కూటమి ప్రభుత్వం ప్రజలపై రూ.15 వేల కోట్ల విద్యుత్ చార్జీల భారాన్ని మోపడాన్ని వ్యతిరేకిస్తూ వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్ జగన్ పిలుపు మేరకు ఈ నెల 27వ తేదీన తలపెట్టిన ర్యాలీలు, వినతిపత్రాల సమర్పణ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పార్టీ రాష్ట్ర సమన్వయకర్త సజ్జల రామకృష్ణారెడ్డి కోరారు. తాడేపల్లి వైయస్ఆర్ పార్టీ కేంద్ర కార్యాలయం నుంచి జిల్లా పార్టీ అధ్యక్షులతో టెలీ కాన్ఫరెన్స్ లో మాట్లాడారు.
ఢిల్లీ పర్యటనలో ఉన్న ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు రాష్ట్ర అభివృద్ధి లక్ష్యంగా వరుసగా కేంద్ర మంత్రులతో భేటీ అవుతున్నారు. తాజాగా ప్రధాని మోడీతో భేటీ అయ్యారు. దాదాపు గంట పాటు ప్రధాని మోడీతో సీఎం చంద్రబాబు సమావేశమయ్యారు. ఏపీ పర్యటనకు రావాలని ప్రధాని మోడీని సీఎం చంద్రబాబు ఆహ్వానించారు.
మూడోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత తొలిసారిగా ప్రధాని నరేంద్ర మోడీ ఏపీలో పర్యటించనున్నారు. జనవరి 8న ప్రధాని మోడీ ఏపీ పర్యటనకు రానున్నారు. రూ. 85 వేల కోట్ల ప్రాజెక్టులకు ప్రధాని శంకుస్థాపనలు చేయనున్నట్లు తెలిసింది. ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న విశాఖ రైల్వే జోన్‌కు ప్రధాని మోడీ శంకుస్థాపన చేయనున్నారు.
ఢిల్లీలోని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు అధికార నివాసానికి రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్ విచ్చేశారు. సీఎం చంద్రబాబుతో రైల్వే మంత్రి భేటీ అయ్యారు. ఏపీలోని పలు రైల్వే ప్రాజెక్టులపై చర్చించారు. అనంతరం ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నివాసానికి సీఎం చంద్రబాబు నాయుడు చేరుకున్నారు.
కూటమి ప్రభుత్వం ఆరు నెలలు పూర్తి చేసుకున్న తర్వాత మంత్రుల పెర్ఫార్మెన్సుపై సీఎం చంద్రబాబు దృష్టి పెట్టారు. ఒక రకంగా చెప్పాలంటే మంత్రులకు మార్కులు ఇచ్చారు. ఎవరి పనితీరు ఏ రకంగా ఉంది అనే ఒక అంచనా కూడా వేశారు సీఎం చంద్రబాబు. ప్రధానంగా కొన్ని ముఖ్యమైన అంశాలు దృష్టిలో పెట్టుకుని సీఎం చంద్రబాబు మంత్రులకు పెర్ఫార్మెన్స్ రిపోర్ట్ ఇచ్చినట్టు సమాచారం.
సుపరిపాలన అందించడం వల్లే బీజేపీని వరుసగా మూడుసార్లు ప్రజలు గెలిపించారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు, రాజమండ్రి ఎంపీ దగ్గుబాటి పురంధేశ్వరి పేర్కొన్నారు. బీజేపీని మరో రెండు మూడు సార్లు అధికారంలోకి తీసుకురావడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారన్నారు. బాబాసాహెబ్ అంబేడ్కర్ బీజేపీకి స్ఫూర్తిదాయకమని ఆయన పేర్కొన్నారు. పెద్ద ఎత్తున ప్రజలు బీజేపీని సమర్థించడానికి సిద్ధంగా ఉన్నారన్నారు. తూర్పుగోదావరి జిల్లా గోకవరం సభలో ఎంపీ పురంధేశ్వరి మాట్లాడారు.
Minister Nadendla Manohar: ఏపీ ప్రభుత్వం ఆధ్వర్యంలో వినియోగదారుల దినోత్సవాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మంత్రి నాదెండ్ల మనోహర్ పాల్గొని మాట్లాడారు. పీడీఎస్ బియ్యం స్మగ్లింగ్ ఎసెన్షియల్ కమోడిటీస్ యాక్ట్ కాకుండా పీడీ యాక్ట్ పెట్టాలని చట్టం తెచ్చామన్నారు. వినియోగదారుడికి కొన్ని హక్కులు ఉన్నాయని.. వినియోగదారుడికి వ్యాపారులు కొన్ని సౌకర్యాలు కల్పించాలని పేర్కొన్నారు. ఏదైనా వస్తువులు కొనుగోలు చేసినప్పుడు అమ్మకందారులు కూడా బాధ్యతగా ఉండాలంటే చట్టంపై అవగాహన కలిగి ఉండాలన్నారు. మొక్కుబడిగా అవగాహన కార్యక్రమం చేయటం కాకుండా […]
ప్రముఖ శైవక్షేత్రమైన శ్రీశైలంలో జనవరి 1వ తేదీన శ్రీమల్లికార్జునస్వామి స్పర్శదర్శనాలు, ఆర్జిత అభిషేకాలను నిలిపివేశారు. జనవరి 1న నూతన సంవత్సరం సందర్భంగా భక్తుల రద్దీ దృష్ట్యా నిలుపుదల చేస్తున్నట్లు దేవస్థానం ప్రకటించింది.