Rainbow Children Hospitals: దేశంలోనే మొట్టమొదటిసారి.. నవజాత శిశువుల కోసం అంబులెన్స్‌లో అత్యాధునిక వెంటిలేషన్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Rainbow Children Hospitals: సాధారణంగా నవజాత శిశువులను ఓ ఆస్పత్రి నుంచి మరో ఆస్పత్రికి అత్యాధునిక వైద్య చికిత్సలను అందించడం కోసం తరలిస్తుండటం జరుగుతుంటుంది. నవజాత శిశువులను అత్యవసర వైద్య చికిత్స కోసం తరలించే సమయంలో ఈ నవజాత శిశువుల ఆరోగ్యం మరింతగా క్షీణించకుండా చేయడం లేదా అనారోగ్యం బారిన పడకుండా చేసేందుకు అంబులెన్స్‌లో ఐసీయూ వసతులు కావాల్సి ఉంటుంది. ఐసీయూ సేవలు గల అంబులెన్స్ అందుబాటులో ఉంటే డాక్టర్లు, నర్సుల సేవలు నవజాత శిశువులకు లభించడంతో పాటుగా వెంటిలేటర్ సహా ఐసీయూ పరికరాలు సైతం అంబులెన్స్‌లో అందుబాటులో ఉంటాయి.
తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్నాటక, తమిళనాడు, ఢిల్లీలలో నవజాత శిశువులు, చిన్నపిల్లల అత్యవసర రవాణా సేవలను రెయిన్‌బో చిల్డ్రన్స్ హాస్పిటల్ ప్రారంభించింది. ఈ సేవల ద్వారా 250 నుంచి 300కిలోమీటర్ల పరిధిలోని నగరాలలో తగిన సేవలను గత 20 సంవత్సరాలుగా దేశవ్యాప్తంగా అందిస్తోంది. అత్యాధునిక రవాణా వ్యవస్థలో అవసరాలకనుగుణంగా తీర్చిదిద్దిన అంబులెన్స్, వెంటిలేటర్, ఇన్‌క్యుబేటర్, మానిటర్, సిరెంజ్ పంప్స్, డిఫిబ్రిలేటర్ భాగంగా ఉంటాయి. సరిగ్గా చెప్పాలంటే ‘ ఐసీయూ ఆన్ వీల్స్’ లాంటిది ఇది. నవజాత శిశువుల తరలింపులో అనుభవజ్ఞులైన డాక్టర్లు, సుశిక్షితులైన నర్సులు కూడా హాజరవుతారు. అందువల్ల దగ్గరలోని ఆస్పత్రికి (టెరిషియరీ కేర్ హాస్పిటల్) తరలించేంత వరకూ వారికి ఐసీయూ చికిత్స లభిస్తుంది.
Also Read
గత రెండు దశాబ్దాల కాలంలో రెయిన్‌బో 15వేలకు పైగా నవజాత శిశువులు, చిన్నారులను తరలించింది. అత్యవసర ఎయిర్ అంబులెన్స్ సేవలను సైతం రెయిన్‌బో అందిస్తుంది. ఈ సేవల ద్వారా రాయ్‌పూర్, గోవా, విశాఖపట్నం నుంచి నవజాత శిశువులను తరలించింది. ఇప్పటివరకూ శిశువులు ఆక్సిజన్ సరిగా తీసుకోలేకపోవడం వంటి సమస్యలను ఎదుర్కోవడం, సాధారణ వెంటిలేటర్‌పై ఆక్సిజన్‌ను సరిగా నిర్వహించలేని ఎడల వారిని సాధారణంగా తరలించడం జరిగేది కాదు. ఈ తరహా శిశువులను అధిక ఫ్రీక్వెన్సీతో కూడిన వెంటిలేషన్ కావాల్సి ఉంటుంది. వారు సరిగా శ్వాసించేందుకు నైట్రిక్ ఆక్సైడ్ అవసరం కూడా ఉంటుంది. దేశంలో హెచ్‌ఎఫ్‌ఓవీ వెంటిలేటర్, నైట్రిక్ ఆక్సైడ్ మద్దతు వ్యవస్థ కలిగిన అంబులెన్స్ కలిగిన మొట్టమొదటి హాస్పిటల్ రెయిన్‌బో చిల్డ్రన్స్ హాస్పిటల్. దీనిద్వారా తీవ్ర అనారోగ్యం బారిన పడిన చిన్నారులను తరలిస్తారు.
