కరోనా కారణంగా విద్యాసంస్థలు మూతబడి ఈమధ్యే తెరుచుకున్నాయి. విద్యార్ధులు పరీక్షలు కూడా రాస్తున్నారు. అయితే విద్యార్ధులు ఆన్ లైన్ పరీక్షలకే రెడీ అవుతున్నారు. విశాఖలోని గీతం విద్యాసంస్థల్లో ఇంజనీరింగ్ విద్యార్థులు ఆందోళనకు దిగారు.
ప్రస్తుతం ఉన్న కరోనా కేసులు ఎక్కువగా ఉన్న నేపథ్యంలో ఆఫ్ లైన్ కాకుండా ఆన్లైన్లో ఎగ్జామ్ నిర్వహించాలని ఆందోళన చేపట్టారు వందలాదిమంది విద్యార్ధులు. 300 మంది ఇంజనీరింగ్ విద్యార్థులు ఆందోళనలో పాల్గొనడంతో గీతం ప్రాంగణంలో గందరగోళం నెలకొంది.భోరున వర్షం పడుతున్నా విద్యార్దులు ఆందోళన కొనసాగిస్తున్నారు.