Bhatti Vikramarka : ప్రజల నమ్మకమే గెలిచింది.. మధిరను మోడల్ సిటీగా మారుస్తాం..
- మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ ఘనవిజయం
- 90–95 మున్సిపాలిటీల్లో కాంగ్రెస్ ఆధిపత్యం
- ఖమ్మం జిల్లాలో ఏకపక్ష గెలుపు
- మధిరను మోడల్ సిటీగా తీర్చిదిద్దే లక్ష్యం : భట్టి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తెలంగాణ మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ సాధించిన ఘనవిజయంపై ఉపముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క హర్షం వ్యక్తం చేశారు. సోమవారం మధిరలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, కాంగ్రెస్ పార్టీని భారీ మెజార్టీతో గెలిపించిన ఓటర్లకు ధన్యవాదాలు తెలిపారు. రాష్ట్ర చరిత్రలోనే తొలిసారిగా పట్టణాల్లో కాంగ్రెస్‌కు ఈ స్థాయిలో ప్రజలు పట్టం కట్టడం చారిత్రాత్మకమని ఆయన అభివర్ణించారు.
అభివృద్ధి, సంక్షేమం , ప్రభుత్వంపై ఉన్న నమ్మకంతోనే ప్రజలు ఈ తీర్పు ఇచ్చారని భట్టి విక్రమార్క పేర్కొన్నారు. రాష్ట్రంలోని సుమారు 90 నుంచి 95 మున్సిపాలిటీలను కాంగ్రెస్ కైవసం చేసుకోవడం పార్టీ బలాన్ని నిరూపిస్తోందన్నారు. కేవలం గ్రామాల్లోనే కాకుండా పట్టణ ప్రాంతాల్లో కూడా కాంగ్రెస్ అత్యంత బలంగా ఉందని ఈ ఎన్నికల ఫలితాలు స్పష్టం చేశాయన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలో పట్టణ కేంద్రాల అభివృద్ధికి ప్రభుత్వం చేసిన కృషికి ఇది నిదర్శనమని ఆయన కొనియాడారు.
Also Read
- Vikarabad: గణేష్ నిమజ్జనంలో కలకలం.. పోలీస్ కానిస్టేబుల్‌పై కత్తితో దాడి..!
- Ganesh Immersion: హైదరాబాద్‌లో కొనసాగుతున్న గణేష్ నిమజ్జన శోభాయాత్ర.. ట్యాంక్‌బండ్ వైపు పోటెత్తిన గణనాథులు
- OTR: ఉమ్మడి ఖమ్మం జిల్లా బీఆర్ఎస్ పార్టీలో కుమ్ములాట ..అసలు కథేంటి?
- CM Revanth Reddy : దేశంలో పోరు ఆ రెండు పరివార్‌ల మధ్యే.!
Vijay Devarakonda- Rashmika:విజయ్ – రష్మిక పెళ్లి ముహూర్తం ఫిక్స్..వెడ్డింగ్ కార్డ్ వైరల్!
ముఖ్యంగా ఖమ్మం జిల్లాలోని అన్ని మున్సిపాలిటీల్లో కాంగ్రెస్ పార్టీని ఏకపక్షంగా గెలిపించిన ఓటర్లకు ఆయన ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు. ప్రజలు తమపై ఉంచిన విశ్వాసాన్ని వమ్ము చేయకుండా, ప్రభుత్వం మరింత బాధ్యతగా పనిచేస్తుందని హామీ ఇచ్చారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన ప్రతి వాగ్దానాన్ని అమలు చేసి, పట్టణ ప్రజల రుణం తీర్చుకుంటామని భట్టి విక్రమార్క స్పష్టం చేశారు.
భవిష్యత్తు ప్రణాళికల గురించి మాట్లాడుతూ, 2047 నాటికి తెలంగాణను 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దడమే తమ ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని డిప్యూటీ సీఎం వెల్లడించారు. ఇందుకోసం పారిశ్రామికీకరణ, మౌలిక వసతుల కల్పన , ఉద్యోగాల సృష్టిపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నట్లు తెలిపారు. మధిర నియోజకవర్గాన్ని మోడల్ పట్టణంగా తీర్చిదిద్దేందుకు ప్రత్యేకంగా ‘డెవలప్మెంట్ కమిటీ’ని ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించారు. “నో పాలిటిక్స్.. ఓన్లీ డెవలప్మెంట్” (రాజకీయాలు పక్కనపెట్టి కేవలం అభివృద్ధి) అనే నినాదంతో ముందుకు సాగుతామని, ఈ విజయంలో కీలక పాత్ర పోషించిన నాయకులకు, కార్యకర్తలకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు.
Akhtar-Mohsin Naqvi: క్రికెట్‌పై ఏమాత్రం అవగాహన లేదు.. మోహ్సిన్ నక్వీపై షోయబ్ అక్తర్ ఫైర్!
తాజావార్తలు
-
Indian Ocean: హిందూ మహాసముద్రంపై యుద్ధమేఘాలు..నెక్ట్స్ ఏం జరగనుంది?
-
Iran Ceasefire Proposal: ఇరాన్ శాంతి ప్రతిపాదనకు ట్రంప్ నో.. 7 రోజుల కాల్పుల విరమణ ప్లాన్ తిరస్కరణ
-
Shubman Gill Injury: సిరాజ్ దెబ్బకు శుభ్‌మన్ గిల్ విలవిలా.. నెట్స్ లో గాయపడ్డ టీమిండియా కెప్టెన్.!
-
Vikarabad: గణేష్ నిమజ్జనంలో కలకలం.. పోలీస్ కానిస్టేబుల్‌పై కత్తితో దాడి..!
-
iQOO 16: iQOO 16 లాంచ్ డేట్ ఫిక్స్.. 50MP కెమెరా, 8,400mAh బ్యాటరీ, 165Hz డిస్‌ప్లే!
ట్రెండింగ్
-
Saturday Horoscope: ఆ రాశి వారికి నేడు పట్టిందల్లా బంగారమే.. నేటి రాశిఫలాలు ఇలా.!
-
Nuclear Weapons: 12 వేలకుపైగా అణ్వాయుధాలు.. ప్రపంచానికి పొంచి ఉన్న ముప్పేంటి.?
-
iPhone 18 Pro Max Review: ఐఫోన్ 18 ప్రో మ్యాక్స్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది? రూ.1.79 లక్షలు పెట్టి కొనాలా? వద్దా?
-
Beerakaya Pachadi: వేడివేడి అన్నంలోకి నెయ్యి వేసుకుని తింటే అమృతమే.. నోరూరించే “బీరకాయ రోటి పచ్చడి” చేసేయండిలా..!
-
IND vs WI: రోహిత్ శర్మ ముందు అరుదైన రికార్డులు.. సెంచరీ చేస్తే సచిన్ సరసన.!