Kunamneni Sambashivarao: బీజేపీకి వ్యతిరేకంగా కమ్యూనిస్టుల తరువాత పోరాడే వ్యక్తి కేసీఆర్ అని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు అన్నారు. అనేక అంశాలపై కేసీఆర్‌కు అవగాహన ఉందన్నారు. బీఆర్ఎస్ పార్టీని సీపీఐ స్వాగతిస్తోందని ఆయన తెలిపారు. కొన్ని అంశాల్లో వ్యతిరేకించినా కానీ.. అన్ని రంగాల్లో తెలంగాణ బాగుపడుతుందని ఆయన వెల్లడించారు. దేశ విచ్ఛిన్న శక్తులైన బీజేపీ వంటి పార్టీలను వ్యతిరేకించే పార్టీలకు తమ మద్దతు ఉంటుందన్నారు.
Alai balai: అలయ్ బలయ్ వేడుకలో మెగాస్టార్.. డోలు వాయిస్తూ డ్యాన్స్ చేసిన చిరు
ఇప్పుడున్న బీజేపీకి, వాజ్‌పేయ్ బీజేపీకి చాలా తేడా ఉందన్న ఆయన.. రాజ్యాంగాన్ని కూడా మార్చే కుట్రలు జరుగుతున్నాయని విమర్శించారు. అమెరికా తరహాలో అధ్యక్ష విధానం తేవడానికి మోడీ చూస్తున్నారని.. ఈడీ, సీబీఐ, ఎలక్షన్ కమిషన్‌లను బీజేపీ దుర్వినియోగం చేస్తోందన్నారు. దేశంలో ప్రగతి ఎక్కడా కనిపించడం లేదని ఆయన మండిపడ్డారు. దేశం ఆర్థిక సంక్షోభంలో ఉందన్న ఆయన.. శ్రీలంక లాగా దేశం మారుతుందని చెప్పారు. ఉద్యోగాలు లేవు కానీ, ఉన్నవి ఊడుతున్నాయని కూనంనేని శ్రీనివాసరావు మండిపడ్డారు. ఆఫ్రికన్ దేశాలు కూడా చాలా రంగాల్లో మనకంటే ముందున్నాయన్నారు. మతం అనే అంశాన్ని తీసుకువచ్చి.. దేశాన్ని చెడగొడుతోందని ఆయన ఆరోపించారు.