కుప్పం మున్సిపల్ ఎన్నికల్లో వైసీపీ నేతలు ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నారని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు కొల్లు రవీంద్ర అన్నారు. కుప్పం అంటే చంద్రబాబు, చంద్రబాబు అంటే కుప్పం గుర్తుకు వస్తుందని అలాంటి కుప్పంలో అప్రజాస్వామిక విధానాలతో తమ చెప్పు చేతల్లోకి తెచ్చుకోవాలని వైసీపీ నేతలు కుట్రలు పన్నుతు న్నారన్నారు. మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అధికార యంత్రాం గాన్ని ముందుండి నడిపిస్తున్నాడని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసీపీ నేతలు ఎన్ని కుట్రలు పన్నినా ప్రజా తీర్పును […]
భారతదేశం నుంచి విమాన ప్రయాణాలపై ఆంక్షలను మరింత సడలించాలని గల్ఫ్ కో ఆపరేషన్ కౌన్సిల్(జీసీసీ) దేశాలను విదేశాంగ శాఖ మంత్రి ఎస్ జైశకంర్ కోరారు. కోవిడ్ వ్యాక్సినేషన్ ఉన్న సర్టిఫి కేట్లను గుర్తించాలని ఆయన కోరారు. జీసీసీ సెక్రటరీ జనరల్ నయేఫ్ ఫలాహ్ ముబారాక్ అల్ -హజరప్‌తో ఆయన సమా వేశం అయ్యారు. వీరిద్దరూ భారత్- జీసీసీ సంబంధాలపై సమీ క్షించి వాణిజ్యం, పెట్టు బడులపై చర్చించారు. నయేఫ్ ఫలాహ్ కువైట్ మాజీ ఆర్థిక మంత్రి. ఆయన […]
పశ్చిమగోదావరి జిల్లాలో సాధారణ ఎన్నికలను తలపిస్తున్నాయి నగర పంచాయతీల ఎన్నికలు. జిల్లాలో ఆచంట తర్వాత టెన్షన్ పెట్టిస్తోంది ఆకివీడు నగర పంచాయతీ. అధికార వైసీపీ, విపక్ష టీడీపీ నేతలు ఆకివీడుని ఇజ్జత్ కా సవాల్‌గా తీసుకుంటున్నాయి. ఆయా పార్టీల అగ్రశ్రేణి నేతలు నగర పంచాయతీపై ఫోకస్ పెట్టారు. ఆకివీడు నగర పంచాయతీ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న దెందులూరు మాజీ ఎమ్మెల్యే, మాజీ విప్ చింతమనేని ప్రభాకర్ హాట్ కామెంట్స్ చేశారు. పేదవారి చెమటని బ్రాందీ రూపంలో లాగేసుకున్న […]
సీపీఐ జాతీయ కార్యదర్శి డాక్టర్ కె నారాయణ రాజకీయాల గురించి తప్ప మిగతా విషయాల గురించి అంతగా మాట్లాడరు. కానీ సినిమా తారల గురించి ప్రస్తావిస్తూ బాలీవుడ్ నటి కంగనా రనౌత్‌పై కీలక వ్యాఖ్యలు చేశారు. దేశ స్వతంత్ర ఉద్యమాన్ని అవమానిస్తూ కంగనా రౌనత్ చేసిన వ్యాఖ్యలపై సీపీఐ జాతీయ కార్యదర్శి డాక్టర్ కె నారాయణ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. దేశానికి 1947లో వచ్చింది స్వాతంత్రం కాదు అని భిక్ష అని కంగనా పేర్కొనడంపై తీవ్రంగా […]
దేశంలో రోజు రోజుకు క్రిప్టో కరెన్సీపై కొన్ని వర్గాల ప్రజలు ఆసక్తి చూపుతున్నారు. ఇప్పటికే చాలా మంది క్రిప్టో కరెన్సీలో పెట్టుబడులు సైతం పెట్టారు. దీనిపై భారత రిజర్వు బ్యాంకు గవర్నర్ శక్తి కాంత దాస్ స్పందించారు. దేశ స్థూల ఆర్థిక వ్యవస్థకు, ఆర్థికస్థిరత్వానికి క్రిప్టో కరెన్సీ ప్రమాదకరమని ఆయన హెచ్చరించారు. క్రిప్టో కరెన్సీపై తన అభిప్రాయాన్ని ప్రభుత్వానికి తెలియజేశారు. ప్రైవేట్ వ్యక్తుల చేతిలో ఉండే ఈ వర్చువల్ కరెన్సీపై అప్రమత్తంగా లేకుంటే అనర్థాలు తప్పవన్నారు. క్రిప్టో […]
