ఫేస్‌బుక్ వేదికగా ప్రముఖ వ్యాపారులు, రాజకీయ నాయకులు, సినీ నిర్మాతలకు ఫ్రెండ్ రిక్వెస్టులు పంపి నెమ్మదిగా వారితో మాట కలుపుతుంది. కాస్త స్నేహం కాగానే తీయని మాటలతో మాయ చేస్తుంది. ఆమె వలపు వలలో పడిన బాధితులు ఆమె చెప్పేవన్ని నిజాలనుకుని నమ్మేస్తారు.
భారత వైమానిక దళానికి కొత్త యూనిఫాం అందుబాటులోకి వచ్చింది. శనివారం చంఢీగడ్‌లో జరిగిన 90వ భారత వైమానిక దళ వార్షికోత్సవాల్లో ఈ యూనిఫాంను ఎయిర్ చీఫ్ వివేక్ రామ్ చౌదరి ఆవిష్కరించారు. ఇంతకు ముందు ఉన్న యూనిఫాం కంటే ఇప్పుడు మరింత డిఫరెంట్‌గా ఉంది.
రాజస్థాన్‌లో గౌతమ్ అదానీ రూ. 60వేల కోట్ల పెట్టుబడిని పెట్టనున్నట్లు ప్రకటించారు. ఆ ప్రకటనను ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ స్వాగతించారు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి
దాదాపు 75 లక్షల విలువైన ఎర్రచందనం దుంగలను హైదరాబాద్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఎర్రచందనం స్మగ్లింగ్‌కు పాల్పడుతున్న నలుగురు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితులు కల్వకుర్తి, కడప వాసులుగా గుర్తించారు.
చిన్నప్పటి నుంచి కంటికి రెప్పలా కాపాడుతూ వచ్చిన తల్లిదండ్రులనే హతమార్చేందుకు యత్నించాడు ఓ కసాయి కొడుకు. తల్లిదండ్రులను ఆదుకోవాల్సిన కుమారుడు డబ్బులకోసం వారిని చంపేందుకు కూడా వెనకాడలేదు. ఈ ఘటన ఢిల్లీలోని ఫతే నగర్‌లో చోటుచేసుకుంది.
కేంద్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా ముంబయి- గాంధీనగర్ మధ్య నూతనంగా ప్రారంభించిన వందే భారత్ సెమీ హైస్పీడ్ ఎక్స్‌ప్రెస్ రైలుకు వరుస ప్రమాదాలు జరుగుతున్నాయి
హైదరాబాద్ మెట్రో నగరవాసులకు శుభవార్త చెప్పింది. మెట్రో రైల్ వేళలను మరింతగా పొడిగిస్తూ శుక్రవారం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం 10.15 గంటల వరకే హైదరాబాద్‌లో మెట్రో సేవలు అందుతుండగా.. ఇకపై రాత్రి 11 గంటలకు పెంచాలని హైదరాబాద్ మెట్రోరైలు నిర్ణయించింది.