V.hanumantha Rao: కేసీఆర్ స్థాపించిన బీఆర్ఎస్ బీజేపీకి బీ టీమ్ అని కాంగ్రెస్ సీనియర్ నేత వి.హనుమంతరావు ఆరోపించారు. బీజేపీతో కేసీఆర్ ఫైట్ డూప్ ఫైట్ మాత్రమేనన్నారు. బీజేపీకి వ్యతిరేకంగా అని కేసీఆర్ చెబుతున్న మాటల్లో వాస్తవం లేదన్నారు. దేశంలో కేసీఆర్‌కు ఏ పార్టీ కూడా సహకరించదని ఆయన చెప్పారు. కేసీఆర్ రాష్ట్రంలో సంపాదించిన సొమ్మును దేశంలో ఖర్చు చేస్తారని ఆయన విమర్శించారు. దేశం కేసీఆర్‌ను పిలుస్తుందని ఆ పార్టీ నాయకులు చెబుతున్న మాటలు హాస్యాస్పదమంటూ వీహెచ్ ఎద్దేవా చేశారు.
Thieves Hulchul: రెచ్చిపోయిన దొంగలు.. హుండీ పగలగొట్టడానికి రెండు గంటల పాటు విఫలయత్నం
బీజేపీకి లాభం చేసేందుకే కేసీఆర్ జాతీయ పార్టీ నిర్ణయమని ఆయన అన్నారు. తెలంగాణలో రైతులను పట్టించుకోలేదని.. రైతులకు బేడీలు వేసిన చరిత్ర కేసీఆర్‌దంటూ వీహెచ్ మండిపడ్డారు. తెలంగాణ ప్రజల సొమ్మును దేశంలో ఇతర రాష్ట్రాల రైతులకు పంచారని అన్నారు. ప్రజల సొమ్ముతో విమానాలు కొంటున్నారని ధ్వజమెత్తారు. రాష్ట్రంలో ఏమీ చేయలేని కేసీఆర్ .. దేశంలో ఏదో చేస్తానంటే ఎవరు నమ్ముతారని ప్రశ్నించారు. కేసీఆర్ వ్యక్తిగత రాజకీయ లబ్ధి కోసమే జాతీయ పార్టీ అంటూ ఆరోపించారు. తెలంగాణ ఇస్తే పార్టీని కాంగ్రెస్‌లో విలీనం చేస్తానని సోనియాను మోసం చేసిన చరిత్ర కేసీఆర్‌ది అంటూ వీహెచ్ మండిపడ్డారు.