మునుగోడులో ఇవాళ్టి నుంచి నామినేషన్ల పర్వం ప్రారంభం కావడంతో ఆ నియోజకవర్గంలో ఎన్నికల వాతావరణం వేడెక్కింది. మునుగోడు ఉపఎన్నికలో టీఆర్‌ఎస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేయనున్న కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డికి ముఖ్యమంత్రి కేసీఆర్ బీఫాంను ప్రగతిభవన్‌లో అందజేశారు.
జార్ఖండ్‌లోని బొకారో జిల్లాలో దారుణం జరిగింది. తమ గ్రామానికి చెందిన మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడని ఓ వ్యక్తిపై మూకదాడి జరిగింది. ఈ ఘటన బొకారో జిల్లాలోని మహుటాండ్ పీఎస్ పరిధిలోని ధ్వయ గ్రామంలో చోటుచేసుకుంది.
విజయదశమి సందర్భంగా రావణ దహనం నిర్వహించడం సంప్రదాయంగా వస్తోంది. రావణ దహనం పేరిట నిర్వహించే ఈ ఉత్సవాలను తిలకించేందుకు భక్తులు భారీగా తరలివస్తుంటారు. కానీ ఛత్తీస్‌గఢ్‌లోని ధంతరిలో జరిగిన రావణదహన కార్యక్రమం వైరల్‌గా మారింది.
జ్ఞానవాపీ మసీదు కేసులో బయటపడిన శివలింగానికి కార్బన్ డేటింగ్ జరపాలంటూ హిందూ మహిళలు వేసిన పిటిషన్‌పై తీర్పును వారణాసి కోర్టు అక్టోబర్ 11వ తేదీకి వాయిదా వేసింది.
ప్రస్తుతం తెలంగాణ రాజకీయాల్లో ఆసక్తి రేకెత్తిస్తున్న అంశం మునుగోడు ఉపఎన్నిక. నల్గొండ జిల్లా మునుగోడు అసెంబ్లీ ఉప ఎన్నికకు నోటిఫికేషన్ విడుదలైంది. నామినేషన్లు తక్షణమే ప్రారంభమవుతాయని కేంద్ర ఎన్నికల సంఘం శుక్రవారం పేర్కొంది.
రాహుల్ గాంధీ అతి ధైర్యం, పట్టుదలతో కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకు 3500 కిలోమీటర్లు పాదయాత్ర చేస్తున్నారని కాంగ్రెస్ సీనియర్ నేత వి.హనుమంతరావు అన్నారు. రెండుసార్లు ప్రధానిగా అవకాశం వచ్చినా ఆర్థికవేత్తకు అవకాశం ఇచ్చారని రాహుల్‌ను వీహెచ్ కొనియాడారు.
కాళేశ్వరం, మిషన్ భగీరథ, 24 గంటల కరెంట్‌ను ఉచితంగా ఇవ్వొచ్చని ఈ దేశంలో వ్యవసాయాన్ని లాభసాటిగా చేసి వ్యవసాయం దండగ కాదు పండుగ అని స్వల్ప సమయంలో నిరూపించిన వ్యక్తి కేసీఆర్ అంటూ మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు.
లక్నో వేదికగా దక్షిణాఫ్రికాతో జరిగిన మొదటి వన్డేలో టీమిండియా పరాజయం పాలైంది. తొలి వన్డేలోని సఫారీలు విజయాన్ని నమోదు చేసుకున్నారు. భారత జట్టుపై దక్షిణాఫ్రికా 9 పరుగుల తేడాతో విజయాన్ని సాధించింది.
తెలంగాణ అభివృద్ధిని అడ్డుకునేందుకు బీజేపీ కుయుక్తులు పన్నుతోందని మంత్రి జగదీశ్‌రెడ్డి అన్నారు. బీజేపీ ఆగడాలను అడ్డుకునేందుకు ప్రగతిశీల శక్తులతో కలిసి సాగుతున్నట్లు ఆయన వెల్లడించారు.
బీఆర్ఎస్ జాతీయ పార్టీ ఏర్పాటు చేసిన సందర్భంగా గురువారం ప్రగతిభవన్‌లో సీఎం కేసీఆర్‌ను తమిళనాడు ఎంపీ, ప్రముఖ దళిత నేత, వీసీకే పార్టీ అధినేత తిరుమావళవన్‌తో వివిధ రాష్ట్రాల నాయకులు కలిశారు.