IND vs PAK: భారత్ ముందు ఎవడైనా తల వంచాల్సిందే? కెప్టెన్ సూర్యకు సలాం కొట్టిన ఉస్మాన్ తారిఖ్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
IND vs PAK- Suryakumar Yadav: నిన్న శ్రీలంక రాజధాని కొలంబోలో జరిగిన భారత్-పాకిస్థాన్ మ్యాచ్ ఎంత హీట్ పుట్టించిందో పెద్దగా చెప్పనవసరం లేదు. ఆర్. ప్రేమదాస స్టేడియం మరో అద్భుతమైన నాటకానికి వేదికైంది. అయితే.. నిన్న మ్యాచ్‌కు సంబంధించి ఓ ఇంట్రెస్టింగ్ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఈ వీడియోలో భారత కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్, పాకిస్థాన్ స్పిన్నర్ ఉస్మాన్ తారిఖ్ మధ్య జరిగిన సన్నీవేశం సినిమాకన్నా తక్కువేం కాదు. అయితే.. మ్యాచ్‌కు ముందు నుంచే ఈ పోరు గురించి చర్చ నడిచింది. నెట్ ప్రాక్టీస్‌లో సూర్యకుమార్, తారిఖ్ బౌలింగ్ స్టైల్‌ను అనుకరిస్తూ తన సహచరులకు ప్రాక్టీస్ చేయించాడు. తారిఖ్ బౌలింగ్‌ను ఎలా ఎదుర్కోవాలో ముందే ప్లాన్ చేశారు. కానీ మ్యాచ్‌లో పరిస్థితి భిన్నంగా మారింది. ఇన్నింగ్స్ చివరి దశలో వేగంగా పరుగులు చేయాలనే ఉద్దేశంతో సూర్యకుమార్ క్రీజ్‌లో తన స్టైల్‌కు తగ్గట్టు మిడ్‌వికెట్ మీదుగా భారీ షాట్ కొట్టాలని ప్రయత్నించాడు. అది అతని స్పెషల్ షాట్. కానీ ఈసారి టైమింగ్ కుదరలేదు. బంతి గాల్లోకి ఎగిరింది కానీ బౌండరీ దాటేంత దూరం వెళ్లలేదు. బంతి కింద పాకిస్థాన్ యువ ఆటగాడు సైమ్ అయూబ్ చేతికి చిక్కింది. 32 పరుగులు చేసిన సూర్యకుమార్ అవుట్ కావడం పాకిస్థాన్‌కు మ్యాచ్‌లో ఎంతో అవసరమైన బ్రేక్‌థ్రూ ఇచ్చింది.
READ MORE: Iron & Calcium: నడుము నొప్పి, నీరసంతో బాధపడుతున్నారా.? మహిళల పాలిట సంజీవని ఈ లడ్డు.!
Also Read
- International Day for the Eradication of Poverty: పేదరికం అంటే ఆకలి మాత్రమే కాదు.. కొత్త సవాళ్లివే.!
- Stain Removal Tips : నవరాత్రి వేళ తెల్లటి బట్టలపై కుంకుమ, మొండి మరకలా? ఈ చిట్కాలతో మాయం.!
- Amazon నుంచి కొత్త AI డివైజ్‌లు.. మాట్లాడిన విషయాలను గుర్తుపెట్టుకుని పనులు చేసే Bee Frontier, Bee Eclipse..!
- TVS Raider 125 అప్డేట్.. TCSతో పాటు కొత్త సేఫ్టీ ఫీచర్లు.! ధర ఎంతంటే.?
అయితే అసలు డ్రామా అక్కడితో ఆగలేదు. తన బౌలింగ్‌ను అర్థం చేసుకునేందుకు ప్రయత్నించిన ప్రపంచంలోనే అత్యంత సృజనాత్మకమైన టీ20 బ్యాట్స్‌మన్‌ను అవుట్ చేసిన ఆనందంలో ఉస్మాన్ తారిఖ్ భావోద్వేగంగా సెలబ్రేట్ చేసుకున్నాడు. తారిఖ్ సూర్యకుమార్ ముందు తలవంచి, చాతిపై చేతిని పెట్టుకుని గౌరవ వందనం చేశాడు. ఈ సీన్‌లో సూర్య లాంటి టాప్ బ్యాటర్‌ను అవుట్ చేశాననే గర్వం, గౌరవం కనిపించింది. అయితే.. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. “భారత్ ముందు, భారత ప్లేయర్స్ ముందు ఎవరైనా తవంచాల్సందే..” అంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. “ఇది భారత కెప్టెన్‌కు దాయాది జట్టు స్పిన్నర్ ఇచ్చిన గౌరవం” అని మరి కొందరు అభిప్రాయపడ్డారు. ఎలాగైతేనే సూర్యకుమార్ బ్యాటింగ్‌కు ఏ దేశస్థుడైనా ఫిదా అవ్వాల్సిందే.
తాజావార్తలు
-
Abhijeet Dipke: నోటీసులు ఇచ్చినా వినలేదు.. అభిజీత్ దిప్కేపై ఢిల్లీ పోలీసుల కీలక ప్రకటన
-
International Day for the Eradication of Poverty: పేదరికం అంటే ఆకలి మాత్రమే కాదు.. కొత్త సవాళ్లివే.!
-
Off The Record: అదితి చుట్టూ ఉన్న సలహాదారులే ఈ పరిస్థితికి కారణమా..?
-
YSRCP 2nd Candidates List: ఏపీ స్థానిక ఎన్నికలు.. రెండో విడత అభ్యర్థులను ప్రకటించిన వైసీపీ.. అభ్యర్థులు వీరే!
-
Story Board: ఎన్నికల్లో కూటమి కలిసికట్టుగా పని చేస్తుందా ?
ట్రెండింగ్
-
Stain Removal Tips : నవరాత్రి వేళ తెల్లటి బట్టలపై కుంకుమ, మొండి మరకలా? ఈ చిట్కాలతో మాయం.!
-
Amazon నుంచి కొత్త AI డివైజ్‌లు.. మాట్లాడిన విషయాలను గుర్తుపెట్టుకుని పనులు చేసే Bee Frontier, Bee Eclipse..!
-
TVS Raider 125 అప్డేట్.. TCSతో పాటు కొత్త సేఫ్టీ ఫీచర్లు.! ధర ఎంతంటే.?
-
డేటా షేరింగ్‌తో పాటు రీచార్జ్‌పై 10% వరకు డిస్కౌంట్.. Vi వినియోగదారులకు బంపర్ ఆఫర్.!
-
6500mAh బ్యాటరీ, 50MP కెమెరా, మిలిటరీ గ్రేడ్ డ్యూరబిలిటీతో TECNO Spark 50s 5G లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!