ప్రతిష్ఠాత్మక జాతీయ క్రీడల్లో తెలుగు రాష్ట్రాల అథ్లెట్లు అద్భుతంగా రాణిస్తు్న్నారు. తెలంగాణ షూటర్ ఇషాసింగ్, ఆంధ్రపదేశ్ స్ప్రింటర్ జ్యోతి యర్రాజి స్వర్ణాలు గెలిచారు.
జాతీయ పార్టీ ఏర్పాటుపై ఇవాళ తెరాస నేతలతో ముఖ్యమంత్రి కేసీఆర్ కీలక భేటీ నిర్వహించనున్నారు. జాతీయ పార్టీ పేరు, జెండా, అజెండాపై స్పష్టతనిచ్చే అవకాశముంది. దసరా నాడు ప్రకటించనుండడంతో ఏం చేయాలనే దానిపై దృష్టి సారించారు గులాబీ బాస్.
వరుస సినిమాలతో ప్రామిసింగ్ హీరోగా తనకంటూ స్పెషల్ ఇమేజ్ క్రియేట్ చేసుకున్నాడు ఆది సాయికుమార్. ప్రస్తుతం వివిధ ప్రాజెక్ట్‌లతో బిజీగా ఉన్న ఆది మరికొద్ది రోజుల్లో 'టాప్ గేర్' అనే డిఫరెంట్ కాన్సెప్ట్ మూవీతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు.
క్రెయిన్‌లోని నాలుగు ప్రాంతాలను విలీనం చేసుకోవడాన్ని వ్యతిరేకిస్తూ ఐరాస భద్రతా మండలిలో తీర్మానం ప్రవేశపెట్టగా రష్యా వీటో చేసింది. ఓటింగ్‌కు భారత్ గైర్హాజరైంది.
పాకిస్థాన్ ప్రభుత్వానికి చెందిన అధికారిక ట్విట్టర్ ఖాతా మరోసారి భారత్‌లో నిలిచిపోయింది. పాకిస్థాన్ ప్రభుత్వ ట్విట్టర్ ఖాతా నిలిపివేయడం ఇది రెండోసారి.
మిషన్ భగీరథకు జాతీయ అవార్డుపై కేంద్ర జల శక్తి శాఖ స్పందించింది. మిషన్ భగీరథకు జాతీయ అవార్డు ఇచ్చారనడం అబద్దమని కేంద్రం వెల్లడించింది. ఆ పథకాన్ని కేంద్రం అసలు అంచనా వేయనేలేదని జలశక్తి శాఖ వెల్లడించింది.
గత నెలలో బంధువుతో సహా ముగ్గురు స్నేహితులచే లైంగిక వేధింపులకు, క్రూరత్వానికి గురైన 10 ఏళ్ల ఢిల్లీ బాలుడు ఢిల్లీ ప్రభుత్వ లోక్ నాయక్ జై ప్రకాష్ నారాయణ్ ఆస్పత్రి(ఎల్‌ఎన్‌జేపీ)లోని ఇంటెన్సివ్ కేర్ యూనిట్ (ఐసీయూ)లో చికిత్స పొందుతూ ఇవాళ ఉదయం ప్రాణాలు కోల్పోయాడు.
ప్రస్తుతం డెబిట్, క్రెడిట్ కార్డులు వాడడం సర్వసాధారణమైపోయింది. క్రెడిట్‌కార్డు, డెబిట్ కార్డులకు సంబంధించి జులై 1 నుంచి ఆర్‌బీఐ కొన్ని కొత్త నియమాలు అమల్లోకి తీసుకొచ్చిన విషయం తెలిసిందే. వాటిలో కొన్నింటి గడువును అక్టోబర్ 1 వరకు పొడిగించింది.
భారత టెలికాం రంగంలో నూతన శకం ప్రారంభమైంది. దేశంలో ఢిల్లీలోని ప్రగతి మైదాన్‌లో 6వ ఇండియా మొబైల్ కాంగ్రెస్‌ను ప్రారంభించిన ప్రధాని మోదీ... దీంతో పాటు 5జీ సేవలకు కూడా శ్రీకారం చుట్టారు.