10,000 కంటే ఎక్కువ యాప్స్, అల్ట్రా HD డిస్‌ప్లే ఉన్న Sony BRAVIA 3 Series Google టీవీపై రూ.49,900 భారీ డిస్కౌంట్!
- Sony BRAVIA 3 Series 55-ఇంచుల స్మార్ట్ టీవీపై భారీ డిస్కౌంట్
- Google TV OS ద్వారా 10,000 కంటే ఎక్కువ యాప్స్
- MRP రూ.1,18,900 కాగా.. ప్రస్తుతం రూ.68,990కి అందుబాటులో..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Sony BRAVIA 3 Series Google Tv: కొత్త టీవీ కొనాలని చూసేవారు ప్రస్తుతం ఇంట్లోనే సినిమా థియేటర్ అనుభూతిని పొందాలని ప్రతిఒక్కరూ ఆలోచిస్తున్నారు. అందుకోసం నాణ్యమైన డిస్‌ప్లే, మంచి సౌండ్ సిస్టమ్ ఉన్న టీవీని ఎంచుకోవడం కోసం అనేక ఇబ్బందులు ఎదురుకుంటున్నారు. ఇందుకోసం టీవీ రంగంలో అగ్రగామిగా కొనసాగుతున్న ‘సోనీ’ (Sony) సంబంధించిన BRAVIA 3 సిరీస్ (K-55S30B) మోడల్ క్రేజీ ఆఫర్ లో అందుబాటులోకి వచ్చింది. ప్రస్తుతం అమెజాన్‌లో ఈ టీవీపై కళ్లు చెదిరే ఆఫర్లు అందుబాటులో ఉన్నాయి. మరీ ఆ వివరాలేంటో చూసేద్దామా..
4K అల్ట్రా HD డిస్‌ప్లే:
ఈ టీవీ 55 ఇంచుల భారీ స్క్రీన్‌తో వస్తుంది. ఇందులో ఉన్న 4K HDR ప్రొసెసర్ X1 సాంకేతికత వల్ల ప్రతి దృశ్యం అత్యంత స్పష్టంగా, సహజమైన రంగులతో కనిపిస్తుంది. ఇది సాధారణ కంటెంట్‌ను కూడా 4K నాణ్యతకు దగ్గరగా అప్‌స్కేల్ చేస్తుంది.
Also Read
- WhatsApp: వాట్సాప్ లో కొత్త సెక్యూరిటీ ఫీచర్.. AI కూడా మీ చాట్ చదవలేదట! Restricted Chat ఎలా పనిచేస్తుందంటే?
- Tecno Pop 20C: రూ.10 వేల బడ్జెట్లో Tecno కొత్త ఫోన్.. 5200mAh బ్యాటరీ, 13MP కెమెరా, Android 16
- BSNL Insurance Offer: BSNL కస్టమర్లకు ఉచిత ఇన్సూరెన్స్.. రూ.1 లక్ష యాక్సిడెంటల్ డెత్ కవర్, రూ.10 వేల సైబర్ ప్రొటెక్షన్!
- Acerpure Nitro QLED TV: 100 ఇంచెస్ స్క్రీన్‌తో Acerpure Nitro TV లాంచ్.. 120Hz డిస్‌ప్లే, Dolby Vision, 65W సౌండ్!
గూగుల్ టీవీ (Google TV):
ఇది గూగుల్ టీవీ ఓఎస్‌పై పనిచేస్తుంది. దీనివల్ల మీకు ఇష్టమైన నెట్‌ఫ్లిక్స్, ప్రైమ్ వీడియో, యూట్యూబ్ వంటి 10,000 కంటే ఎక్కువ యాప్‌లు, లక్షలాది సినిమాలు, షోలను ఒకే చోట పొందవచ్చు. గూగుల్ అసిస్టెంట్ ద్వారా వాయిస్ కమాండ్స్‌తో టీవీని కంట్రోల్ చేయవచ్చు.

గేమింగ్ & ఆడియో:
గేమ్స్ ఆడేవారి కోసం ఇందులో ప్రత్యేకమైన ఫీచర్లు ఉన్నాయి. ముఖ్యంగా PS5 కోసం ‘ఆటో హెచ్‌డీఆర్ టోన్ మ్యాపింగ్’ వంటి సదుపాయాలు ఉన్నాయి. ఇక సౌండ్ విషయానికి వస్తే.. ఇందులో ఉన్న X-బ్యాలెన్స్‌డ్ స్పీకర్లు 20 వాట్స్ సౌండ్ తో సినిమాటిక్ ఆడియో అనుభూతిని అందిస్తాయి.
స్మార్ట్ కనెక్టివిటీ:
ఆపిల్ ఎయిర్‌ప్లే (Apple AirPlay), క్రోమ్‌కాస్ట్ (Chromecast) బిల్ట్-ఇన్ సదుపాయం ఉండటం వల్ల మీ ఐఫోన్ లేదా ఆండ్రాయిడ్ ఫోన్ స్క్రీన్‌ను సులభంగా టీవీలోకి షేర్ చేయవచ్చు.
భారీ ధర తగ్గింపు:
ఈ సోనీ బ్రావియా 55 ఇంచుల టీవీ ధరపై ప్రస్తుతం అమెజాన్ భారీ డిస్కౌంట్‌ను అందిస్తోంది. దీని అసలు ధర (M.R.P.) రూ. 1,18,900 కాగా.. ప్రస్తుత ఆఫర్ గా దీనిని కేవలం రూ. 68,990 కు లభిస్తుంది. అంటే ఈ టీవీపై సుమారు 42% తగ్గింపు లభిస్తుంది.
ఒకవేళ మీకు HDFC బ్యాంక్ లేదా ఇతర ప్రముఖ బ్యాంక్ క్రెడిట్ కార్డులను కలిగిఉంటే అదనంగా రూ. 6,500 వరకు ఇన్‌స్టంట్ డిస్కౌంట్ పొందే అవకాశం ఉంది. దీనివల్ల ఈ టీవీ మీకు మరింత తక్కువ ధరకే లభిస్తుంది. అలాగే నెలకు రూ.2,425 నుండి ప్రారంభమయ్యే ‘నో కాస్ట్ EMI’ సౌకర్యం కూడా అందుబాటులో ఉంది.
తాజావార్తలు
-
Shai Hope: ఎంఎస్ ధోనీ సలహాతోనే భారత్‌ను ఓడించాం.. వెస్టిండీస్ కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
Bhagyashri Borse : మాలీవుడ్లోకి భాగ్యశ్రీ బోర్సే స్టెప్ ఇన్.. మోహన్ లాల్ ఆపరేషన్ గంగాలో భాగ్యశ్రీ
-
CEC Gyanesh Kumar: జ్ఞానేష్ కుమార్‌పై విజిలెన్స్ విచారణ.. 20 ఏళ్ల నాటి కేసు మళ్లీ తెరపైకి!
-
Kadapa Murdered: కడపలో దారుణ హత్య.. మహిళను కడతేర్చి ప్రియుడు.. ఆపై ఆత్మహత్యాయత్నం!
-
Dasara movies : దసరా రేసులో 4 సినిమాలు.. ఏ సినిమాకు క్రేజ్ ఎక్కువ?
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!