సాధారణంగా నవజాత శిశువులను ఓ ఆస్పత్రి నుంచి మరో ఆస్పత్రికి అత్యాధునిక వైద్య చికిత్సలను అందించడం కోసం తరలిస్తుండటం జరుగుతుంటుంది. నవజాత శిశువులను అత్యవసర వైద్య చికిత్స కోసం తరలించే సమయంలో ఈ నవజాత శిశువుల ఆరోగ్యం మరింతగా క్షీణించకుండా చేయడం లేదా అనారోగ్యం బారిన పడకుండా చేసేందుకు అంబులెన్స్‌లో ఐసీయూ వసతులు కావాల్సి ఉంటుంది.
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తన పార్టీ పేరును భారత్ రాష్ట్ర సమితి(బీఆర్‌ఎస్)గా మార్చడంతో పాటుగా జాతీయ రాజకీయాల్లోకి ప్రవేశంపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ స్పందించారు. జాతీయ రాజకీయాల్లోకి ఎవరు వచ్చినా తాము స్వాగతిస్తామని ఆయన స్పష్టం చేశారు.
హైదరాబాద్‌లో మరోసారి వరుణుడు తన ప్రతాపాన్ని చూపించాడు. ఇవాళ ఉదయం నుంచి కురిసిన వర్షానికి నగరవాసులు తడిసిముద్దయ్యారు. భారీ వర్షం వల్ల రోడ్లు జలమయమయ్యాయి. రోడ్లపైకి నీరు రావడంతో వాహనదారులు, బాటసారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు.
రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్‌లో దొంగలు రెచ్చిపోయారు. హిమాయత్ సాగర్ సౌడమ్మ దేవాలయంలోకి ఓ దొంగల ముఠా చొరబడి అమ్మవారి హుండీని పగలగొట్టడానికి విఫలయత్నం చేసింది.
బీజేపీకి వ్యతిరేకంగా కమ్యూనిస్టుల తరువాత పోరాడే వ్యక్తి కేసీఆర్ అని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు అన్నారు. అనేక అంశాలపై కేసీఆర్‌కు అవగాహన ఉందన్నారు.
లక్నో వేదికగా దక్షిణాఫ్రికాతో జరుగుతున్న మూడో మ్యాచ్‌ల వన్డే సిరీస్‌లోని మొదటి వన్డేలో భారత్ టాస్ గెలిచి బౌలింగ్‌ను ఎంచుకుంది. ఈ మ్యాచ్‌కు శిఖర్ ధావన్ కెప్టెన్‌గా వ్యవహరిస్తున్నాడు.
ఆదాయాలను సమకూరుస్తున్న శాఖలపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి తాడేపల్లిలోని తన క్యాంప్ కార్యాలయంలో గురువారం సమీక్ష చేపట్టారు. రాష్టంలో ఆదాయాలు గాడినపడ్డాయని అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు.
అస్సాంలోని గువాహటి వేదికగా రెండో టీ-20 ఆడేందుకు భారత్, దక్షిణాఫ్రికాలు సిద్ధమయ్యాయి. ఈ మ్యాచ్ గెలిచి చరిత్ర సృష్టించాలని భారత్ భావిస్తుండగా.. మొదటి మ్యాచ్ ఓటమికి ప్రతీకారం తీర్చుకోవాలని ప్రొటిస్ జట్టు పట్టుదలతో ఉంది.