలు సిద్ధంగా ఉంచగా, ప్రజల భద్రత కోసం 13 కంట్రోల్ రూమ్‌లను ఏర్పాటు చేశారు. GHMC కూడా విస్తృత ఏర్పాట్లు చేస్తూ నగరంలో 20 ప్రధాన చెరువులు, 72 కృత్రిమ కొలనులు సిద్ధం […]
నిజామాబాద్ నగరంలో సైబర్ నేరగాళ్లు మరోసారి దోపిడీకి పాల్పడ్డారు. వినాయకనగర్‌లో నివసించే వృద్ధ దంపతులను టార్గెట్ చేసి, “డిజిటల్ అరెస్ట్” పేరుతో భయపెట్టి ఏకంగా రూ.40 లక్షలు దోచుకున్నారు. ఈ ఘటనపై సైబర్ క్రైమ్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఆదివారం ఉదయం 9 గంటల సమయంలో వృద్ధుడికి వాట్సాప్ వీడియోకాల్ వచ్చింది. తాము ముంబయి పోలీసులు అని పరిచయం చేసుకున్న నిందితులు నకిలీ ఐడీ కార్డులు చూపించారు. మీ బ్యాంకు ఖాతా మనీలాండరింగ్ […]
ఆంధ్రప్రదేశ్ పోలీసులు ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించిన ఏఐ ఫర్ ఆంధ్రా పోలీస్ హ్యాకథాన్ 2025 లో తెలంగాణకు చెందిన టెక్నాలజీ సంస్థ క్వాడ్రిక్ ఐటీ రెండో స్థానంలో నిల్చింది. కృత్రిమ మేథను ఉపయోగించి ప్రజాపాలన, సంరక్షణే లక్ష్యంగా ఆ సంస్థ బ్లూ క్వయిరీ అనే ప్రాజెక్టును ప్రదర్శించింది. ఆ సంస్థకు నేతృత్వం వహిస్తున్న రఘురామ్ తాటవర్తి ఆధ్వర్యంలో ఈ ఘనత సాధ్యమైంది. ఇంగ్లీష్, మరియు తెలుగు భాషల్ని ఉపయోగించిన ఈ ప్రాజెక్టు కేసుల విచారణకు ఉపయోగడేలా క్వాడ్రిక్ సంస్థకు […]
సన్ రైజర్స్ ప్లేఆప్స్ అవకాశాలకు గండి పడింది. వరుణుడి ప్రభావం కారణంగా ఉప్పల్ మైదానం ఔట్ ఫీల్డ్ చిత్తడిగా మారడంతో మ్యాచ్ ముందుకు సాగలేదు. ఈ మ్యాచ్ లో సన్ రైజర్స్ బౌలర్లు చెలరేగారు. ఢిల్లీ క్యాపిటల్స్ ఆరంభంలోనే వికెట్లు కోల్పోయి తీవ్ర కష్టాల్లో పడింది. పవర్ ప్లేలో ఫ్యాట్ కమిన్స్ ఢిల్లీని కోలుకోలేని దెబ్బ కొట్టాడు. బ్యాటర్లు ఆధిపత్యం చూపించే పవర్ ప్లేలో కమిన్స్ మూడు కీలక వికెట్లు నేలకూల్చాడు. ఇక్కడే ఢిల్లీ పతనానికి పునాదులు […]
సినిమాని తియ్యడం ఒక ఆర్ట్ అయితే దానిని జనాలకు చేరువ చేసి, సినిమా పై బజ్ పెంచి రిలీజ్ చెయ్యడం మరొక ఆర్ట్. అయితే ఈ మధ్య పేరు ఉన్న సినిమాలు తీస్తున్న బ్యానర్స్ సైతం సినిమాని ప్రోమోట్ చేసే విషయంలో కిందా, మీదా అవుతున్నాయి.అయితే ఇక్కడ ఒక్క విషయం మాత్రం అర్ధం కావట్లేదు చాలామందికి.బాహుబలి,RRR లాంటి సినిమాలకు సైతం హీరోలు మెయిన్ స్ట్రీమ్ మీడియాకి ప్రత్యేకంగా పబ్లిసిటీ పర్పస్ కోసం వచ్చేవాళ్ళు.కానీ ఇప్పుడు సిట్యుయేషన్ మారింది.చిన్న […]