ఉద్యోగుల సాధారణ బదిలీలకు ఆంధ్రప్రదేశ్ సర్కారు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. ఆమేరకు విధించిన బ్యాన్‌ను ఎత్తేస్తున్నట్లు ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. జూన్ 8 నుంచి 17వరకు బదిలీలకు ప్రభుత్వం అనుమతిచ్చింది. ఐదేళ్లకు పైబడిన ఉద్యోగులకు బదిలీ అవకాశం కల్పిస్తున్నారు. వ్యక్తిగత వినతులు, పరిపాలన సౌలభ్యం ఆధారంగా బదిలీలను చేపడుతున్నారు. బదిలీల గైడ్ లైన్స్ జారీ చేస్తూ ఉత్తర్వులను విడుదల చేసింది. ఐదేళ్లు ఒకే చోట పని చేస్తే కచ్చితంగా స్థాన చలనం కల్పించాలని స్పష్టం చేసింది. […]
బీజేపీ జాతీయాధ్యక్షుడు జేపీ నడ్డా ఇంద్రకీలాద్రిపై కనకదుర్గమ్మను దర్శించుకున్నారు. ఆలయ అధికారులు ఆయనకు ఘనస్వాగతం పలికారు. అమ్మవారిని దర్శించుకున్న అనంతరం నడ్డాకు పండితులు వేదాశీర్వచనం చేశారు. ఆ తర్వాత ప్రసాదం, చిత్రపటాని ఆయనకు అందజేశారు. ఎప్పటినుంచో జగన్మాత కనకదుర్గమ్మ దర్శనానికి రావాలని అనుకున్నానని.. ఇప్పటికి అమ్మవారిని దర్శించుకోవడం సంతోషంగా ఉందని చెప్పారు. దుర్గమ్మ కరుణ కటాక్షాలు ప్రజలందరిపై ఉండాలని ఆకాంక్షించారు. దేశ ప్రజలు సుభిక్షంగా ఉండాలని అమ్మవారి ఆశీస్సులతో మంచి పాలన అందాలని కోరుకున్నారు. KA PAUL: […]
తెలంగాణ రాష్ట్రంలో అమ్మాయిల పరిస్థితి దారుణంగా ఉందని కాంగ్రెస్ సీనియర్ నేత గీతారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. జూబ్లీహిల్స్ బాలికపై అత్యాచార ఘటన కేసు రోజు రోజుకు విచిత్రంగా మారుతోందన్నారు. రాజకీయ నాయకుల పిల్లలను కాపాడాలని పోలీసులు చూస్తున్నారని ఆమె ఆరోపించారు. అమ్మాయి తండ్రి ఫిర్యాదు చేసినా మూడు రోజుల వరకు ఎందుకు పట్టించుకోలేదని గీతారెడ్డి పోలీసులను ప్రశ్నించారు. పబ్స్ కి , డ్రగ్స్ కి హైదరాబాద్ హబ్ గా మారిందన్నారు. అసలు పబ్స్ కి అనుమతులు […]
తెలంగాణలో పోలీస్ అధికారులకు హైకోర్టు 4 వారాల జైలు శిక్ష విధించింది. నలుగురు కోర్టు ధిక్కరణ కేసులో హైకోర్టు తీర్పు వెల్లడించింది. నలుగురు పోలీసు అధికారులకు జైలు శిక్ష విధించింది. నలుగురికి 4 వారాల పాటు జైలు శిక్ష విధిస్తున్నట్లు తీర్పు వెలువరించింది. భార్యాభర్తల వివాదం కేసులో సుప్రీం ఆదేశాలకు విరుద్ధంగా వ్యవహరించారని నలుగురిపై ఆరోపణలు వచ్చాయి. సుప్రీంకోర్టు నిబంధనల మేరకు సీఆర్‌పీసీ 41ఏ నోటీసు ఇవ్వలేదని పోలీసులపై అభియోగం నమోదైంది. Niranjan Reddy: త్వరలోనే ఇంగ్లీష్ […]
నారాయణపేట జిల్లాలో వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు పర్యటించారు. నారాయణపేట జిల్లా కేంద్రంతో పాటు నారాయణపేట మండల పరిధి అప్పక్ పల్లి గ్రామంలో రూ.64కోట్ల 43 లక్షల 19 వేలతో చేపట్టిన వివిధ అభివృద్ధి పనులకు మంత్రి తన్నీరు హరీశ్ రావు, మంత్రి శ్రీనివాస్ గౌడ్, స్థానిక ఎమ్మెల్యే ఎస్.రాజేందర్ రెడ్డితో కలిసి పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేశారు. అప్పక్ పల్లి గ్రామ శివారులో రూ.56 కోట్ల వ్యయంతో 390 పడకల జిల్లా […]