Thieves Hulchul: రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్‌లో దొంగలు రెచ్చిపోయారు. హిమాయత్ సాగర్ సౌడమ్మ దేవాలయంలోకి ఓ దొంగల ముఠా చొరబడి అమ్మవారి హుండీని పగలగొట్టడానికి విఫలయత్నం చేసింది. దాదాపు రెండు గంటల పాటు తీవ్రంగా శ్రమించిన ముగ్గురు దుండగులు.. హుండీ తాళాలు తెరచుకోకపోవడంతో పక్కనే ఉన్న కిరాణా షాప్‌లోకి దూరారు. ఆ దుకాణంలో ఉన్న కొంత డబ్బుతో పాటు సామగ్రిని దొంగిలించారు.
Ravan idol: దసరా వేడుకల్లో అపశృతి.. జనంపై పడిన కాలుతున్న రావణుడి బొమ్మ
సీసీ కెమెరాలను చూసి వాటిని ధ్వంసం చేసి అక్కడ నుంచి ఆ ముఠా సభ్యులు పారిపోయారు. సౌడమ్మ దేవాలయంలో సీసీటీవీ కెమెరాలు దొంగల దృశ్యాలు రికార్డ్ అయ్యాయి. రెండు గంటల పాటు హుండీని పగలగొట్టేందుకు దొంగలు యత్నించారు. ఆలయ పూజారి రాజేంద్రనగర్ పోలీసులకు ఫిర్యాదు చేయగా.. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా దొంగలను గుర్తించే పనిలో పోలీసులు నిమగ్నమయ్యారు.