Iron & Calcium: నడుము నొప్పి, నీరసంతో బాధపడుతున్నారా.? మహిళల పాలిట సంజీవని ఈ లడ్డు.!
- ఐరన్, కాల్షియంతో నిండిన నువ్వుల లడ్డు
- నడుము నొప్పి, నీరసానికి సహజ పరిష్కారం
- ఇంట్లోనే సులభంగా తయారీ విధానం
- మహిళల ఆరోగ్యానికి సూపర్ ఫుడ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Iron Rich Foods for Women : భారతీయ వంటకాల్లో నువ్వుల లడ్డుకు ఒక ప్రత్యేక స్థానం ఉంది. ముఖ్యంగా సంక్రాంతి వంటి పండుగలకు నువ్వులు, బెల్లం కలిపి చేసే ఈ లడ్డులు తప్పనిసరిగా కనిపిస్తాయి. కేవలం పండుగ వంటకంగానే కాకుండా, రోజువారీ ఆహారంలోనూ ఇది ఒక గొప్ప పోషకాహారంగా (Superfood) పనిచేస్తుంది. ఎముకల బలానికి అవసరమైన కాల్షియం, శరీరంలో రక్తాన్ని పెంచే ఐరన్ వంటి పోషకాలు నువ్వుల్లో పుష్కలంగా ఉంటాయి. బెల్లంలోని తీపి , నువ్వుల కమ్మని రుచి కలిసిన ఈ లడ్డులు పిల్లల నుండి పెద్దల వరకు అందరికీ నచ్చుతాయి.

Also Read
- Child Stomach pain: స్కూల్‌కు వెళ్లే ముందు పిల్లలు కడుపునొప్పి అంటున్నారా..? అసలు కారణం ఇదే కావచ్చు!
- Gas Stove Knob Cleaning Tips : గ్యాస్ స్టవ్ నాబ్లపై జిడ్డు మరకలా?.. ఈ సింపుల్ ట్రిక్‌తో మాయం!
- Store Fresh Coconut: కొబ్బరికాయ కొట్టాక త్వరగా పాడవుతోందా?.. ఈ టిప్స్ ట్రై చేయండి.!
- Winter Skin Care: చలికాలంలో డ్రై స్కిన్‌కు చెక్ పెట్టే మీగడ క్రీమ్.. ఇంట్లోనే ఇలా తయారు చేసుకోండి
తయారీకి కావాల్సిన పదార్థాలు
రుచికరమైన నువ్వుల లడ్డులు తయారు చేసుకోవడానికి మన ఇంట్లో ఉండే సామాగ్రి సరిపోతుంది. ఒక కప్పు నువ్వులు (తెల్లటివి లేదా నల్లటివి), ముప్పావు కప్పు తురిమిన బెల్లం, అర టీస్పూన్ యాలకుల పొడి , రెండు చెంచాల నెయ్యి ఉంటే చాలు. నువ్వులను ముందుగా శుభ్రం చేసుకుని సిద్ధంగా ఉంచుకోవాలి.

తయారీ విధానం
లడ్డుల తయారీ కోసం ముందుగా స్టవ్ వెలిగించి ఒక పాన్ పెట్టుకోవాలి. అందులో నువ్వులను వేసి చిన్న మంట మీద (Low flame) దోరగా వేయించాలి. నువ్వులు చిటపటలాడుతూ, మంచి సువాసన వచ్చే వరకు వేయించి పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత అదే పాన్‌లో తురిమిన బెల్లం వేసి, కేవలం రెండు చెంచాల నీళ్లు పోసి పాకం పట్టాలి. బెల్లం పూర్తిగా కరిగి నురుగు వస్తున్నప్పుడు, ఒక గిన్నెలోని నీటిలో కొంచెం పాకం వేసి చూడాలి. అది ఉండలా తయారైతే పాకం వచ్చినట్టే. వెంటనే అందులో యాలకుల పొడి, నెయ్యి , వేయించిన నువ్వులను వేసి బాగా కలపాలి. మిశ్రమం కొంచెం వేడిగా ఉన్నప్పుడే చేతులకు నెయ్యి రాసుకుని చిన్న చిన్న ఉండలుగా చుట్టుకోవాలి.
ఆరోగ్య ప్రయోజనాలు
నువ్వుల లడ్డు తీసుకోవడం వల్ల అనేక ప్రయోజనాలు ఉన్నాయి. ఇందులో ఉండే మెగ్నీషియం రక్తపోటును అదుపులో ఉంచుతుంది. శీతాకాలంలో ఈ లడ్డులు తినడం వల్ల శరీరానికి కావాల్సిన వేడి అందుతుంది. అలాగే ఆడవారిలో హార్మోన్ల సమతుల్యతకు, ఎముకల పుష్టికి ఇది దివ్యౌషధంగా పనిచేస్తుంది. బయట దొరికే కృత్రిమ స్వీట్ల కంటే ఇంట్లోనే తయారు చేసుకునే ఈ నువ్వుల లడ్డులు ఆరోగ్యకరమైన స్నాక్ ఆప్షన్ అని చెప్పవచ్చు.
Trisha: అనవసర వివాదాల్లోకి లాగితే ఖబర్ధార్.. బీజేపీ నేతపై త్రిష ఫైర్!
తాజావార్తలు
-
Saudi Arabia Houthi Attack: సౌదీ అరేబియాలో హౌతీ రెబల్స్ దాడి.. 11 మందికి గాయాలు.. ఇద్దరు భారతీయులకు తీవ్ర గాయాలు!
-
Vaibhav Sooryavanshi: రికార్డ్స్ గురించే ఆలోచించలేదు.. అలా ఉండడంతో స్వేచ్ఛగా ఆడేసా..!
-
Wednesday Horoscope: బుధవారం దిన ఫలాలు.. ఆ రాశుల వారికి అన్నీ శుభాలే, డబ్బేడబ్బు!
-
CIA Cyber Attack: CIAపై భారీ సైబర్ దాడి.. అమెరికా నిఘా వ్యవస్థలో కలకలం!
-
Phule: 200 ఏళ్ల నాటి పోరాటంతో నవంబర్ 27న థియేటర్లలోకి ‘ఫూలే’!
ట్రెండింగ్
-
6.58mm స్లిమ్ డిజైన్, 50MP కెమెరా, 6500mAh బ్యాటరీతో Huawei Mate 90 Air లాంచ్..!
-
2TB స్టోరేజ్, 8000 నిట్స్ బ్రైట్నెస్, 6200mAh బ్యాటరీతో Huawei Mate X8 లాంచ్..!
-
టీ20ల్లో చరిత్ర సృష్టించిన Priyansh Arya.. 68 బంతుల్లో 181 పరుగులు..! క్రిస్ గేల్ రికార్డ్ బద్దలు..
-
రూ.83 వేల ప్రారంభ ధరతో ఐదు వేరియంట్లతో లాంచ్.. Suzuki Access 125 స్కూటర్లో కొత్త కలర్స్..!
-
501.7cc ఇంజిన్, మూడు వేరియంట్లు.. రెట్రో లుక్‌తో Honda CB500 బైక్..!