Ind vs SA: లక్నో వేదికగా దక్షిణాఫ్రికాతో జరుగుతున్న మూడో మ్యాచ్‌ల వన్డే సిరీస్‌లోని మొదటి వన్డేలో భారత్ టాస్ గెలిచి బౌలింగ్‌ను ఎంచుకుంది. ఈ మ్యాచ్‌కు శిఖర్ ధావన్ కెప్టెన్‌గా వ్యవహరిస్తున్నాడు. కాగా వర్షం కారణంగా ఈ మ్యాచ్‌ను 40 ఓవర్లకు కుదించారు. మరోవైపు రుతురాజ్ గైక్వాడ్ టీమిండియా తరఫున వన్డేల్లో అరంగేట్రం చేయనున్నాడు. షెడ్యూల్ ప్రకారం మధ్యాహ్నం ఒంటి గంటకు టాస్ వేయాల్సి ఉండగా.. వర్షంతో ఔట్ ఫీల్డ్ చిత్తడిగా మారడంతో అంతరాయం కలిగింది.
దక్షిణాఫ్రికాతో జరిగిన టీ-20 సిరీస్‌ను 2-1తో కైవసం చేసుకున్న తర్వాత భారత జట్టు ఇప్పుడు ప్రోటీస్‌తో మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌లో తలపడుతోంది. అక్టోబరు 16న ప్రారంభమయ్యే టీ20 ప్రపంచ కప్ కోసం ఆస్ట్రేలియాకు వెళ్లే కారణంగా భారత ప్రధాన జట్టులోని చాలా మంది ఆటగాళ్లు సిరీస్‌కు దూరమయ్యారు. శిఖర్ ధావన్ కెప్టెన్‌గా వ్యవహరిస్తుండగా… శ్రేయస్ అయ్యర్ వైస్ కెప్టెన్ బాధ్యతలు నిర్వర్తిస్తున్నాడు. మరోవైపు, దక్షిణాఫ్రికాకు వారి రెగ్యులర్ కెప్టెన్ టెంబా బావుమా నాయకత్వం వహించనున్నాడు.
టీమిండియా జట్టు: శిఖర్ ధావన్(కెప్టెన్), శుభమన్ గిల్, రుతురాజ్ గైక్వాడ్, శ్రేయస్ అయ్యర్, ఇషాన్ కిషన్, సంజు శాంసన్(వికెట్ కీపర్), శార్దూల్ ఠాకూర్, కుల్దీప్ యాదవ్, రవి బిష్ణోయ్, మహ్మద్ సిరాజ్, అవేష్ ఖాన్
దక్షిణాఫ్రికా జట్టు: జన్నెమన్ మలన్, క్వింటన్ డి కాక్(వికెట్ కీపర్), టెంబా బావుమా(కెప్టెన్), ఐడెన్ మార్క్రామ్, హెన్రిచ్ క్లాసెన్, డేవిడ్ మిల్లర్, వేన్ పార్నెల్, కేశవ్ మహరాజ్, కగిసో రబడ, లుంగి ఎన్గిడి, తబ్రైజ్ షమ్సీ