చిత్తూరు జిల్లా రామచంద్రపురం మండలం పీవిపురం వాగులో ఓ మహిళ గల్లంతయింది. పీవీపురంవాగు దాటుతూ వుండగా నీటి వేగానికి అదుపు తప్పి.. ఓ మహిళ గల్లంతైంది. పీవిపురానికి చెందిన ఇద్దరు మహిళలు, ఒక యువకుడు పొలం వద్ద నుంచి ఇంటికి బయలుదేరారు. ఈ క్రమంలో వాగును దాటుతుండగా ప్రవాహం వేగానికి కొంతదూరం కొట్టుకొని పోయారు. యువకుడు ఒకరిని రక్షించ గలిగాడు. ఈ ప్రమాదంలో 37 ఏళ్ళ సరళ అనే మహిళ వాగులో కొట్టుకు పోయింది. సమాచారం తెలుసుకున్న […]
ఇండో-ఫసిఫిక్‌లో మళ్లీ ప్రచ్ఛన్న యుద్ధ కాలం నాటి ఉద్రిక్తతలు తలెత్త కూడదని చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ గురువారం హెచ్చ రించారు. ఆసియా- ఫసిఫిక్ ఎకనామిక్ కో ఆపరేషన్ఫోరమ్ వార్షిక సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ ప్రాంతంలో ఆస్ట్రేలియా కొత్త భద్రతా కూటమి ఏర్పడిన తర్వాత చాలా వారాలకు జిన్పింగ్నుంచి ఈ ప్రకటన వచ్చింది. ఈ కూటమిలో ఆస్ట్రేలియా అణు జలాంతర్గ ములను నిర్మించనుంది. దీనిపై చైనా తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. భౌగోళిక, రాజకీయ ప్రాతిపదికన ఈ […]
రాజధాని రైతుల పాదయాత్రలో లాఠీ ఛార్జ్ అప్రజాస్వామికం అన్నారు జనసేన పీఏసీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్. రైతుల పాదయాత్రలో గాయాల పాలైనవారికి.. చేయి విరిగిన రైతుకు వైద్యం బాధ్యత ప్రభుత్వానిదే అన్నారు. రాజధాని కోసం భూములిచ్చిన రైతులు చేపట్టిన పాదయాత్రకు సంఘీభావం తెలియచేసేందుకు వచ్చిన వారిపై లాఠీ ఛార్జ్ చేయడం దురదృష్టకరం. మద్దతు చెప్పడం, సంఘీభావం తెలియచేయడం ప్రజాస్వామ్యంలో భాగమే. అదేమీ నేరం కాదు. రైతులు చేపట్టిన కార్యక్రమానికి సంఘీభావాన్ని చెప్పేవారిని అడ్డుకోవడం అప్రజాస్వామిక చర్య అన్నారు […]
కరోనా అంతం కాలేదని ఈ మహమ్మారి పోరాటంలో అన్ని రాష్ర్టాలు, కేంద్రపాలిత ప్రాంతాలు కలిసి మెలిసి పని చేయాలని కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయ పిలుపునిచ్చారు. దేశంలోని చివ రి పౌరుడి వరకు టీకా అందేలా ప్రతి ఒక్కరూ కృషి చేయాలన్నారు. ఇంటింటింకి కరోనా వ్యాక్సిన్ అందజేసేందుకు చేపడుతున్న హర్ ఘర్ దస్తక్ కార్యక్రమం పై కేంద్ర మంత్రి అన్ని రాష్ర్టాలు, కేంద్ర పా లిత మంత్రులతో గురువారం సమావేశాన్ని నిర్వహించారు. ఈ సం […]
న్యాయస్థానం టు దేవస్థానం అని ఒక ముసుగు వేసుకుని అమరావతి రైతులు పాదయాత్ర చేస్తున్నారని వారు ఇకనైనా కళ్లు తెరవాలని వైసీ ఎమ్మెల్యే సుధాకర్‌బాబు అన్నారు. 157 మంది మాత్రమే పాల్గొంటా మని జాబితా ఇచ్చి కోర్టు నుంచి అనుమతి పొందారని, ఇప్పుడేమో చంద్రబాబు సంఘీభావం పేరుతో రాష్ట్రంలో అలజడికి కుట్రలు పన్నుతున్నడని ఆయన అన్నారు. రాజధానికి భూములు ఇచ్చిన రైతులకు న్యాయం జరిగింది. రాజధాని రైతులకు ప్యాకేజీ అందిం దని,ఏడాదికి ఒకసారి కౌలు డబ్బులు, ఇతర […]