ఓ జిల్లా హాస్పిటల్‌లో బేబీ మెహ్రీన్ ఫాతిమా ఆరోగ్యవంతంగా 2.7 కేజీల బరువుతో పుట్టింది. కానీ పుట్టిన కొన్ని గంటల తరువాత ఆమెకు ఆరోగ్య సమస్యలు తలెత్తాయి. ఆ శిశువుకు గుండెలో సమస్యలు ఉన్నట్లుగా డాక్టర్లు అనుమానించారు. తక్షణమే ఆమెను హైదరాబాద్‌లోని కార్డియాక్ సెంటర్‌కు పంపించారు. అక్కడ డాక్టర్లు ఆ బేబీ గుండె కుడి భాగం సక్రమంగా పనిచేయడం లేదని గుర్తించారు. ఈ కారణం చేత ఆ శిశువు ఆక్సిజన్ స్థాయి గణనీయంగా పడిపోయింది. ఆ తరువాత ఆ శిశువుకు అత్యంత తీవ్రమైన స్థితి పెర్శిస్టెంట్ పల్మనరీ హైపర్‌టెన్షన్ ఆఫ్ ద న్యూబోర్న్ (పీపీహెచ్‌ఎన్) ఉన్నట్లు కనుగొన్నారు. దీనికి తోడు డాక్టర్లు ఆ శిశువు గుండెలో రంధ్రాలు సైతం ఉన్నాయని గుర్తించడంతో పాటుగా అదనపు గాలి విడుదల కావడం కోసం డ్రైన్స్‌ను ఏర్పాటుచేశారు.
శిశువులలో అతి సాధారణ సమస్య పీపీహెచ్‌ఎన్. ఈ సమస్య కారణంగా నవజాత శిశువులు తీవ్ర అనారోగ్యం బారిన పడతారు. చాలా సార్లు వారు సాధారణ వెంటిలేటర్ (సంప్రదాయ)తో కోలుకోరు. వీరికి ప్రత్యేక తరహా వెంటిలేటర్ అయిన హై ఫ్రీక్వెన్సీ వెంటిలేటర్ (హెచ్‌ఎఫ్‌ఓవీ), నైట్రిక్ ఆక్సైడ్‌ను శ్వాసద్వారా అందించాల్సి ఉంటుంది. దీనికి కూడా అత్యాధునిక ఎన్‌ఐసీయూతో పాటుగా కార్డియాలజిస్ట్‌లు, అనుభవంతో కూడిన నియోనాటల్ సంరక్షణ కావాల్సి ఉంటుంది. అప్పుడు మాత్రమే తీవ్ర అనారోగ్యం బారిన పడిన ఈ శిశువులను కాపాడవచ్చు.
ఈ శిశువు ఆరోగ్యం మరింతగా దిగజారడంతో ఆమెకు హై ఫ్రీక్వెన్సీ ఆసిలేషన్ వెంటిలేషన్‌తో పాటుగా నైట్రిక్ ఆక్సైడ్ గ్యాస్ కావాల్సి వచ్చింది. తద్వారా ఆమె శరీరానికి మరింత ఆక్సిజన్ లభించడంలో సహాయపడటమూ వీలవుతుంది. దీనిని వెంటిలేటర్ ద్వారా అందించడం జరుగుతుంది. ఓ సాధారణ వెంటిలేటర్ నిమిషానికి 40–60 బ్రీత్స్ అందిస్తుంది. అదే హై ఫ్రీక్వెన్సీ ఆసిలేషన్ వెంటిలేటర్ మెషీన్ నిమిషానికి 600–900 బ్రీత్స్ అందిస్తుంది. దురదృష్టవశాత్తు , భారతదేశంలో నైట్రిక్ ఆక్సైడ్ అందించేందుకు తగిన ప్రాణ రక్షణ సాధనాలు కలిగిన ఎన్‌ఐసీయూలు అతి తక్కువగా ఉన్నాయి.
ఈ శిశువుకు అత్యాధునికమైన లెవల్ 4 ఎన్‌ఐసీయూ కలిగిన బంజారాహిల్స్ రెయిన్ బో చిల్డ్రన్స్ హాస్పిటల్ వంటి చిల్డ్రన్స్ హాస్పిటల్ అవసరమైంది. దీనితో పాటుగా 24 గంటలూ నియోనాటాలిజిస్ట్‌ల మద్దతు సైతం అవసరం పడుతుంది. అయితే ఇటీవలి కాలం వరకూ కూడా ఈ తరహా శిశువులను తరలించడం అత్యంత సవాల్‌గా ఉండేది. భారతదేశంలో హెచ్‌ఎఫ్‌ఓవీ, ఇన్‌హేల్డ్ నైట్రిక్ ఆక్సైడ్ సదుపాయాలు రవాణా సమయంలో కలిగిన అంబులెన్స్‌లేవీ లేవు. గతంలో పీపీహెచ్‌ఎన్‌తో బాధపడుతూ హెచ్‌ఎఫ్‌ఓవీ అందుకుంటున్న శిశువులను అసలు తరలించే వారు కాదు. ఎందుకంటే ఈ తరహా శిశువులు అప్పటికే అనారోగ్యంగా ఉండటం చేత తరలింపు సమయంలో మరింతగా వారి ఆరోగ్యం క్షీణించే అవకాశాలు ఉండటం కారణం. ఈ తరహా సదుపాయాలు రెయిన్‌బో అంబులెన్స్‌కు ఉన్నాయి. ఈ శిశువుకు నైట్రిక్ ఆక్సైడ్ గ్యాస్‌ను సైతం శ్వాసించేందుకు అందించడం జరిగింది. ఇది ఆమె ప్రాణాలను కాపాడటంతో పాటుగా ఆక్సిజన్ స్థాయిలు మెరుగుపడేందుకు సహాయపడింది.
