AP CM Jagan Review: ఆదాయాలను సమకూరుస్తున్న శాఖలపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి తాడేపల్లిలోని తన క్యాంప్ కార్యాలయంలో గురువారం సమీక్ష చేపట్టారు. రాష్టంలో ఆదాయాలు గాడినపడ్డాయని అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. ఈ ఆర్థిక సంవత్సరం ఆశాజనకంగా ఉందని.. ప్రథమార్థంలో ఆదాయాల ప్రగతి 94.47శాతం లక్ష్యాన్ని చేరుకుందన్నారు. దేశ సగటుతో పోలిస్తే రాష్ట్రంలో అధికంగా జీఎస్టీ సగటు వసూళ్లు ఎక్కువగా ఉన్నాయన్నారు. రిజిస్ట్రేషన్ ప్రక్రియలో పారదర్శక, సులభతర విధానాలపై కమిటీని ముఖ్యమంత్రి జగన్ ఏర్పాటు చేశారు.
Botsa Satyanarayana: రైతుల పాదయాత్రపై ఫైర్.. ఎందుకు సహకరించాలి?
పన్ను వసూళ్లలో లీకేజీలను అరికట్టడంపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని సీఎం జగన్ అధికారులను ఆదేశించారు. పారదర్శక, సులభతర విధానాల ద్వారా చెల్లింపుదారులకు సౌలభ్యంగా ఉండాలన్నారు. నాటుసారా తయారీయే వృత్తిగా ఉన్న వారికి ప్రత్యామ్నాయ జీవనోపాధి చూపించాలన్నారు. అనుమతులు పొందిన లీజుదారులు మైనింగ్ నిర్వహించేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. వారికేమైనా ఇబ్బందులు ఉంటే తీర్చేలా తగిన చర్యలు తీసుకోవాలన్నారు. ఈ సమావేశంలో ఉపముఖ్యమంత్రి కె.నారాయణ స్వామి, మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, సీఎస్ సమీర్ శర్మ, ఇతర ఉన్నతాధికారులు హాజరయ్యారు.