IND vs PAK: వైరల్‌గా మారిన సూర్యకుమార్ యాదవ్ వీడియో..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ICC Men’s T20 World Cupలో భాగంగా కొలంబోలోని ప్రేమదాస స్టేడియం వేదికగా జరిగిన ఇండియా–పాకిస్థాన్ మ్యాచ్‌లో భారత్ 61 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్ సందర్భంగా టీమ్ ఇండియా కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ ఆటగాళ్లకు ఇచ్చిన సూచనలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
మాటల యుద్ధం అవసరం లేదు..
బీసీసీఐ సోషల్ మీడియా వేదికగా షేర్ చేసిన వీడియోలో టీమిండియా కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ తన సహచరులకు స్పష్టంగా చెప్పిన సందేశం కనిపించింది. పాకిస్థాన్ ఆటగాళ్లతో స్లెడ్జింగ్ చేయకుండా.. కేవలం తమ ఆటపై మాత్రమే దృష్టి పెట్టాలని ఆయన సూచించారు. ఓవర్ల మధ్య పరిగెత్తుతూనే ఉండండి.. ఎవరితోనూ ఏమీ అనకండి.. మనం మంచి క్రికెట్ ఆడాలి.. మన నైపుణ్యాల ఆధారంగా ఈ మ్యాచ్ గెలుస్తాం.. అని సూర్య చెప్పిన మాటలు అభిమానులను ఆకట్టుకున్నాయి.
Also Read
- India vs Pakistan T20 World Cup Final: ఆఖరి బంతి వరకు ఉత్కంఠ.. 24 ఏళ్ల తర్వాత మరో ప్రపంచకప్.. ధోనీ సేన సృష్టించిన చరిత్ర
- AUS W vs PAK W: పెర్రీ సూపర్ షో.. పాకిస్థాన్‌పై 113 పరుగుల భారీ విజయంతో సెమీఫైనల్ లోకి ఆసీస్.!
- Harmanpreet Kaur: వారి వల్లే మ్యాచ్ ఓడిపోయాం.. టీమిండియా కెప్టెన్ ఫైర్.!
- Women’s T20 World Cup 2026: 'మారిజాన్ కాప్' దూకుడు.. టీమిండియాకు ప్రపంచకప్ లో తొలి ఓటమి.!
అయితే, టోర్నమెంట్‌కు ముందు పలు వివాదాలు చెలరేగినప్పటికీ, మైదానంలో మాత్రం ఎలాంటి మాటల వాగ్వాదాలు జరగలేదు. భారత్ క్రీడాస్ఫూర్తిని ప్రదర్శిస్తూ ప్రత్యర్థిపై ఆధిపత్యం చెలాయించింది. ఇక, ఓపెనర్ ఇషాన్ కిషన్ 40 బంతుల్లో 77 పరుగులు చేసి భారత ఇన్నింగ్స్‌కు బలమైన పునాది వేశాడు. అతని దూకుడైన బ్యాటింగ్‌తో భారత్ 175 పరుగుల భారీ స్కోరు నమోదు చేసింది. అయితే, పాకిస్థాన్ ఇన్నింగ్స్ మాత్రం ప్రారంభం నుంచే ఒత్తిడిలో పడింది. భారత బౌలర్లు కట్టుదిట్టమైన బౌలింగ్‌తో మ్యాచ్‌ను పూర్తిగా తమ ఆధీనంలోకి తీసుకున్నారు..
భారత బౌలర్లు పాక్ బ్యాటింగ్‌ను తొలి ఓవర్ నుంచే కట్టడి చేశారు.. భారల బౌలర్లలో బుమ్రా, హార్ధిక్ పాండ్యా, వరుణ్ చక్రవర్తి, అక్షర్ పటేల్ రెండేసి వికెట్లు తీసి.. కీలక భూమిక పోషించారు.. చివరకు పాకిస్థాన్ 114 పరుగులకే ఆలౌట్ అయింది. ఈ విజయంతో టీ20 ప్రపంచ కప్ చరిత్రలో పాకిస్థాన్‌పై భారతదేశం ఆధిక్యం 8-1కి చేరింది. అంతేకాకుండా, భారత్ సూపర్ 8 దశకు అర్హత సాధించింది. కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ ప్రదర్శించిన నాయకత్వం, ఆటగాళ్ల క్రమశిక్షణ, మరియు మైదానంలో చూపిన క్రీడాస్ఫూర్తి ఇప్పుడు అభిమానుల ప్రశంసలు అందుకుంటున్నాయి.
The Unfolding
Raw. Real. Colombo.#TeamIndia 🇮🇳 | #T20WorldCup | #MenInBlue https://t.co/W7hftULm21
— BCCI (@BCCI) February 16, 2026
తాజావార్తలు
-
Off The Record: అదితి చుట్టూ ఉన్న సలహాదారులే ఈ పరిస్థితికి కారణమా..?
-
YSRCP 2nd Candidates List: ఏపీ స్థానిక ఎన్నికలు.. రెండో విడత అభ్యర్థులను ప్రకటించిన వైసీపీ.. అభ్యర్థులు వీరే!
-
Story Board: ఎన్నికల్లో కూటమి కలిసికట్టుగా పని చేస్తుందా ?
-
Off The Record: ధర్మాన మంత్రాంగం.. వైసీపీలోకి గుండ ఫ్యామిలీ?
-
Off The Record: క్రాంతికి జనసేనలో నో ఛాన్స్?.. ముద్రగడ కుమార్తెపై సొంత పార్టీలో అసంతృప్తి!
ట్రెండింగ్
-
Stain Removal Tips : నవరాత్రి వేళ తెల్లటి బట్టలపై కుంకుమ, మొండి మరకలా? ఈ చిట్కాలతో మాయం.!
-
Amazon నుంచి కొత్త AI డివైజ్‌లు.. మాట్లాడిన విషయాలను గుర్తుపెట్టుకుని పనులు చేసే Bee Frontier, Bee Eclipse..!
-
TVS Raider 125 అప్డేట్.. TCSతో పాటు కొత్త సేఫ్టీ ఫీచర్లు.! ధర ఎంతంటే.?
-
డేటా షేరింగ్‌తో పాటు రీచార్జ్‌పై 10% వరకు డిస్కౌంట్.. Vi వినియోగదారులకు బంపర్ ఆఫర్.!
-
6500mAh బ్యాటరీ, 50MP కెమెరా, మిలిటరీ గ్రేడ్ డ్యూరబిలిటీతో TECNO Spark 50s 5G లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!