Ind vs Sa: అస్సాంలోని గువాహటి వేదికగా రెండో టీ-20 ఆడేందుకు భారత్, దక్షిణాఫ్రికాలు సిద్ధమయ్యాయి. ఈ మ్యాచ్ గెలిచి చరిత్ర సృష్టించాలని భారత్ భావిస్తుండగా.. మొదటి మ్యాచ్ ఓటమికి ప్రతీకారం తీర్చుకోవాలని ప్రొటిస్ జట్టు పట్టుదలతో ఉంది. ఈ నేపథ్యంలో వర్షం ఆటంకం కలిగించకపోతే ఈ మ్యాచ్ మరింత రసవత్తరంగా మారే అవకాశం ఉంది. కాగా రాత్రి ఏడు గంటలకు మ్యాచ్ ఆరంభం కానుంది.
mumbai drugs: రూ.1,476కోట్ల విలువైన డ్రగ్స్ పట్టుకున్న డీఆర్ఐ
గువాహటిలో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం పడే అవకాశం ఉందని ‘ఆక్యూవెదర్’ తెలిపింది. మూడు గంటలపాటు వర్షం కురిసే అవకాశం ఉన్నట్లు చెప్పింది. స్టేడియంలో మ్యాచ్ వీక్షించేందుకు టికెట్లు కొన్న అభిమానులు ఈ వార్తతో నిరాశ వ్యక్తం చేస్తున్నారు. కరోనా పరిస్థితుల తర్వాత జరుగుతున్న మ్యాచ్ కావడంతో భారీ సంఖ్యలో టికెట్లు అమ్ముడయ్యాయి. వర్షం పడితే ఎదుర్కొనేందుక స్టేడియం నిర్వాహకులు వెల్లడించారు. ప్రస్తుతం భీకర ఫామ్‌లో ఉన్న టీమిండియా బ్యాటర్ సూర్యకుమార్ యాదవ్ తన కెరీర్‌లో అరుదైన మైలురాయికి చేరువలో ఉన్నాడు. ఈ మ్యాచ్‌లో సూర్య 24 పరుగులు సాధిస్తే అంతర్జాతీయ టీ20లలో 1000 పరుగుల మార్కును అందుకున్నాడు.