రెండు దశాబ్దాలుగా నవజాత శిశువుల తరలింపులో అగ్రగామిగా వెలుగొందుతున్న రెయిన్‌బో చిల్డ్రన్స్ హాస్పిటల్ నియోనాటల్ ట్రాన్స్‌పోర్ట్ బృందం భారతదేశంలో మొట్టమొదటిసారిగా హెచ్‌ఎఫ్‌ఓవీ వెంటిలేటర్‌ను ఇన్‌హేల్డ్ నైట్రిక్ ఆక్సైడ్‌ను రవాణా సమయంలో వినియోగించి అనారోగ్యంతో బాధపడుతున్న నవజాత శిశువును కాపాడారు. రెయిన్‌బో నియోనాటల్ ఐసీయుకు చేరుకున్న తరువాత ఆమెను సర్ఫెక్టంట్, హెచ్‌ఎఫ్‌ఓవీ, ఇన్‌హేల్డ్ నైట్రిక్‌ఆక్సైడ్‌తో మూడు రోజుల పాటు చికిత్స అందించడంతో పాటుగా రెండు చెస్ట్ డ్రైన్స్‌ను సైతం ఏర్పాటుచేసి ఆమె ఊపిరితిత్తులలో రంధ్రాలు నయమయ్యేందుకు సహాయపడ్డారు.
అదృష్టవశాత్తు ఈ శిశువు ఆరోగ్యం సర్ఫక్టెంట్, నైట్రిక్ ఆక్సైడ్‌తో పాటుగా హెచ్‌ఎప్‌ఓవీ వెంటిలేటర్‌తో మెరుగుపడింది. ఆమెకు క్రిటికల్ కేర్ మానిటరింగ్, రెగ్యులర్ కార్డియాక్ ఎస్సెస్‌మెంట్, బహుళ ఇనోట్రోప్స్ (సాధారణ రక్తపోటు నిర్వహించేందుకు) తర్వాత ఐదు రోజులు కావాల్సి వచ్చింది. అత్యద్భుతమైన నియోనాటర్ కేర్, నర్సింగ్ మద్దతు, అత్యాధునిక సదుపాయాలు కలిగిన లెవల్ 4 ఎన్‌ఐసీయూ కారణంగా ఈ శిశువు ప్రాణం నిలిచింది. హాస్పిటల్‌లో చేరిన 8వ రోజు ఆమె కోలుకుంది. ఆమెను 11వ రోజు తరువాత హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ చేశారు. గతంలో భారతదేశంలో ఎన్నడూ కూడా ఈ తరహా క్రిటికల్ కేర్ సదుపాయాలు రవాణా సమయంలో అందుబాటులో ఉన్నది లేదు. అందువల్ల ఈ చికిత్స, తరలింపు విప్లవాత్మకం, వినూత్నం. దేశంలో ఈ తరహా తరలింపు కూడా మొట్టమొదటిసారి.
మరింత సమాచారం కోసం..
Dr.Dinesh chirla 98497-90003
Dr.Nalinikantha panigrahy 94948-62327
తాజావార్తలు
-
Story Board : ఏఐతో జరుగుతున్న నష్టాలేంటి..? ట్రంప్ ప్రకటన దేనికి సంకేతం..?
-
Hyderabad City : హైదరాబాద్ పోలీస్ శాఖలో బిగ్ ఛేంజ్.. 76 ప్రాంతాల పరిధులు మార్పు
-
Mamata Banerjee: 2029 ప్రధాని అభ్యర్థిగా రాహుల్ గాంధీ ఓకేనా? మమతా బెనర్జీ ఏం చెప్పారంటే..
-
ODI World Cup 2027 Schedule: వన్డే వరల్డ్‌కప్ షెడ్యూల్ వచ్చేసింది.. భారత్ x పాకిస్థాన్ సమరం ఎప్పుడంటే!
-
Off The Record : బీఆర్ఎస్లో ఎమ్మెల్సీ టికెట్ల గందరగోళం! ఒక సీటు బీసీకేనా? అసలు లెక్కేంటి?
ట్రెండింగ్
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..
-
50MP కెమెరా, 6,000mAh బ్యాటరీ, డైమెన్సిటీ 6300 చిప్‌తో రూ.20,999కే Redmi 17C 5G లాంచ్..!
-
Asian Games 2026: శ్రీలంకపై భారత్ భారీ విజయం.. బంగారు పతకం కోసం భారత్, పాక్ పోరు.!
-
Asian Games 2026: వైభవ్ మెరుపులు.. ఇషాన్ ఊచకోత..! శ్రీలంక టార్గెట్ ఎంతంటే.?