గాంధీజీ భారతదేశంలో పుట్టడం మనందరి అదృష్టమని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క అన్నారు. ఆయన మార్గం ప్రపంచ మానవాళికి దిశానిర్దేశమన్నారు. ప్రస్తుతం దేశంలో అనేక రకాల అశాంతి, విభజన చోటు చేసుకుంటుందన్నారు.
బీజేపీ రాష్ట్ర కార్యాలయంలోకి వచ్చిన ఇంటెలిజెన్స్ పోలీసులపై కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. బీజేపీ కార్యాలయంలోకి ఎలా వస్తారని కిషన్ రెడ్డి ప్రశ్నించారు. ఫోన్లు ట్యాప్ చేస్తున్నది సరిపోవడం లేదా? అని తీవ్రంగా మండిపడ్డారు.
యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి పట్టణంలోని గాంధీ పార్కులో గల గాంధీ విగ్రహానికి పూలమాల వేసి భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి నివాళులర్పించారు. గాంధీ ఆశయాల కోసం కృషి చేద్దామని ప్రజలనుద్దేశించి మాట్లాడారు.
ప్రపంచ దేశాల్లో శాంతి కోరుకునే నెల్సన్ మండేలా లాంటి నాయకులకు గాంధీ స్ఫూర్తి అని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి వెల్లడించారు. ప్రపంచానికి గాంధీయిజాన్ని పరిచయం చేసిన గొప్ప మహనీయుడన్నారు.
అహింస సిద్ధాంతంతో గాంధీజీ.. బ్రిటీష్‌వారిపై పోరాడి విజయం సాధించారని సీఎం కేసీఆర్ కొనియాడారు. గాంధీ సిద్ధాంతం ఎప్పటికైనా విశ్వజనీనమని ఆయన అన్నారు. గాంధీ మార్గంలో తెలంగాణ సాధించుకున్నామని ఆయన తెలిపారు.
గాంధీజీ స్ఫూర్తితో శాంతియుత మార్గంలో తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నామని ముఖ్యమంత్రి కేసీఆర్ స్పష్టం చేశారు. మహాత్మగాంధీ జయంతి సందర్భంగా ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ఆయనకు ఘనంగా నివాళులర్పించారు.
ఏఐసీసీ నేత రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర పేరిట పాదయాత్ర చేస్తున్న విషయం తెలిసిందే. అయితే.. అక్టోబర్ 24 నుండి తెలంగాణలో రాహుల్ గాంధీ పాదయాత్ర ప్రారంభం కానుంది.
సీనియర్ అధికారి, ఆర్టీసీ ఎండీ సజ్జనార్ కారు ఆటోను ఢీకొట్టిన ఘటన పెద్దపల్లి జిల్లాలో జరిగింది. పాలకుర్తి మండలం ధర్మారం క్రాస్ రోడ్డు వద్ద ఆటోను ఢీకొట్టింది.